For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ స్కోర్‌పై ఏయే అంశాలు ప్ర‌భావం చూపుతాయి?

ఒక్కోసారి క్రెడిట్ స్కోర్ స‌రిగా లేక‌పోతే ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించ‌వ‌చ్చు కూడా. ఈ నేప‌థ్యంలో క్రెడిట్ స్కోర్‌ను ప్ర‌భావితం చేసే అంశాలేవో తెలుసుకుందాం.

|

రుణాన్ని త్వ‌ర‌గా ఇబ్బంది లేకుండా పొందాలంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉండ‌టం అవ‌స‌రం. అందుకే రుణం ద‌ర‌ఖాస్తు చేసేముందు క్రెడిట్ స్కోర్ స‌రిచూసుకోవ‌డం ముఖ్యం. 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణ ద‌ర‌ఖాస్తు చాలా సులువుగా ప్రాసెస్ చేస్తారు. ఒక్కోసారి క్రెడిట్ స్కోర్ స‌రిగా లేక‌పోతే ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించ‌వ‌చ్చు కూడా. ఈ నేప‌థ్యంలో క్రెడిట్ స్కోర్‌ను ప్ర‌భావితం చేసే అంశాలేవో తెలుసుకుందాం.

అప్పును తిరిగి చెల్లించే వ్య‌వ‌ధి

అప్పును తిరిగి చెల్లించే వ్య‌వ‌ధి

మీరు తీసుకున్న అప్పును ఎలా చెల్లిస్తున్నార‌నే అంశం క్రెడిట్ స్కోర్‌ను నిర్ణ‌యించ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. లోన్ డిఫాల్ట్ అవ‌డం కానీ, క్రెడిట్ కార్డు బిల్లు స‌మ‌యానుగుణంగా చెల్లించ‌క‌పోవ‌డం కానీ చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ఉంటుంది. నెల‌వారీ ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు స‌మ‌యానికి చెల్లిస్తే మంచి క్రెడిట్ స్కోర్‌ను రివార్డుగా ఇస్తారు.

క్రెడిట్ కార్డు ప‌రిమితి వాడ‌కం

క్రెడిట్ కార్డు ప‌రిమితి వాడ‌కం

క్రెడిట్ కార్డుకు ఉన్న ఎక్కువ ప‌రిమితిని త‌రుచూ వాడుకుంటూ ఉన్న‌ట్ల‌యితే క్రెడిట్‌కార్డు సొంత‌దారుపైన క్రెడిట్ బ్యూరోకు ఒక ప్ర‌తికూల అభిప్రాయం ఏర్ప‌డుతుంది. ఎప్పుడూ ఆ వ్య‌క్తి అప్పుల మీదే కొన‌సాగుతున్నాడనే భావం వ‌చ్చే అవ‌కాశం ఉంది. క్రెడిట్ కార్డు కంపెనీ మీ క్రెడిట్ కార్డు ప‌రిమితిని మొద‌టే నిర్ణ‌యిస్తుంది. మీ వాడ‌కాన్ని బ‌ట్టి మార్చుకునే వీలుంది. రీపేమెంట్ స‌రైన స‌మ‌యానికి చేస్తుంటే క్రెడిట్ స్కోర్ పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది.

ఎక్కువ రుణ ద‌ర‌ఖాస్తులు

ఎక్కువ రుణ ద‌ర‌ఖాస్తులు

క్రెడిట్ కార్డు లేదా అప్పు కోసం ద‌రఖాస్తు చేసిన‌ప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు మీ సిబిల్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందా అని విచారిస్తాయి. క్రెడిట్ స్కోర్ గురించి ఎక్కువ విచార‌ణ‌లు వ‌చ్చినా అది కార్డుదారు క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం చూప‌గ‌ల‌దు. ఇది ద‌ర‌ఖాస్తుదారు ఎక్కువ రుణాలు తీసుకునే అల‌వాటును క‌లిగి ఉన్నాడ‌నే సంకేతాల‌ను ఇస్తుంది.

రుణ కాల‌ప‌రిమితి

రుణ కాల‌ప‌రిమితి

రుణం ఎంత కాలానికి తీసుకున్నార‌నే విష‌యం సిబిల్ క్రెడిట్ స్కోర్ మీద ప్ర‌భావం చూపుతుంది. దీర్ఘ‌కాల రుణానికి సంబంధించిన వాయిదాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బాధ్య‌త‌గా చెల్లిస్తున్న‌ట్ల‌యితే క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్ర‌భావం చూపుతుంది. లోన్ డిఫాల్ట్ అవ‌డం, చెక్కు బౌన్స్ అవ‌డం వంటివి క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని క‌లిగిస్తాయి.

