For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్విచ‌క్ర వాహ‌న బీమా: ముఖ్య విష‌యాలు

ద్విచ‌క్ర వాహ‌న బీమా ఉంటే మీ వాహ‌నానికి, లేదా య‌జ‌మానికి ఏదైనా న‌ష్టం క‌లిగితే దానికి సంబంధించిన న‌ష్టాన్ని పూరించుకోవచ్చు. ద్విచ‌క్ర‌వాన బీమా ద్వారా స్కూట‌ర్‌, మోటార్ సైకిల్ లేదా ఏదైనా ద్విచ‌క్ర‌వాహ‌

|

ద్విచ‌క్ర వాహ‌న బీమా ఉంటే మీ వాహ‌నానికి, లేదా య‌జ‌మానికి ఏదైనా న‌ష్టం క‌లిగితే దానికి సంబంధించిన న‌ష్టాన్ని పూరించుకోవచ్చు. ద్విచ‌క్ర‌వాన బీమా ద్వారా స్కూట‌ర్‌, మోటార్ సైకిల్ లేదా ఏదైనా ద్విచ‌క్ర‌వాహ‌నానికి ఇన్సూరెన్స్‌ను చేయిస్తే సంపూర్ణ ఆర్థిక ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అనుకోని సంఘ‌ట‌న ఏదైనా జ‌రిగితే మీకు లేదా వాహ‌నానికి క‌లిగే న‌ష్టానికి బీమా ఉంటే ఎంతైనా మంచిదే. అయితే చాలా మంది ఈ విష‌యంలో నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. దానికి సంబంధించిన ప్రాముఖ్యత తెలిసి ఉంటే ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌రు.

 ద్విచ‌క్ర వాహ‌న బీమాలోని ర‌కాలు

ద్విచ‌క్ర వాహ‌న బీమాలోని ర‌కాలు

మొత్తంగా చూస్తే బీమా పాల‌సీలు రెండు విధాలుగా ఉంటాయి. సంపూర్ణ ర‌క్ష‌ణ క‌ల్పించే ద్విచ‌క్ర వాహన బీమా, థ‌ర్డ్ పార్టీ ల‌య‌బిలిటీ. థ‌ర్డ్ పార్టీ ల‌య‌బిలిటీని ల‌య‌బిలిటీ ఓన్లీ ఇన్సూరెన్స్‌గా సైతం వ్య‌వ‌హ‌రిస్తారు. దీని ఉద్దేశం ఏంటంటే మీ వాహ‌నం ద్వారా థ‌ర్డ్ పార్టీకి జ‌రిగే న‌ష్టానికి బీమా ద్వారా న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లిస్తారు. దేశంలో ప్ర‌తి టూవీల‌ర్‌కు ఈ ర‌క‌మైన థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండ‌టాన్ని ప్ర‌భుత్వం త‌ప్ప‌నిసరి చేసింది.

సంపూర్ణ బీమా ర‌క్ష‌ణ

సంపూర్ణ బీమా ర‌క్ష‌ణ

వాహ‌నానికి సంపూర్ణ బీమా పాల‌సీ తీసుకుంటే అది థ‌ర్డ్ పార్టీకి జ‌రిగే న‌ష్టంతో పాటు టూవీల‌ర్ మ‌రియు వాహ‌నం న‌డిపిన వ్య‌క్తికి జ‌రిగిన న‌ష్టానికి కూడా పాల‌సీ ర‌క్ష‌ణ ఉంటుంది. నిబంధ‌న‌ల‌కు లోబ‌డి క‌లిగే న‌ష్టాన్ని రీయింబ‌ర్స్ చేస్తారు. స‌హజ, మాన‌వ ప్రేరేపిత విప‌త్తులు వంటి వాటి కార‌ణంగా జ‌రిగే వాహ‌న న‌ష్టం, వ్య‌క్తిగ‌త న‌ష్టాల‌కు భ‌రోసా ఉంటుంది. వాహ‌న సొంతదారు, వాహ‌నం న‌డిపిన వారు క్లెయిం పొంద‌వ‌చ్చు.

ఎటువంటి న‌ష్టాల‌కు క‌వ‌రేజీ

ఎటువంటి న‌ష్టాల‌కు క‌వ‌రేజీ

సంపూర్ణ బీమా ర‌క్ష‌ణ‌కు కాస్త ప్రీమియం ఎక్కువ ఉన్నా న‌ష్టాల‌కు పూచీ ఉంటుంది. కాబ‌ట్టి ఇది ప్ర‌యోజ‌న‌క‌రం, అవేంటో తెలుసుకుందాం.

స‌హజ విప‌త్తులు

పాక్షిక లేదా పూర్తి న‌ష్టానికి ఈ కింది వాటికి

వ‌ర‌ద‌లు

అగ్ని ప్ర‌మాదం

భూకంపం

మెరుపులు వ‌చ్చి బండికి న‌ష్టం క‌లిగిన‌ప్పుడు

బండిలో మంట‌లు వ‌చ్చి డ్యామేజీ రిగితే

మ‌ట్టి పెళ్ల‌లు, రాళ్లు విరిగి ప‌డ్డ‌ప్పుడు

తుపాను కార‌ణంగా వ‌చ్చే న‌ష్టం

క్లెయిం ఎప్పుడు?

క్లెయిం ఎప్పుడు?

వాహ‌నం చోరీకి గురైనా

వాహ‌నం పోగొట్టుకున్నా

యాక్సిడెంట్ కార‌ణంగా వాహ‌నం న‌ష్ట‌పోతే

యాక్ట్ ఆఫ్ గాడ్- వ‌ర‌ద‌లు, భూకంపం లాంటివి

యుద్దం, అల్ల‌ర్లు, అగ్ని ప్ర‌మాదం సంభవించి ద్విచ‌క్ర‌వాహ‌నం న‌ష్ట‌పోతే

Read more about: insurance two wheeler claim
English summary

ద్విచ‌క్ర వాహ‌న బీమా: ముఖ్య విష‌యాలు | Two wheeler insurance important things to know

Comprehensive two wheeler insurance provides coverage for third party liability as well as protection for the insured two wheeler and rider. overs damage to the vehicle arising out of natural and man-made calamities as well as coverage for the owner and rider.
Story first published: Monday, June 12, 2017, 14:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X