For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్ల‌ల పొదుపు ఖాతా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు

పిల్ల‌లు తామే స్వ‌యంగా బ్యాంకు ఖాతాను వాడుకునేలా భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించింది. ప్ర‌స్తుతం ఉన్న మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం 10 సంవ‌త్స‌రాల పైబ‌డిని పిల్ల‌లు స్వ‌యంగా బ్య

|

చిన్న‌త‌నం నుంచే పొదుపు అల‌వాటు ఉంటే పెద్ద‌య్యాక డ‌బ్బును ఎలా పొదుపు, పెట్టుడులు చేయాలో బాగా తెలుసుకోవ‌చ్చు. చిన్న‌ప్ప‌టి నుంచే పిల్ల‌లు పొదుపు అల‌వాటు నేర్చుకోవాలంటే వారికి డ‌బ్బు నిర్వ‌హ‌ణ‌, దాని విలువ తెలియాలి. అందుకే బ్యాంకులు పిల్ల‌ల పొదుపు ఖాతాను ప్ర‌వేశ‌పెట్టాయి.పిల్ల‌లు తామే స్వ‌యంగా బ్యాంకు ఖాతాను వాడుకునేలా భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించింది. ప్ర‌స్తుతం ఉన్న మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం 10 సంవ‌త్స‌రాల పైబ‌డిని పిల్ల‌లు స్వ‌యంగా బ్యాంకు ఖాతా నిర్వ‌హించుకోవ‌చ్చు.ఈ నేప‌థ్యంలో పిల్లల పొదుపు ఖాతా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

పిల్ల‌ల‌కు ఈ పొదుపు ఖాతా వ‌ల్ల క‌లిగే లాభాలు

పిల్ల‌ల‌కు ఈ పొదుపు ఖాతా వ‌ల్ల క‌లిగే లాభాలు

చిన్న వ‌య‌సులోనే బ్యాంకింగ్ వ్య‌వ‌హారంపై అవ‌గాహ‌న వ‌స్తుంది

చిన్న‌త‌నంలోనే డ‌బ్బు విలువ తెలిసి వ‌స్తుంది.

పొదుపు ప్రాముఖ్య‌త తెలిసి వ‌స్తుంది.

చిన్న‌త‌నం నుంచే ఆర్థిక ప్ర‌ణాళిక‌పై చ‌క్క‌ని అవగాహ‌న క‌లుగుతుంది.

ఖాతా స‌దుపాయాలు

ఖాతా స‌దుపాయాలు

కొత్త మార్గ‌దర్శ‌కాలు రూపొందించాక బ్యాంకులు పిల్ల‌ల ఖాతాల విష‌యంలో క‌ల్పించే సౌక‌ర్యాల‌పై ఆశాభావం ఉంది.

వ్య‌క్తిగ‌త డెబిట్ కార్డు/ చెక్కు పుస్త‌కాల‌ను బ్యాంకులు జారీ చేస్తున్నాయి.

నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉంటుంది.

కొన్ని ప‌రిమితుల‌తో మొబైల్ బ్యాంకింగ్ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నాయి.

 ఆర్థిక ప్ర‌ణాళిక‌కు పునాది

ఆర్థిక ప్ర‌ణాళిక‌కు పునాది

ఈ పిల్ల‌ల ఖాతాలో జ‌మ చేసే సొమ్మును భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు, వివాహం, ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల‌కు వీటిని ఉప‌యోగించ‌వ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు రిక‌రింగ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్ సిప్లు, ఫిక్స్ డ్ డిపాజిట్ల వంటి వాటిలో ఖాతా తెరించి దీర్ఘ‌కాలంలో ఎక్కువ మొత్తం మ‌దుపు చేసేందుకు అవ‌కాశం ఉంది.

ఒక‌సారి ఖాతా తెరిచిన త‌ర్వాత వాటినే జీవితాంతం కొన‌సాగించ‌వ‌చ్చు.

త‌ద్వారా భ‌విష్య‌త్తులో ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌కు ఇవే ఖాతాలు తోడ్ప‌డ‌తాయి.

 ముగింపు

ముగింపు

పిల్ల‌ల బ్యాంకు పొదుపు ఖాతాల్లో సాధార‌ణ వ‌డ్డీ వ‌స్తుంది.

పిల్ల‌ల‌కు త‌ర‌చూ త‌ల్లిదండ్రులు, బంధువులు అప్పుడ‌ప్పుడు ఇచ్చిన డ‌బ్బును బ్యాంకు ఖాతాలో వేయడం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో ఎక్కువ డ‌బ్బు జ‌మ‌వుతుంది.

పిల్ల‌ల‌కు డ‌బ్బు విలువ సులువుగా తెలిసి వ‌స్తుంది.

బ్యాంకింగ్ వ్య‌వ‌హారాలు ఎలా నెర‌పాలో ఒక వ‌య‌సు వ‌చ్చే స‌రికి వారికే తెలుస్తుంది.

Read more about: bajaj banking
English summary

పిల్ల‌ల పొదుపు ఖాతా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు | advantages of opening account for children in a bank

Kids savings account are ideal, if you wish to inculcate a habit of savings in your children at an early age. However, it is important to remember that the income earned through interest would be clubbed as interest earned by the parent
Story first published: Wednesday, December 20, 2017, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X