For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అకాల ప్రమాదాల్లో మరణాల నుంచి మీ భవిష్యత్తును మీరు ఇలా సురక్షితం చేసుకోవచ్చు

మీకు వ్యక్తిగత యాక్సిడెంట్ బీమా పథకం కొనటం చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం జరిగిన పరిస్థితిలో, దాని వలన మీ ఆస్పత్రి ఖర్చులు కలిసొస్తాయి. అదే శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే, అది ధనరూపంలో మీకు

|

మనం విలువనిచ్చి తీరవలసిన అద్భుతమైన బహుమతి జీవితం. కానీ దురదృష్టవశాత్తూ, మన ప్రపంచంలో జీవితానికి ఉన్న విలువ చాలా తక్కువ. మీరు ఏ వార్తాపత్రిక లేదా న్యూస్ వెబ్ సైట్ తిరగేసినా, మీకు కన్పించే రోడ్డు ప్రమాదాల వార్తలు చూసి షాకవుతారు. ప్రమాదకర స్థాయిలో ఉన్న రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యంగా మరియు ర్యాష్ గా బండి నడపటం, అస్సలు సహనం లేకుండా వేగం పిచ్చిలో డ్రైవింగ్ చేయటం వలన జరుగుతున్నాయి. మనం రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు, ప్రత్యేకంగా ద్విచక్రవాహనదారులు లేదా నడిచి వెళ్ళేవారు, మనం అనేక రకాల రిస్క్ ల బారిన పడతాం. అందులో అన్నిటికన్నా పెద్దది రోడ్డు యాక్సిడెంట్.

మీ కుటుంబంలో సంపాదనాపరులు మీరొక్కరే అయితే, మీకు వ్యక్తిగత యాక్సిడెంట్ బీమా పథకం కొనటం చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం జరిగిన పరిస్థితిలో, దాని వలన మీ ఆస్పత్రి ఖర్చులు కలిసొస్తాయి. అదే శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే, అది ధనరూపంలో మీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ తీవ్రగాయాలతో అతను దక్కకపోతే, అతను/ఆమె కుటుంబసభ్యులకి ఆ బ్బు అందుతుంది. వాస్తవాలు ఏంటి మరియు గణాంకాలు ఏం చెపుతున్నాయి? రోడ్డు ప్రమాదాలకి సంబంధించిన నిజాలు, గణాంకాలను ఇప్పుడు చూద్దాం. ఒక‌వేళ ఏవైనా అనుకోని ప‌రిణామాలు జ‌రిగితే ఎలా న‌ష్టాన్ని త‌గ్గించుకోవ‌చ్చో చూద్దాం.

1. దేశంలో జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాలు

1. దేశంలో జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాలు

మన దేశంలో వేగంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు వార్షికంగా జిడిపికి 3 శాతం నష్టాన్ని తీసుకొస్తున్నాయి. డేటా ప్రకారం, ఏడాదికి 5లక్షల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. అది వార్షికంగా 55,000కోట్ల రూపాయల నష్టాన్ని తెస్తోంది. భారతదేశం రోడ్డు ప్రమాదాలలో జరిగే మరణాలలో ప్రపంచంలో ముందు ఉంది. ప్రతి 4నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోతున్నారు.

ఈ నమ్మలేని నిజాలు రోడ్డుపై వ్యవహరించాల్సిన తీరు ఎంత ఘోరంగా ఉందో తెలుపుతోంది. మనం ఎప్పుడూ అన్నిటికీ పరిగెడుతూనే ఉంటాం. ఈ అనవసర హారన్ మోత శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తుంది. థియరీ ప్రకారం, ప్రతిఒక్కరు బాధ్యతగా డ్రైవింగ్ చేస్తూ, మనిషి జీవితానికి విలువనివ్వాలి.కానీ నిజాలు చేదు వాస్తవాన్ని చూపిస్తున్నాయి.

2. ఇది ఒక ప్రశ్న వద్దకి మనని తీసుకొస్తుంది

2. ఇది ఒక ప్రశ్న వద్దకి మనని తీసుకొస్తుంది

మీ భవిష్యత్తును ఈ అనూహ్య మరణాల నుంచి ఎలా సురక్షితం చేసుకోవాలి? మీరు అనుకున్నట్టు పూర్తిగా అలానే జరుగుతుందని చెప్పలేం. మీరు బాధ్యతాయుతంగా డ్రయివింగ్ చేస్తూ, ప్రయాణిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటే, అన్నిటికన్నా ముఖ్యం, మీ కుటుంబానికి వ్యక్తిగత యాక్సిడెంట్ బీమా ప్లాన్ కొనటం ఇవన్నీ చేస్తే సురక్షతను కొంతవరకూ కల్పించవచ్చు. మీ భవిష్యత్తును 100శాతం సురక్షితం చేయలేకపోయినా,అకాల మరణాల గురించి మన చేతుల్లో లేదు కాబట్టి, కనీసం మిగతావారి జీవితాలకైనా సురక్షత కల్పించవచ్చు.

అన్నిటికన్నా దారుణంగా జరిగే సంఘటనను ఊహిస్తే-రోడ్డు ప్రమాదంలో మీరు భాగమయ్యే వివిధ సంఘటనల అవకాశాలను పరిశీలిద్దాం,

4 సంఘటనల అవకాశాలు ఉన్నాయి.

