For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డులో వివిధ సేవ‌ల‌కు విధించే చార్జీలు, రుసుములు

మొద‌ట అన్ని ఉచితం అంటూనే క్రెడిట్ కార్డులు నెమ్మ‌దిగా చార్జీల బాదుడు మొద‌లెడ‌తాయి. ఈ క్ర‌మంలో క్రెడిట్ కార్డుల‌కు సంబంధించి ఉండే వివిధ రుసుముల గురించి తెలుసుకుందాం.

|

డిజిట‌ల్ చెల్లింపుల ప్ర‌స్థానం మొద‌లైన‌ప్ప‌టి నుంచి కార్డుల వాడ‌కం అంత వేగంగా పెర‌గ‌లేదు. అయితే నోట్ల ర‌ద్దు త‌ర్వాత నుంచి ఆన్‌లైన్ చెల్లింపుల,కార్డుల వాడకం కాస్త ఎక్కువైంది. దీంతో చాలా చోట్ల షాపింగ్‌ల కోసం కార్డులను వాడే వారి సంఖ్య ఎక్కువైంది. మొద‌ట డెబిట్ కార్డులు క‌లిగిన వారు సైతం మ‌ళ్లీ క్రెడిట్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. అవ‌స‌ర‌మైన చోట క్రెడిట్ కార్డు త‌ర‌చూ వాడ‌టానికి సైతం వెనుకాడ‌టం లేదు. మొద‌ట అన్ని ఉచితం అంటూనే క్రెడిట్ కార్డులు నెమ్మ‌దిగా చార్జీల బాదుడు మొద‌లెడ‌తాయి. ఈ క్ర‌మంలో క్రెడిట్ కార్డుల‌కు సంబంధించి ఉండే వివిధ రుసుముల గురించి తెలుసుకుందాం.

ప్రారంభ రుసుము:

ప్రారంభ రుసుము:

క్రెడిట్‌ కార్డు జారీ చేసే సమయంలో విధించే రుసుము. మీ క్రెడిట్ కార్డు ద‌ర‌ఖాస్తు, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ మొద‌లైన వాటికి కంపెనీకి కొంచెం ఖ‌ర్చ‌వుతుంది. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థ‌లు దీన్ని వినియోగ‌దారు నుంచే వ‌సూలు చేస్తాయి.

వార్షిక నిర్వహణకై:

వార్షిక నిర్వహణకై:

ముందుగా నిర్ణయించిన ప్రకారం సంవత్సరానికి కొంత రుసుము చెల్లించాలి. చాలా బ్యాంకులు ఉచిత క్రెడిట్ కార్డు అంటూ ఊరిస్తాయి. దీన‌ర్థం ఏంటంటే ఏడాది పాటు జాయినింగ్ ఫీజు, వార్షిక నిర్వ‌హ‌ణ రుసుముల్లాంటివి ఉండ‌వు. త‌ర్వాత రెండో ఏడాది నుంచి వార్షిక నిర్వ‌హ‌ణ రుసుము క‌ట్టాల్సిందే. దీన్ని మొద‌ట్లోనే తెలుసుకోవాలి.

డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ పొందినందుకు:

డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ పొందినందుకు:

ఇంటికి స్టేట్‌మెంట్‌ తెప్పించుకున్నందుకు వసూలు చేసే రుసుమునే డూప్లికేట్ స్టేట్ మెంట్ ఫీజు అంటారు. సాధార‌ణంగా మీరు ఇచ్చిన చిరునామాకు లేదా మెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ల‌ను నెల‌వారీ పంపుతారు. పోస్ట‌ల్ అడ్ర‌స్‌కు ఒక‌సారే ఉచితంగా స్టేట్ మెంట్ పంపుతారు. అది కాకుండా అద‌నంగా డూప్లికేట్ స్టేట్ మెంట్ అడిగారో దానికి రుసుము చెల్లించాల్సిందే.

4. ఆలస్య చెల్లింపులపై:

4. ఆలస్య చెల్లింపులపై:

నిర్ణీత గడువులోగా చెల్లించని వాటికి ఆలస్య చెల్లింపు రుసుములను పెనాల్టీగా విధిస్తారు. సాధార‌ణ వ‌డ్డీల‌తో సంబంధం లేకుండా ఇది నిర్ణీత మొత్తంలో ఉంటుంది. రూ.500 నుంచి రూ.20 వేల మ‌ధ్య అయితే అద‌నంగా ఆల‌స్య చెల్లింపు రుసుముల రూపంలో రూ.100 నుంచి రూ.600 వ‌ర‌కూ చెల్లించాలి. ఇది బ్యాంకును బ‌ట్టి మారుతూ ఉంటుంది.

