For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌తి సంపాద‌న ప‌రుడికి బీమా పాల‌సీ అవ‌స‌రం ఏమి?

జీవిత బీమా అన్నది అనుకోకుండా ఏమైనా జరిగితే కుటుంబ కుటుంబ ఆర్ధికావసరాలు కాపాడుకునేందు తీసుకొచ్చింది. కుటుంబం మనుగడకు ఎలాంటి ఆర్దిక సయస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ఇలాంటి పాలసీలను తీసుకుంటాం. ఈ జీవిత

|

మ‌న కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా బ్యాంకులో డ‌బ్బు డిపాజిట్ చేయాలా.... లేక అనుకోకుండా ఏదైన జరిగితే కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పాల‌సీ తీసుకోవాలా అనే సంశ‌యం చాలా మందికి ఉంటుంది. ఇలా జీవిత బీమా పాలసీ తీసునే వారంతా భార్య‌, పిల్ల‌ల గురించి నిత్యం ఆలోచించేదే.
అవసరమని కొందరు.., ఎవరో చెప్పారని ఇంకొందరు... ఏజెంటో, స్నేహితుడో అంటగట్టడాని మరి కొందరు.. ఇలా ఏదో ఒక జీవిత బీమా పాలసీ తీసుకుంటున్నవారందరిలో ఎన్నో సందేహాలు..సొంతంగా నిర్ణయం తీసుకోలేని ఆసక్తత. దీన్ని అవ‌కాశంగా మ‌లుచుకునేందుకు ఏజెంట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇన్ కం టాక్స్ సేవ్ చేసుకోవచ్చనో.. ఇన్సూరెన్స్ తో పాటు రిటర్న్స్ బాగా వస్తాయానో చెప్పి కమీషన్ ఎక్కువ వచ్చే పాలసీని అంటగట్టడంలో ఏజెంట్ల ఆరితేరినవారు. ఇక్కడే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

జీవిత బీమా అన్నది అనుకోకుండా ఏమైనా జరిగితే కుటుంబ కుటుంబ ఆర్ధికావసరాలు కాపాడుకునేందు తీసుకొచ్చింది. కుటుంబం మనుగడకు ఎలాంటి ఆర్దిక సయస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ఇలాంటి పాలసీలను తీసుకుంటాం. ఈ జీవిత బీమా పాలసీలపై ఏడు అపోహాలున్నట్లు బీమా రంగం నిపుణులు తేల్చారు.మ‌రి అలాంటి పాల‌సీ విష‌యంలో ఏ విష‌యాలు ఆలోచించాలి, జీవిత బీమా పాల‌సీ మ‌నిషికి ఎందుకు అవ‌స‌ర‌మో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

1. లైఫ్ ఇన్సూరెన్స్ వృధా అని మీ భావ‌నా...?

1. లైఫ్ ఇన్సూరెన్స్ వృధా అని మీ భావ‌నా...?

లైఫ్ ఇన్సూరెన్స్ అనేది జీవితానికి ఓ ధీమా ఉండేందుకు ప్రవేశపెట్టింది. ఇది మనకెందుకు... మనం బాగానే ఉన్నాం కదా.. ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పడెందుకు డబ్బు కట్టాలి అనేకునే వారే ఎక్కువ. అయితే ఇది సరైనది కాదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం ఎవ్వరి వల్లా కాదు. మరో వైపు ఈ జీవిత బీమా పాలసీ ఎక్కవ డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఇది వేస్ట్.. అనే కారణంతో పాలసీ వద్దంటారు. ఇది అపోహే ఎందుకంటే చాలా తక్కువ ప్రీమీయంతో ఎక్కువ రిస్క్ అంటే ఏదైన జరిగితే ఎక్కువ మొత్తం కుటుంబానికి డబ్బు చెల్లించే పాలసీలెన్నె ఉన్నాయి. ఇందులో టర్మ్ పాలసీలు ఒకటి .. అనుకోకుండా ప్రమాదం జరిగి లేదా ఇతర కారణాలతో మరణిస్తే చెల్లించే ప్రిమియంకు అనుగుణంగా పాలసీ మొదట్లో హామీ ఇచ్చిన మొత్తం వెంటనే కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.

2. ప‌న్నులను తగ్గించుకునేందుకే కాదు బీమా పాల‌సీ

2. ప‌న్నులను తగ్గించుకునేందుకే కాదు బీమా పాల‌సీ

ఇన్ కం ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందేందుకు జీవిత భీమా పాలసీ చేస్తే రెండు విధాలుగా లాభాలుంటాయని ఆలోచించే వారెక్కవ. కాని ఇది పొరపాటు. లైఫ్ ఇన్సూరెన్స ఉద్దేశ్యమే వేరు. టాక్స్ సేవింగ్ కోసం మ్యూచువల్ ఫండ్స్, టాక్స్ సేవింగ్ బాండ్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు. లైప్ ఇన్సూరెన్స్ కోసం కట్టే ప్రీమీయం మొత్తానికి మినహాయింపు ఉంటుంది కాని జీవితా బీమా అనేది మీ తదనంతరం మీ కుటుంబం అవవసరాల కోసం అనేది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చేసే పాలసీ మీ సంవత్సర ఆదాయం కంటే 7 నుంచి 10 రెట్లు కవర్ అయ్యేటట్లు ఉండాలి.

