English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మ్యూచువ‌ల్ ఫండ్‌ల‌లో వుండే వివిధ ర‌కాలేవి?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ఉద్యోగం చేసుకుంటూ కోటీశ్వ‌రుడు అవ్వ‌డం చాలా క‌ష్ట‌మ‌ని నిట్టూరుస్తూ ఉంటారు చాలా మంది. దీనికి కార‌ణం మ‌నం సంపాదించే దానిలో రోజువారీ ఖ‌ర్చుల‌కు, కుటుంబ అవ‌స‌రాల‌కే ఎక్కువ ఖ‌ర్చు చేయ‌డం. అయితే ఒక ప్ర‌ణాళిక ప్రకారం దీర్ఘ‌కాల పెట్టుబ‌డులు పెట్టి 20 నుంచి 30 ఏళ్ల కాలంలో కోట్లు సంపాదించిన ఎంతో మంది మ‌దుప‌ర్లు ఉన్నారు. అయితే వీరి గురించి అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే వింటాం. కార‌ణం వారంతా చ‌డీ చ‌ప్పుడు లేకుండా త‌మ పెట్టుబ‌డి పైన మాత్ర‌మే దృష్టి పెడుతుండ‌టం. ఆ విధంగా స్టాక్‌లోనూ, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోనూ ఎంతో సంపాదించ‌వ‌చ్చ‌ని అప్పుడు అప్పుడు ఎవ‌రో చెబితే మీరు కూడా విని ఉండొచ్చు. ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు చెప్పేదాని ప్ర‌కారం సంపాదించేది ఎంతైనా పొదుపు అలవాటు ఉండి, దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక క‌లిగిన వారు కోటీశ్వ‌రుడు అవ్వ‌డం అంత పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలనెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్‌ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉంటాయి. అందుకోస‌మే వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల గురించి ఈ వారం క్లుప్తంగా తెలుసుకుందాం.

1. ఈక్విటీ ఫండ్స్‌

1. ఈక్విటీ ఫండ్స్‌

ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌ అంటారు. ఇవి చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. ఈ ఫండ్స్‌ వల్ల పెట్టుబడిదారులు కూడా ఎక్కువ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్‌ తీసుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా సరిపోయే ఫండ్స్‌ ఈక్విటీ ఫండ్స్‌.

2. డెట్‌ ఫండ్స్‌

2. డెట్‌ ఫండ్స్‌

డెట్‌ ఫండ్స్‌ ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌. అంటే మీరు ఈ ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్‌ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే రావు. ప్రభుత్వ సెక్యూరిటీస్‌, కార్పోరేట్‌ డెట్‌, బ్యాంకులు విడుదల చేసిన డెట్‌ స్కీములలో డబ్బుని పెట్టుబడి పెట్టడాన్ని డెట్‌ ఫండ్స్‌ అంటారు. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడరో అలాంటి వారికి డెట్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి.

3. బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌

3. బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌

మీ రిస్క్‌ సామర్ధ్యం ఆధారంగా ఈక్విటీల్లో పె ట్టుబడులు చేయడానికి విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆరునెలలు లేదా సంవత్సరం పాటు చిన్న మొత్తంలో బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం మంచిది. ఐదేళ్ల కాలానికైతే బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ కంటే లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ అనుకూలమైనవి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధికమించి రాబడులను అందించేది ఈక్విటీలు మాత్రమే.

4. మనీ మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

4. మనీ మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

మనీ మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మరో పేరు లిక్విడ్‌ ఫండ్స్‌. డిపాజి ట్లు, ట్రెజరీ, పేపర్ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టే ఫండ్స్‌ను మనీ మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ అంటారు. ఈ మనీ మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ తక్కువ కాలం వ్యవధికి పెట్టుబడులు పెడతారు.

గిల్ట్‌ ఫండ్స్‌

గిల్ట్‌ ఫండ్స్‌

గిల్ట్‌ ఫండ్స్‌ అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉండే ఫండ్స్‌. గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌లో పెద్దమొత్తంలో డబ్బుని మదుపు చేస్తారు. ఈ డబ్బుని బ్యాంకింగ్‌ రంగంలో మదుపు చేయడం వల్ల మీ డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ‌వ‌ర్న‌మెంట్ సెక్యూరిటీల్లో డీఫాల్ట్ రిస్క్ ఉండ‌దు.

Read more about: mf, mutual funds
English summary

types of mutual funds in India

Funds that invest in equity shares are called equity funds. They carry the principal objective of capital appreciation of the investment over a medium to long-term investment horizon. Equity Funds are high risk funds and their returns are linked to the stock markets. They are best suited for investors who are seeking long term growth. There are different types of equity funds such as Diversified funds, Sector specific funds and Index based funds.
Story first published: Friday, June 2, 2017, 13:40 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC