For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్షల కోట్లు పంపుతున్న NRI లు ఎక్కడికో తెలుసా? మీరే చూడండి!

By Sabari
|

విదేశాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ ప్రవాస భారత (ఎన్‌ఆర్‌ఐ) కార్మికులు, ఉద్యోగులు స్వదేశానికి పెద్ద మొత్తంలో నిధులు పంపిస్తున్నారు. గత ఏడాది (2017) వీరు పంపించిన మొత్తం 6,900 కోట్ల డాలర్లు. ప్రస్తుత డాలర్‌ మారకం రేటు ప్రకారం చూస్తే ఇది దాదాపు రూ.4.62 లక్షల కోట్లకు సమానం.

ప్రపంచంలో మరే దేశ ప్రవాసులు

ప్రపంచంలో మరే దేశ ప్రవాసులు

ప్రపంచంలో మరే దేశ ప్రవాసులు స్వదేశానికి ఇంత భారీ స్థాయిలో నిధులు పంపించడం లేదు. అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్ఎడి) తన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ప్రవాసుల నుంచి ఏటా ఇలా అత్యధిక నిధులు అందుకుంటున్న దేశాల్లో భారత్‌ తర్వాత చైనా (6,400 కోట్ల డాలర్లు), ఫిలిప్పీన్స్‌ (3,300 కోట్ల డాలర్లు), పాకిస్థాన్‌ (2,000 కోట్ల డాలర్లు), వియత్నాం (1,400 కోట్ల డాలర్లు) దేశాలు ఉన్నాయి.

గల్ఫ్‌ దేశాల నుంచే

గల్ఫ్‌ దేశాల నుంచే

గల్ఫ్‌ దేశాల నుంచే ఎక్కువ ప్రవాస భారతీయులు భారత్‌కు పంపించే నిధుల్లో ఎక్కువ భాగం గల్ఫ్‌ దేశాల నుంచే వస్తోంది. గత ఏడాది మన దేశానికి ఇలా అందిన నిధుల్లో 32 శాతం గల్ఫ్‌ దేశాల నుంచి, 26 శాతం ఉత్తర అమెరికా దేశాల నుంచి, 12 శాతం నిధులు ఐరోపా దేశాల్లోని ప్రవాసుల నుంచి అందాయి. ఇటీవల ఎదుగూ బొదుగూ లేకపోయినా 2008 నుంచి చూస్తే మాత్రం ఇలా పంపించే నిధుల ప్రవాహం ఏటా 4.87 శాతం చొప్పున పెరిగిందని ఐఎఫ్ఎడి నివేదిక తెలిపింది.

పల్లెలకే ఎక్కువ

పల్లెలకే ఎక్కువ

పల్లెలకే ఎక్కువ సొమ్ముఈ నిధుల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల ప్రజలకే అందుతున్నాయి. ఇలా అందే నిధుల్లో నేపాల్‌లో 81 శాతం, భారత్‌లో 67 శాతం, వియత్నాంలో 66 శాతం, బంగ్లాదేశ్‌లో 65 శాతం, పాకిస్థాన్‌లో 61 శాతం, ఫిలిప్పీన్స్‌లో 56 శాతం గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నట్టు ఐఎ్‌ఫఎడి పేర్కొంది .కంటెంట్ ఫ్రొమ్ ఏబిన్.

English summary

లక్షల కోట్లు పంపుతున్న NRI లు ఎక్కడికో తెలుసా? మీరే చూడండి! | Where Do NRIs Send Millions of Crores

NRIs and employees are paying huge amount of funds to repatriation of the wings in abroad.
Story first published: Monday, May 14, 2018, 16:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X