3. వీటిని గురించి ఆలోచించండి

3. వీటిని గురించి ఆలోచించండి

అద్భుతం జరిగి మీరు సురక్షితంగా ఉన్నారు.

మీకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఏ తీవ్ర గాయాలు జరగలేదు.

మీరు పాక్షికంగా లేదా పూర్తిగా వికలాంగులయ్యారు.

దురదృష్టవశాత్తూ మీరు గాయాలకి బలయ్యారు.

ఆ దేవుడి ద‌య వలన ప్రమాద ఫలితం మొదటి రెండు సంఘటనలు అయితే, మీరూ, మిమ్మల్ని ప్రేమించేవారు చాలా అదృష్టవంతులు.చాలామంది అలాంటి సంఘటనలను రెండవ జన్మగా, మారటానికి మొదలుగా భావిస్తారు, ఇక అప్పటి నుండి జీవితాన్ని జాగ‌రుక‌త‌తో చూసుకోవటం మొదలుపెడతారు.

మరోవైపు ఆఖరి రెండు సంఘటనలు మీకూ, మీ కుటుంబానికి తీరని బాధను మిగులుస్తాయి. ప్రమాదబీమా ప్లాన్ కవరేజ్ లేకుండా ఉంటే మీరు దాచుకున్న డబ్బంతా మీ చికిత్సకి మరియు మీ కుటుంబం రోజువారీ గడపటానికి సరిపోతాయి. మీకు భూమికింద దాచిన లంకెబిందెల వంటివి లేకపోతే మెల్లగా మీరు పొదుపు చేసిదాచిన డబ్బంతా అయిపోతుంది, మీ కుటుంబం ఆర్థిక బాధల్లో ఇరుక్కుంటుంది.

4. ప్ర‌మాద బీమా

4. ప్ర‌మాద బీమా

కానీ, మీకు వ్యక్తిగత యాక్సిడెంట్ బీమా కవరేజ్ ఉంటే, మీ కుటుంబ ఆర్థికస్థితి అంత అస్తవ్యస్తం అవదు, ఎందుకంటే తెలివిగా మీరే ముందుచూపుతో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, బీమా పథకం మీ చికిత్స ఖర్చులను కడుతుంది. పాక్షిక లేదా పూర్తి అంగవైకల్యం వచ్చినట్లయితే, అది ముందే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. కొన్ని బీమా పథకాలైతే 2ఆధారపడిన పిల్లల చదువు ఖర్చులు కూడా పెట్టుకుంటుంది.

అదే మరణం సంభవిస్తే, మీరు లేని లోటును ఏదీ పూడ్చలేకపోయినా, బీమా ఇచ్చే సంస్థ వారు ముందే నిర్ణయించిన మొత్తాన్ని మీ కుటుంబానికి చెల్లిస్తారు. అలా మీరు అనుకున్నట్లే మీ వారి జీవితం ఇకముందు కూడా ప్రశాంతంగా గడుస్తుంది.

5. మీ కుటుంబ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సురక్షితం చేయండి

5. మీ కుటుంబ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సురక్షితం చేయండి

ఒక కుటుంబానికి, తమ కుటుంబ సభ్యుడు చనిపోవటం చాలా బాధాకర విషయం. అది ఎవరూ పూడ్చలేనిది. పైగా ఆ చనిపోయినవారు ఇంటిని నడిపే సంపాదనాపరులైతే, ఆ కుటుంబం ఆర్థికంగా కుంటుపడుతుంది. చేతిలో ఆదాయం లేక, ఆ కుటుంబం చాలా అవస్థలు పడుతుంది. ప్రమాద బీమాలు అందించే ఆర్థిక బలం వలన మీ కుటుంబం స్వతంత్రంగా జీవించే అవకాశం వస్తుంది.

6. ముగింపు!!!

6. ముగింపు!!!

పథకంలో చేరేముందు, వివిధ రకాల బీమా పథకాలను పరిశీలించి వాటిల్లో ఉత్తమమైన దానిని ఎంచుకోండి. ఎంత మొత్తం బీమా అవుతుందనే విషయానికొస్తే, అది ప్రమాదం యొక్క తీవ్రత మరియు బీమాదారుడి ఆదాయం ప్రకారం ఉంటుంది.

మీరు ఒక పథకాన్ని ఎంచుకునేముందు, పాలసీ పత్రాలన్నీ క్షుణ్ణంగా చదువుకుని, మీకు ప్లాన్ మరియు కవరేజ్ గురించి పూర్తి అవగాహన వచ్చిందో లేదో రూఢి చేసుకోండి. మీ బీమా అంచనాలను పూర్తిచేసే పథకాన్ని ఎంచుకొని, మీరు లేనప్పుడు కూడా ఆర్థికంగా అండగా ఉంటుందో లేదో అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి.

English summary

అకాల ప్రమాదాల్లో మరణాల నుంచి మీ భవిష్యత్తును మీరు ఇలా సురక్షితం చేసుకోవచ్చు | Here’s How You Can Safeguard Your Future from Accidental Deaths

Life is a beautiful gift that we must value. But, unfortunately, the value of a life in our world is very little. If you skim through a newspaper or a news website, you will be shocked at the disturbing number of road-accident related news. This alarming rate of road-accidents is a result of reckless and rash driving, along with very little patience on roads.
Story first published: Friday, January 19, 2018, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X