For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్స్ హామీగా రుణం పొంద‌డం ఎలా?

అత్య‌వ‌స‌ర‌మైతే మ్యూచువ‌ల్ ఫండ్ హామీగా సైతం రుణాన్ని పొంద‌వ‌చ్చు. ఫండ్ యూనిట్లు త‌న‌ఖాగా ఎంత రుణం పొంద‌వ‌చ్చు, ఎలా తీసుకోవాలో ఇక్క‌డ తెలుసుకుందాం.

|

జీవితంలో వివిధ ద‌శ‌ల్లో మ‌న‌కు డ‌బ్బు అవ‌స‌రం అవుతుంటుంది. ఉద్యోగం చేస్తూ కుటుంబం ఉన్న వారికి ఒక్కోసారి హ‌ఠాత్తుగా డ‌బ్బు కావాల్సి వ‌స్తుంది. అందుకోస‌మే అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేసుకోవాల‌ని ఆర్థిక ప్రణాళిక నిపుణులు చెబుతుంటారు. ఒక్కోసారి మ‌న‌కు వ‌చ్చే జీతం, మ‌నం చేసే ఖ‌ర్చుల మూలంగా దీన్ని ఏర్పాటు చేసుకోలేం. అయితే త‌క్ష‌ణ‌మే డ‌బ్బు కావాల‌న్న‌ప్పుడు మ‌న‌కు త‌ట్టే ఆలోచ‌న వ్య‌క్తిగ‌త రుణం. వ్య‌క్తిగ‌త రుణాన్ని ఇన్సూరెన్స్ పాల‌సీ హామీగా, ఎఫ్‌డీ హామీగా తీసుకోవ‌చ్చు. అయితే పెట్టుబ‌డిదారులు ఒక విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. అత్య‌వ‌స‌ర‌మైతే మ్యూచువ‌ల్ ఫండ్ హామీగా సైతం రుణాన్ని పొంద‌వ‌చ్చు. ఫండ్ యూనిట్లు త‌న‌ఖాగా ఎంత రుణం పొంద‌వ‌చ్చు, ఎలా తీసుకోవాలో ఇక్క‌డ తెలుసుకుందాం.

 మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై వ్య‌క్తిగ‌త రుణం ఎలా?

మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై వ్య‌క్తిగ‌త రుణం ఎలా?

పెట్టుబ‌డులు పెట్టే ఉద్దేశం దీర్ఘ‌కాలంలో ఆ డ‌బ్బు మంచి రాబ‌డులు ఇస్తుంద‌ని. అయితే అత్య‌వ‌స‌రంగా డ‌బ్బులు అవ‌స‌ర‌మైన‌ప్పుడు కొంత మంది షేర్ల‌ను, మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను అమ్మేస్తుంటారు. అయితే ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్‌ను అమ్యేయాల్సిన ప‌ని లేకుండా, త‌న‌ఖా పెట్టి ఏదైనా బ్యాంకు నుంచో, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ నుంచో త‌క్కువ వ‌డ్డీకి రుణం పొంద‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టిన‌ట్ల‌యితే ఆ ప‌త్రాల‌న్ని తన‌ఖాగా సులువుగా రుణం తీసుకోవ‌చ్చు. మీ ఫండ్ యూనిట్ల యాజ‌మాన్య హ‌క్కుల్ని తాత్కాలికంగా ఆయా రుణం అందించే సంస్థ‌ల పేరిట బ‌ద‌లాయించి రుణాన్ని అందించే సంస్థ‌లు దేశంలో ఎన్నో ఉన్నాయి.

రుణానికి ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలి?

రుణానికి ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలి?