అన్‌సెక్యూర్డ్ లోన్లు ఎక్కువ

అన్‌సెక్యూర్డ్ లోన్లు ఎక్కువ

ఎక్కువ శాతం అన్‌సెక్యూర్డ్ రుణాలు అంటే వ్య‌క్తిగ‌త రుణం, క్రెడిట్ కార్డు ఖ‌ర్చులు ఎక్కువ చేయ‌డం వంటివి సిబిల్ క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతుంటాయి. కొన్ని బ్యాంకులు దీన్ని ఆర్థిక నిర్వ‌హ‌ణ లోపంగా భావించి అటువంటి వారికి రుణాలిచ్చేందుకు అంత‌గా సుముఖంగా ఉండ‌వు. అదే సెక్యూర్డ్ రుణాలు ఎక్కువ ఉన్న‌ట్ల‌యితే క్రెడిట్ స్కోర్ పెరిగే వీలుంది.

క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేసుకోక‌పోవ‌డం

క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేసుకోక‌పోవ‌డం

క్రెడిట్ స్కోర్‌, క్రెడిట్ రిపోర్ట్‌లో ఏవైనా త‌ప్పులున్నా స‌వ‌రించేందుకు గాను ప్ర‌తి 6 నెల‌ల‌కు క్రెడిట్ స్కోర్‌ను స‌రిచూసుకోవాల్సిన అవ‌సరం ఉంది. బ్యాంకులు మీ రుణ చ‌రిత్ర‌ను ఆల‌స్యంగా లేదా త‌ప్పుగా రిపోర్ట్ చేసినా దానికి త‌గ్గ‌ట్లుగా క్రెడిట్ స్కోర్ త‌గ్గి ఉంటుంది. అందుకే క్రెడిట్ స్కోర్‌లో త‌ప్పులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ఆయా వ్య‌క్తుల‌పైనే ఉంటుంది.

క్రెడిట్ ప‌రిమితి పెంపు

క్రెడిట్ ప‌రిమితి పెంపు

త‌రుచూ క్రెడిట్ కార్డు ప‌రిమితిని పెంచాల్సిందిగా అభ్య‌ర్థిస్తూ ఉంటే క్రెడిట్ స్కోర్‌ఫై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. ఈ విధానంలో బ్యాంకులు సిబిల్ క్రెడిట్ స్కోర్ నివేదిక‌ల‌ను అడుగుతుంటాయి. ఇలా బ్యాంకులు విచారిస్తూ పోతే క్రెడిట్ స్కోర్ త‌గ్గుతుంది. అందుకే క‌చ్చితంగా అవ‌స‌ర‌మైన‌ప్పుడే క్రెడిట్ కార్డు ప‌రిమితి పెంచాల‌ని అడ‌గాలి.

మ‌రెవ‌రో రుణానికి హామీ ఇవ్వ‌డం

మ‌రెవ‌రో రుణానికి హామీ ఇవ్వ‌డం

మ‌న‌కు బాగా కావాల్సిన వారు లేదా స్నేహితులు రుణం తీసుకునేట‌ప్పుడు గ్యారెంట‌ర్‌గా ఉండ‌మ‌ని అడిగితే హామీదారుగా ఉంటాం. ఇలా ఉంటే క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ఉండదు. కానీ మీరు హామీగా ఉన్న రుణ గ్ర‌హీత అప్పు చెల్లించ‌డంలో డీఫాల్ట్ అయినా లేదా చెల్లింపుల‌ను త‌ర‌చూ ఆల‌స్యం చేస్తున్నా క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది.

Read more about: credit score loans cibil
English summary

క్రెడిట్ స్కోర్‌పై ఏయే అంశాలు ప్ర‌భావం చూపుతాయి? | what are the factors affecting credit score

Having a good credit score is a key to easy and quick loan. The first thing that a lender will check is your credit score, when you apply for a loan. If you have a good credit score (a CIBIL Transunion score of over 750 is considered as a good)your loan application will go for further processing. But if your credit score is on the lower side, your loan application will be rejected outrightly.
Story first published: Friday, August 18, 2017, 13:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X