For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలకు రూ.200 కడితే.. నెలనెలా రూ.3000 పెన్షన్ ! ప్రధాని పెన్షన్ స్కీం పూర్తి వివరాలు

By Chanakya
|

60 ఏళ్ల వరకూ కష్టపడి పనిచేసిన తర్వాత మన ఒంట్లో శక్తి సన్నగిల్లుతుంది. అప్పటి నుంచి మహా అయితే నాలుగైదేళ్లు కష్టపడ్తరేమో కానీ.. ఆ తర్వాత అంతా డిపెండెంట్ లైఫ్. శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇతరులపై ఆధారపడాలి. అలా కాకకూడదు అనుకుంటే మనం రిటైర్ అయ్యే సమయానికి భారీగా సొమ్ము దాచుకునైనా ఉండాలి లేకపోతే నెలనెలా పెన్షన్ వచ్చే ఏర్పాట్లైనా చేసుకోవాలి. ఇది వైట్ కాలర్ వాళ్లకు కుదురుతుందేమో కానీ చిన్నాచితకా పనులు చేసుకునే వాళ్లకు, అసంఘటిత రంగంలో ఉన్న వాళ్లకు మాత్రం కుదిరే పనికాదు. అందుకే కేంద్రం తాజాగా ఈ బడ్జెట్లో ఓ భారీ పెన్షన్ స్కీమ్‌ను ప్రకటించింది. అదే ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ యోజన. దీని కింద నెలకు రూ.3 వేల పెన్షన్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం.

పన్ను ఆదా కోసం చివరి నిమిషంలో పరుగు: ఇలా చేయండి

ఏంటీ పెన్షన్ యోజన?

ఏంటీ పెన్షన్ యోజన?

ఈ స్కీమ్ ప్రకారం 60 ఏళ్లకు పైబడి వాళ్లకు నెలకు రూ.3 వేల చొప్పున ఫించన్ ఇస్తారు. ఒక వేళ పెన్షన్ పొందే కుటుంబ పెద్ద చనిపోతే తన భార్య పెన్షన్ పొందే విధంగా రూపొందించారు ఇందులో. ఈ స్కీంలో భాగంగా మన వ్యక్తిగత కంట్రిబ్యూషన్‌తో పాటు ప్రభుత్వం కూడా సరిసమానంగా మన తరపున డబ్బును చెల్లిస్తుంది.

ఎవరు అర్హులు?

కేంద్రం నిర్దేశించిన అర్హతల ప్రకారం

1. సదరు వ్యక్తి అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉండాలి.

2. అప్లికెంట్ వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

3. నెలకు ఆదాయం రూ.15 వేల లోపు ఉండాలి.

అసంఘటిత రంగంలో పనిచేయడం అంటే.. సదరు అప్లికెంట్‌కు గతంలో ఈపీఎఫ్ ఖాతా ఉండకూడదు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో కానీ ఈఎస్ఐసీలో కానీ సభ్యుడిగా ఉండి ఉండకూడదు. అలానే సదరువ్యక్తి ఆదాయపు పన్నును చెల్లించనివారై ఉండాలి.

అసంఘటిత కార్మికులంటే ఎవరు?

అసంఘటిత కార్మికులంటే ఎవరు?

లేబర్ శాఖ ప్రకారం మొత్తం 127 వృత్తుల వారిని అసంఘటిత కార్మికులుగా గుర్తించింది. దాని ప్రకారం అగర్‌బత్తీ చుట్టే కార్మికుడు, ఆషా వర్కర్స్, ఆటోమొబైల్ వర్కర్స్, బ్యూటీషియన్, బుక్ బైండర్స్, సైకిల్ రిపేరీచేసేవాళ్లు, బ్యాంగిల్స్ తయారీదార్లు, కార్పెంటర్, క్యాటరింగ్, నిర్మాణకూలీ, కొరియర్ సర్వీస్, చెప్పుల తయారీ సంస్థ కార్మికులు, బంగారుపనిచేసే వాళ్లు, పెట్రోల్ పంప్ ఉద్యోగులు, వెల్డింగ్, లాండ్రీల్లోపనిచేసే వాళ్లు. మరిన్ని వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. https://labour.gov.in/list-professions-occupations-covered