5.నగదు తీసుకున్నందుకు:

5.నగదు తీసుకున్నందుకు:

ఏటీఎమ్‌ల నుంచి నగదు తీసుకుని వాడుకున్నందుకు చెల్లించే రుసుము

పరిమితికి మించి వాడుకున్నందుకు కొంత రుసుము చెల్లించాల్సిందే. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థ‌లు మాత్ర‌మే ఈ సేవ‌ను ఉచితంగా వాడుకునేందుకు అనుమ‌తిస్తున్నాయి. దాదాపు అన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు ఏటీఎమ్ నుంచి న‌గ‌దు తీసుకుంటే క్రెడిట్ కార్డుదారుల‌పై రుసుముల భారం వేస్తున్నాయి.

ప్రతి క్రెడిట్‌ కార్డుకు పరిమితి ఉంటుంది. పరిమితికి మించి వాడుకుంటే అందుకు ప్రత్యేకమైన రుసుములను విధిస్తారు.

6. సేవా రుసుము:

6. సేవా రుసుము:

క్రెడిట్‌ పరిమితి, వడ్డీ, ఇతర రుసుములన్నింటినీ కలుపుకుని వాటి మీద సేవా రుసుము ఉంటుంది.

7.ఫారిన్‌ కరెన్సీ ట్రాన్సాక్షన్స్‌ చేస్తే:

7.ఫారిన్‌ కరెన్సీ ట్రాన్సాక్షన్స్‌ చేస్తే:

మ‌నం కార్డు తీసుకున్న‌ప్పుడు ఏమో మీరు విదేశాల్లో సైతం ఈ క్రెడిట్ కార్డు వాడుకోవ‌చ్చ‌ని చెబుతారు. విదేశాల్లో కార్డును వాడుకున్నందుకు చెల్లించే రుసుము గురించి చెప్ప‌రు. ఈ విష‌యంలో కంపెనీ వాళ్ల‌కు కాల్ చేసి కార్డు వాడేముందు స్పష్ట‌త తీసుకుంటే మంచిది.

8. కార్డు రీప్లేస్‌మెంట్ కోసం

8. కార్డు రీప్లేస్‌మెంట్ కోసం

కంపెనీల్లో ఐడీ కార్డులు పోగొట్టుకుంటేనే కొత్త కార్డు ఇవ్వ‌డానికి కంపెనీలు జీతంలో కోత వేస్తాయి. అలాంటిది క్రెడిట్ కార్డు పోగొట్టుకుపోతే చాలా క‌ష్టం. కార్డు పోగొట్టుకుని మ‌ళ్లీ కార్డు కోసం అభ్య‌ర్థించేందుకు కార్డు రీప్లేస్‌మెంట్ ఫీ క‌ట్టాలి. ఒక‌వేళ కార్డు పాడైపోయి సరిగా ప‌నిచేయ‌క‌పోతే కొత్త కార్డు తీసుకునేందుకు సైతం డ‌బ్బు చెల్లించాలి. ఇందుకోసం రూ.250 నుంచి రూ.300 వ‌రకూ రుసుము ఉంటుంది

 ప్రీమియం చెల్లించ‌నందుకు బీమా పాల‌సీ ర‌ద్ద‌యిందా... ఏం చేయాలి?

ప్రీమియం చెల్లించ‌నందుకు బీమా పాల‌సీ ర‌ద్ద‌యిందా... ఏం చేయాలి?

ప్రీమియం చెల్లించ‌కపోయినందుకు పాల‌సీ ర‌ద్ద‌యిందా.. ఎలా? ప్రీమియం చెల్లించ‌కపోయినందుకు పాల‌సీ ర‌ద్ద‌యిందా.. ఎలా?

 అప్పు తీసుకున్నారు.. తిరిగి క‌ట్ట‌క‌పోతే ఏమ‌వుతుంది?

అప్పు తీసుకున్నారు.. తిరిగి క‌ట్ట‌క‌పోతే ఏమ‌వుతుంది?

బ్యాంకు రుణం తీసుకున్నారు.. తిరిగి క‌ట్ట‌క‌పోతే ఏమ‌వుతుంది?బ్యాంకు రుణం తీసుకున్నారు.. తిరిగి క‌ట్ట‌క‌పోతే ఏమ‌వుతుంది?

Read more about: credit card online fee
English summary

క్రెడిట్ కార్డులో వివిధ సేవ‌ల‌కు విధించే చార్జీలు, రుసుములు | 8 must know credit card fees and charges in India

different charges and fees related to credit card
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X