పెట్రోల్ బంక్ డీలర్ షిప్ పొందండి ఇలా లాభాలలో మునిగితేలండి

By Girish
Subscribe to GoodReturns Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ప్రస్తుత కాలంలో పెట్రోల్ వ్యాపారం అత్యంత లాభదాయకమైన వ్యాపారం.కానీ ఈ వ్యాపారాన్ని అందరు పెట్టాలి అనుకుంటుంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఆయిల్ కంపెనీల నుండి లైసెన్స్ పొందడం అంత ఈజీ కాదు.

    పెట్రోల్ బంక్ డీలర్ షిప్

    పెట్రోల్ బంక్ డీలర్ షిప్

    పెట్రోల్ బంక్ పెట్టాలి అంటే చాలా ఫార్మాలిటీలు , గైడ్ లైన్లు, ప్రొసీజర్లు ఉన్నాయి. అంతమాత్రాన పెట్రోల్ బంక్ డీలర్ షిప్ దొరకడం అంత కష్టం కూడా కాదు కొంచెం సహనంతో ప్రయత్నిస్తే పెట్రోల్ బంక్ డీలర్ షిప్ పొందాచ్చు.

    పెట్రోల్ బంక్ రిటైల్ అవుట్ లెట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి:

    పెట్రోల్ బంక్ రిటైల్ అవుట్ లెట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి:

    ఆయిల్ కంపెనీలు రిటైల్ అవుట్ లెట్లు తెరవడం కోసం బహిరంగంగా ప్రకటనలు విడుదల చేస్తాయి అవి వార్త పత్రికలలో మరియు కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్లలో వాటిని పెడతారు కనుక మీరు పెట్రోల్ బంక్ అవుట్ లెట్ కోసం ప్రయత్నిస్తుంటే ఎప్పటికి అప్పుడు వెబ్ సైట్ లో చెక్ చేస్తుండాలి.

     రిటైల్ అవుట్ లెట్

    రిటైల్ అవుట్ లెట్

    ఇక ఈ ప్రకటనలో ఒక రిటైల్ అవుట్ లెట్ ప్రతిపాదించిన స్థానానికి లేదా స్థానాలకు ఏర్పాటు చేయాలి అని తెలియజేస్తాయి. అస్తక్తి గల వారు రాష్ట్రము, లేదా పట్టణం, నగరం, లేదా ప్రాంతంలో పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

    హార్డ్ కాపీను

    హార్డ్ కాపీను

    దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన అప్లికేషన్లు ఆయిల్ కంపెనీ యొక్క వెబ్ సైట్లలో నోటిఫికేషన్లో ఇచ్చిన చివరి తేదీ లోపు ఆన్ లైన్లో దరఖాస్తు సమర్పించాలి.చివరి తేదీ గడువు ముగిసిన ఏడు రోజులు లోపు కంపెనీకి కావలసిన డాక్యూమెంట్ల హార్డ్ కాపీను నోటిఫుకేషన్లో ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.

    పెట్రోల్ బంక్ అవుట్ లెట్లు ఎన్ని రకాలు?

    పెట్రోల్ బంక్ అవుట్ లెట్లు ఎన్ని రకాలు?

    ఇక ఈ రిటైల్ అవుట్ లెట్లు రెండు రకాలు ఉన్నాయి.

    • ఒకటి రూరల్ రిటైల్ అవుట్ లెట్
    • రెండోది రెగ్యులర్ రిటైల్ అవుట్ లెట్.

    రూరల్ రిటైల్ అవుట్ లెట్ అంటే అర్బన్ మరియు సెమి అర్బన్ లో ఏర్పాటు చేసుకొనే పెట్రోల్ బంకులు, ఇవి స్టేట్ హైవే లేదా నేషనల్ హైవే దగ్గర ఏర్పాటు చేయడం కుదరదు.

    ఇక రెగ్యులర్ రిటైల్ అవుట్ లెట్లు అంటే స్టేట్ హై వే పై పెట్టుకోవాల్సిన పెట్రోల్ బంకులు.

    ఇక రూరల్ రిటైల్ అవుట్ లేట్ అప్లికేషన్ ఫీజు రూ.100 మరియు రెగ్యులర్ రిటైల్ అవుట్ లేట్ అప్లికేషన్ ఫీజు రూ.1000 ఉంటుంది ఇందులో SC మరియు ST సోదరులకు 50 శాతం తగ్గింపు ఉంటుంది.

    పెట్రోల్ బంక్ రిటైల్ అవుట్ లేట్ ఏర్పాటు చేయడానికి ఎంత పెట్టుబడి కావాలి:

    పెట్రోల్ బంక్ రిటైల్ అవుట్ లేట్ ఏర్పాటు చేయడానికి ఎంత పెట్టుబడి కావాలి:

    ఇక రూరల్ రిటైల్ అవుట్ లేట్ ఏర్పాటు చేయడానికి అలాగే బంక్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ.12 లక్షలు అవసరం ఉంటుంది. ఇక రెగ్యులర్ రిటైల్ అవుట్ లేట్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ.25 లక్షలు అవసరం ఉంటుంది.

    పెట్రోల్ బంక్ రిటైల్ అవుట్ లేట్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు:

    పెట్రోల్ బంక్ రిటైల్ అవుట్ లేట్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు:

    • దరఖాస్తుదారుడు భారత పౌరసత్వం కలిగి భారతదేశ నివాసి అయి ఉండాలి.
    • దరఖాస్తుదారుని వయస్సు 21 నుండి 55 వరకు ఉండాలి.
    • ధరఖాస్తుదారుడి విద్యార్హత పది, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఏదన్నా కలిగి ఉండాలి.
    • దరఖాస్తుదారుడు పెట్రోల్ బంక్ పెట్టడానికి అనువైన స్థలం సొంతం లేదా లీజు పద్దతిలో తీసుకోని చూపించాలి.
    పెట్రోల్ బంక్ రిటైల్ అవుట్ లేట్ పెడితే ఆదాయం ఎలా ఉంటుంది?

    పెట్రోల్ బంక్ రిటైల్ అవుట్ లేట్ పెడితే ఆదాయం ఎలా ఉంటుంది?

    పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి ఇక డీజిల్ అమ్మకం ధర పై సుమారు 2 .5 శాతం కమిషన్ ఉంటుంది. ఇక పెట్రోల్ అమ్మకం ధర పై 3 శాతం కమిషన్ ఉంటుంది.

    HPCL అధికారిక వెబ్ సైట్ కోసం

    BPCL అధికారిక వెబ్ సైట్ కోసం IOCL అధికారిక వెబ్ సైట్ కోసం

    Read more about: petrol
    English summary

    How to Get Petrol Pump Dealership and How to Apply Online for Retail Outlet License

    Petrol Business is the most lucrative business in the current period but it is not easy to get this business because it is not easy to get licenses from oil companies.
    Story first published: Wednesday, October 10, 2018, 12:21 [IST]
    Company Search
    Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
    Thousands of Goodreturn readers receive our evening newsletter.
    Have you subscribed?

    Find IFSC

    Get Latest News alerts from Telugu Goodreturns

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more