కావాల్సిన డాక్యుమెంట్లు

1. ఆధార్ కార్డ్

2. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా

3. రిజిస్ట్రేషన్‌కు మొబైల్ నెంబర్

ఈ స్కీంలో ఎలా చేరాలి

ప్రధాని శ్రమ్ యోజనలో చేరేందుకు సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లలో సంప్రదించాల్సి ఉంటుంది. ఆధార్ సహా బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

సమీపంలో ఉన్న సర్వీస్ సెంటర్లను తెలుసుకునేందుకు ఈపీఎఫ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. లేకపోతే స్థానికంగా ఉన్న ఎల్ఐసీ కార్యాలయాలను, ఈపీఎఫ్ఓ ఆఫీసులను, లేబర్ ఆఫీసులను సంప్రదించి అక్కడ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి సారి చెల్లించే కంట్రిబ్యూషన్‌ నగదు రూపంలో చెల్లించాలి. ఆ తర్వాత నెలనెలా మన బ్యాంకు ఖాతా నుంచే సొమ్ము ఈ స్కీం కిందికి వెళ్తుంది. (సీఎస్ఈ అడ్రస్ కోసం ఈ లింక్ సందర్శించండి. locator.csccloud.in )

నెలనెలా ఎంత చెల్లించాలి?

నెలనెలా ఎంత చెల్లించాలి?

18 నుంచి 40 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వాళ్లకే ఇది వర్తిస్తుంది. మీకు ఒక వేళ 18 ఏళ్ల వయస్సు ఉన్నట్టైతే నెలనెలా కేవలం రూ.55 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అదే వయస్సు పెరిగే కొద్దీ నెలకు రూ.200 వరకూ మనం నెలానెలా డబ్బు కట్టాలి. మనం ఎంత చెల్లిస్తే.. అంతే మొత్తాన్ని కేంద్రం కూడా కడ్తుంది. 18 ఏళ్ల వయస్సు వాళ్లు రూ.55, 29 ఏళ్ల వయస్సు వాళ్లు రూ.100, అదే నలభై ఏళ్ల వయస్సు వాళ్లు రూ.200 డబ్బును నెలనెలా చెల్లించాలి. (రూ.200 - గరిష్ట మొత్తం)

ఉదాహరణకు మనం నెలకు రూ.100 చెల్లిస్తే, కేంద్రం మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కింద మరో రూ.100 జత చేసి మొత్తం రూ.200ను మన తరపున మన పెన్షన్ ఖాతాకు కడ్తుంది. అలా అరవై ఏళ్ల వరకూ నెలనెలా డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే సదరు వ్యక్తికి నెలకు రూ.3000 వరకూ పెన్షన్ అందుతుంది.

తర్వాత ఏంటి?

మీరు సదరు కార్యాలయాల్లో అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మీకు ఆన్ లైన్ పెన్షన్ నెంబర్ అందుతుంది. మీకు ఆఫీస్ వాళ్లు పెన్షన్ స్కీం కార్డ్ అందజేస్తారు. ఆపై మీ బ్యాంక్ ఖాతా నుంచి నెలనెలా రూ.55 నుంచి రూ.200 వరకూ మీ వయస్సును బట్టి కట్ చేస్తారు. ఒక వేళ మధ్యలో ఏదైనా దుర్ఘటన జరిగే అప్పుడు మన ఖాతాలో జమ అయిన డబ్బును సదరు అప్లికెంట్ భార్యా,భర్త లేదా వారసులకు అందజేస్తారు. ఈ స్కీమ్ పై మరిన్ని సందేహాలు ఉంటే కేంద్రం ప్రత్యేకంగా రూపొందించిన 24 గంటల సేవా కేంద్రంలో సంప్రదించండి. ఫోన్ నెంబర్ 1800 267 6888.

Read more about: prime minister
English summary

Details of PM Pension Scheme

Step by step process to enroll for pradhani shram yogi man-dhan scheme. Pay as least as Rs.55/- to get a monthly pension of Rs.3000/- after attaining 60 years of age.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more