3. యువ‌త‌కు సైతం లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి

3. యువ‌త‌కు సైతం లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి

చదువు పూర్తై ఇప్పడే ఉద్యోగంలో చేరారా.. లేదా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టారా...మీరు తప్పకుండా జీవిత బీమా చేయండీ. మామూలుగా నడి వయసు తరువాత ఆనారోగ్యంతో వల్లనో ఇతర కారణాల వల్లనో అకస్మాత్తు గా మరణించే అవకాశాలు ఎక్కువుంటాయి. అలాంటి వారే జీవిత బీమా చేయాలి కాని యువతకు లైఫ్ ఇన్సూరెన్స అవసరం లేదు.. అనేది సరైంది కాదు. కొత్తగా పైళ్లై వారికి ఇది మరీ ముఖ్యం. అనుకోని ప్రమాదం లో మరణిస్తే మీ జీవిత భాగస్వామికి ఇది తీరని లోటే. దీన్ని ఎలాగూ భర్తి చేయలేం. కానీ, కనీసం ఆర్దికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించే వీలు కల్పించవచ్చు. మరో విషయం ఎమిటంటే యంగ్ ఎర్నింగ్ యూత్ కు ఫైనాన్షియల్ కమిట్ మెంట్స్ తక్కువ. లైఫ్ ఇన్సూరెన్స పాలసీ తీసుకోవడం ఉత్తమం. మరో విషయం ఏమిటంటే పాలసీ కాలం పెరిగితే ప్రీమీయం తగ్గుతుంది.

4. కంపెనీ పాల‌సీ ఉంటే

4. కంపెనీ పాల‌సీ ఉంటే

ప్రభుత్వ ఉద్యోగులకు గానీ, ప్రవేటు కంపెనీల్లో పనిచేస్తున్న వారికి వారి వారి యాజమాన్యాలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాయి. దీంతో చాలా మంది మళ్లీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయడమెందుకని వాదిస్తుంటారు. కాని ఇలాంటి వాళ్లు తెలుసుకోవాల్సిందేమిటంటే ఆయా కంపెనీల్లో పనిచేస్తున్నంత వరకే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. సొంతంగా లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే మీగతా వారి మీద ఆధారపడాల్సిన అవసరముండదు. రిటైర్ అయిన తరువాత మెడకల్ ఇన్సూరెన్స్ చేసేందుకు కంపెనీలు అంగీకరించవు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఇలాంటి ఇన్సూరెన్స్ చేస్తే మలి వయసులో వైద్యం కోసం అవసరమైన ఖర్చులు తగ్గుతాయి.

5. పాలసీ తీసుకునే ముందు గమనించాల్సిన అంశాలు:

5. పాలసీ తీసుకునే ముందు గమనించాల్సిన అంశాలు:

చాలా పాలసీలు ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకునే ఛార్జీలు మొత్తం మొదటి కొద్ది సంవత్సరాల్లో వసూలు చేసే విధంగా పాలసీలను తయారు చేస్తారు. మామూలుగా ఇలాంటి ఛార్జీలు పాలసీ అమల్లో ఉండే వరకు కొద్ది కొద్ది వసూలు చేయాలి. అంటే పాలసీ ప్రారంభంలో కొన్నేళ్లు మీ పాలసీకి కొద్ది మొత్తమే జమ అవుతుంది. దీంతో మీరు నష్టపోయే అవకాశాలున్నాయి. మీరు చేయాల్సింది ఓపెన్ ఎండెడ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటె మంచింది. పాలసిీ చేసే ప్రతి సారి గుర్తించుకోవాల్సింది.. లాంగ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎప్పుడూ లాభమని.

పిల్లకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీయా.. ఆశ్చర్యపోతున్నారా. అవునండి ఇది నిజంగా మీకు .. మీ పిల్లలకు మంచింది. పిల్లల పేరు మీద తీసుకునే లైప్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమీయం.. తక్కవగా ఉండటమేకాక వారి పేరు మీద చెల్లించే ప్రీమీయం మొత్తానికి ఇన్ కం ట్యాక్స్ రాయితీని పొందొచ్చు. మరో విషయం ఏమిటంటే పిల్లల జీవితాలకు భరోసా ఇచ్చిన సంతృప్తి మిగులుతుంది.. వారికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పించిన వారవుతారు.

 జీవిత బీమా పాల‌సీని ఎలా ఎంచుకోవాలి? జీవిత బీమా పాల‌సీని ఎలా ఎంచుకోవాలి?

6. ఎవరో అడిగారని పాలసీనా...

6. ఎవరో అడిగారని పాలసీనా...

మీ స్నేహితులో... మీ బంధువో బలవంతం చేశారని లైప్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు వ‌ద్దు. ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీరు తరచూ వెళ్లె బ్యాంకుల్లో కూడ బిజినెస్ అసోసియేట్స్ మీరు ఇన్సూరెన్స్ పాలసీ చేయండంటూ ఒత్తిడి చేయడం మీకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఎవరు చెప్పినా మీకు ఏ పాలసీ అవసరమో దాన్నే తీసుకోండి. ఆన్ లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇవి ఎజెంట్ ద్వారా తీసుకునే పాలసీల కంటే 50 శాతం ప్రీమియం తగ్గుతుంది.

ఎల్ఐసీ పాల‌సీదారులు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు ఎల్ఐసీ పాల‌సీదారులు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు

English summary

ప్ర‌తి సంపాద‌న ప‌రుడికి బీమా పాల‌సీ అవ‌స‌రం ఏమి? | Why do one must have a life insurance

Life insurance brings a degree of certainty and assurance to our lives. You can pay a small sum of money in the initial years for ensuring the family and individuals who depend on you. Your children can continue their education, and your family can manage their day-to-day expenses. In short, it provides an umbrella of financial security.
Story first published: Friday, January 12, 2018, 12:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X