For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెట్రో స్టేష‌న్ల నుంచి ఓలా క్యాబ్‌ల్లో నేరుగా ఇంటికి

ఓలా మ‌నీ యాప్‌లో ఉండే సేవ‌లు సైతం టీస‌వారీలో వాడే విధంగా మార్పు చేశారు. ఈ రెండు సంస్థ‌ల భాగ‌స్వామ్యం కార‌ణంగా ప్ర‌యాణికులు మెట్రో స్మార్ట్ కార్డుల‌ను ఓలా మ‌నీతో రీచార్జీ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించ

|

మెట్రో రైలు ప్ర‌యాణికుల‌కు మ‌రింత సుఖ‌వంతమైన ప్ర‌యాణ అనుభ‌వాన్ని అందించేందుకు ఓలా క్యాబ్స్‌తో ఎల్ అండ్ మెట్రో రైలు జ‌ట్టుక‌ట్టింది. ఈ భాగ‌స్వామ్యంలో భాగంగా హైద‌రాబాద్ మెట్రో రైలు అధికారిక యాప్ టీస‌వారీ ఓలా స‌ర్వీసెస్‌తో అనుసంధానం అయింది. ఇందులో భాగంగా ఓలా మ‌నీ యాప్‌లో ఉండే సేవ‌లు సైతం టీస‌వారీలో వాడే విధంగా మార్పు చేశారు. ఈ రెండు సంస్థ‌ల భాగ‌స్వామ్యం కార‌ణంగా ప్ర‌యాణికులు మెట్రో స్మార్ట్ కార్డుల‌ను ఓలా మ‌నీతో రీచార్జీ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించారు. ఈ ప‌రిణామానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకుందాం.

 ఓలాతో జ‌ట్టు క‌ట్ట‌డం వ‌ల్ల ప్ర‌యాణికుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు

ఓలాతో జ‌ట్టు క‌ట్ట‌డం వ‌ల్ల ప్ర‌యాణికుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు

ప్ర‌యాణికులు ఓలా మ‌నీ వాలెట్ సాయంతో టీస‌వారీ యాప్‌లో ఆర్థిక లావాదేవీలు చేసుకోవ‌చ్చు.

టీస‌వారీ యాప్ నుంచే ఓలా క్యాబ్ లేదా ఓలా ఆటోను బుక్ చేసుకోవ‌చ్చు.

స్టేష‌న్ల‌లో ఉండే ఓలా కియోస్క్ ద్వారా సైతం ఓలా క్యాబ్ బుక్ చేసుకోవ‌చ్చు.

క‌స్ట‌మ‌ర్ల‌కు సంబంధించి పిక్ అప్, డ్రాప్ పాయింట్లుగా ఓలా జోన్లు ఏర్పాటు అవుతాయి. వ‌చ్చే కాలంలో ఇవి కీల‌క‌మ‌వుతాయి.

 ఓలా ప్ర‌తినిధి మాట‌

ఓలా ప్ర‌తినిధి మాట‌

ప్ర‌జా ర‌వాణా సాధ‌నాలైన బ‌స్సు స్టేష‌న్,రైల్వే స్టేష‌న్, ఎయిర్‌పోర్టు, మెట్రో స్టేష‌న్ల‌తో ఓలా మొబిలిటీ సొల్యూష‌న్ల‌ను జ‌త చేస్తున్నారు.

ఇప్పుడు హైద‌రాబాద్ మెట్రో రైలుతో భాగ‌స్వామ్యం కుదుర్చుకోవ‌డం కూడా అదే వ‌రుస‌లోనే అని ఓలా అలియెన్సెస్ డైరెక్ట‌ర్ సౌర‌భ్ మిశ్రా చెప్పారు.

దీని ద్వారా చివ‌రి వ‌ర‌కూ ప్ర‌యాణికుడి గ‌మ్యానికి ఓలా మార్గం చూపిన‌ట్లు అవుతుంది.

ల‌క్ష‌ల మంది మెట్రో ప్రయాణికుల‌కు ఓలా చేరువ‌య్యేందుకు ఇది బాట‌లు వేస్తుంది

 ఎల్ అండ్ టీ మెట్రో సీఈవో చెబుతున్న‌దిదే

ఎల్ అండ్ టీ మెట్రో సీఈవో చెబుతున్న‌దిదే

హైద‌రాబాద్ న‌గ‌రంలో 30 కి.మీ మెట్రో ద్వారా ఇప్ప‌టికే రోజుకు 2.4 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తున్నారు.

మొద‌టి ద‌శ‌లో భాగంగా నాగోలు నుంచి మియాపూర్ వ‌ర‌కూ ప్ర‌యాణికులు కాలుష్య ర‌హిత‌, త‌క్కువ ధ‌ర‌ల్లో సుఖమైన ప్ర‌యాణ అనుభూతిని పొంద‌వ‌చ్చు.

ఓలా సంస్థ‌తో భాగ‌స్వామ్యం కార‌ణంగా మెట్రో స్టేష‌న్ల నుంచి గ‌మ్య స్థానాల‌కు, ఇల్లు, కార్యాల‌యాల నుంచి మెట్రో స్టేష‌న్ల వ‌ర‌కూ ఇబ్బంది లేకుండా ప్ర‌యాణాలు సాగించ‌వ‌చ్చు

ప‌ట్ట‌ణాల్లో ఓలా సరికొత్త ప్ర‌యత్నాలు

ప‌ట్ట‌ణాల్లో ఓలా సరికొత్త ప్ర‌యత్నాలు

దేశీయ ప్ర‌యాణాల్లో స‌రికొత్త ఓర‌వ‌డిని సృష్టించేందుకు సాధ్య‌మైన అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది.

ఇందులో భాగంగానే గ‌తంలో ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద ఓలా కియోస్క్‌ల‌ను ఏర్పాటు చేశారు.

ప్ర‌స్తుతం మెట్రో రైలు మార్గాన్ని టార్గెట్ చేస్తూ ఓలా అందిస్తున్న సౌక‌ర్యాన్ని వినియోగ‌దారులు వాడుకోవ‌డం ద్వారా వేగ‌వంత‌మైన‌, సుర‌క్షిత ప్రయాణాన్ని ఆస్వాదించ‌వచ్చు.

 ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు మార్చుకోవ‌డం ఎలా?

ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు మార్చుకోవ‌డం ఎలా?

ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు మార్చుకోవ‌డం ఎలా?

 పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెన‌క్కు తెచ్చుకోవ‌డం ఎలా?

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెన‌క్కు తెచ్చుకోవ‌డం ఎలా?

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెన‌క్కు తెచ్చుకోవ‌డం ఎలా? పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెన‌క్కు తెచ్చుకోవ‌డం ఎలా?

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణంప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

Read more about: ola money ola smart cards
English summary

మెట్రో స్టేష‌న్ల నుంచి ఓలా క్యాబ్‌ల్లో నేరుగా ఇంటికి | metro smart cards can be recharged directly from Ola Money app

ommuters will also have an option to pay from their Ola Money wallet on the TSavaari app. Additionally, users will be able to book an Ola cab or Ola auto directly from their TSavaari app.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X