మునుప‌టి లాగా బ్యాంకుల‌కు వెళ్లి ద‌ర‌ఖాస్తు ఫారాల‌న్ని పూరించి రుణం పొందే ప్ర‌క్రియ పూర్తిచేసేందుకు చాలా మందికి స‌మ‌యం ఉండ‌టం లేదు. మీ మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్లు డీమ్యాట్ రూపంలో ఉంటే ఇప్పుడు కొన్ని ఆన్‌లైన్ పోర్ట‌ళ్ల‌లో సైతం నేరుగా రుణానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్లు కాగితం రూపంలో ఉంటే మొద‌ట ఆర్థిక సంస్థ(రుణం అందించే సంస్థ‌) వ‌ద్ద రుణ అంగీకార ఒప్పందాన్ని పూర్తిచేసుకోవాలి. ఒక‌సారి మీరు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మొద‌లుపెడితే ఆర్థిక సంస్థ మ్యూచువ‌ల్ ఫండ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాస్తుంది. అందులో మీ యూనిట్ల‌ను వారి వ‌ద్ద త‌న‌ఖా పెట్టుకునేందుకు(అంటే యాజ‌మాన్య హక్కుల కోసం) అభ్య‌ర్థిస్తారు.

ఏ త‌ర‌హా ఫండ్ల‌పై

ఏ త‌ర‌హా ఫండ్ల‌పై

మీ ద‌గ్గ‌ర ఉన్న యూనిట్ల‌ను, వాటి విలువ‌ను బ‌ట్టే కాకుండా ఏ మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను త‌న‌ఖా పెడుతున్నార‌న్న దానిపై కూడా ఇచ్చే రుణం విలువ ఆధార‌ప‌డి ఉంటుంది. స‌హ‌జంగా అప్ప‌టికి ఉన్న విలువ‌లో క‌నీసం 50 శాతం సొమ్మును రుణంగా పొందే అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడైతే బ్యాంకును బ‌ట్టి, సంస్థ‌ను బ‌ట్టి యూనిట్ల విలువ‌లో 60 నుంచి 70 శాతం వ‌ర‌కూ రుణంగా ఇస్తున్నారు. చాలా బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు షేర్ల‌పై రుణం ఇచ్చిన‌ట్లే ఫండ్ యూనిట్ల హామీ ద్వారా రుణాల‌ను స‌త్వ‌రం ఇస్తున్నాయి.

ఒకవేళ రుణం క‌ట్ట‌లేక‌పోతే...

ఒకవేళ రుణం క‌ట్ట‌లేక‌పోతే...

మీరు స‌కాలంలో రుణం క‌ట్ట‌డంలో విఫ‌ల‌మైతే మీ మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను స్వాధీనం చేసుకునే హ‌క్కు రుణం అందించి సంస్థ‌కు ఉంటుంది. సులువుగా చెప్పాలంటే రుణం చెల్లించ‌కుండా డీఫాల్ట్ అయితే త‌న‌ఖా యూనిట్ల‌ను బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అమ్మేసి సొమ్ము చేసుకుంటుంది. రునం పోనూ ఇంకా యూనిట్లు మిగిలితే అవి మ్యూచువ‌ల్ ఫండ్ సొంత‌దారుకు చెందుతాయి.

త‌న‌ఖా పెట్టిన వాటి గురించి తెలుసుకోవాల్సింది ఇదే...

త‌న‌ఖా పెట్టిన వాటి గురించి తెలుసుకోవాల్సింది ఇదే...

యూనిట్ల‌పై రుణం తీర్చేదాకా వాటిని విక్ర‌యించ‌లేరు. కానీ వీటిపై వ‌చ్చే డివిడెండ్ పేరుగా మీకే అందుతుంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించ‌డంలో విఫ‌ల‌మైతే, యాజ‌మాన్య హ‌క్కుల‌ను ఉప‌యోగించుకుని వాటిని విక్రయించి డ‌బ్బు ఇవ్వాల్సిందిగా ఫండ్ హౌస్‌ను రుణ సంస్థ‌లు కోర‌తాయి. రుణం తీర్చిన త‌ర్వాత మీ యూనిట్ల‌ను రుణ సంస్థ‌లు మ్యూచువ‌ల్ ఫండ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాసి త‌న‌ఖా నుంచి మ్యూచువ‌ల్ ఫండ్ సొంత‌దారు యూనిట్ల‌ను విడుద‌ల చేయ‌మ‌ని కోరుతుంది.

Read more about: mf mutual funds
English summary

మ్యూచువ‌ల్ ఫండ్స్ హామీగా రుణం పొంద‌డం ఎలా? | How to get loan against mutual fund units

Many a times investors need money on an immediate basis for short tenure like three months to a year. The investor on such times could consider borrowing against mutual fund units.
Story first published: Monday, August 21, 2017, 12:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X