For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో టీడీఎస్ మిన‌హాయింపుల‌ను పొంద‌డం ఎలా?

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎంత మొత్తం వస్తే ట్యాక్స్ కట్టాలి? మినహాయింపు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా బ్యాంకులు రకరకాలైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల పథక

|

రిస్క్ తక్కువగా ఉండే పొదుపు గురించి అలోచించే వారికి వెంటనే గుర్తుకు వచ్చేవి ఫిక్స్‌డ్ డిపాజిట్లు. పెట్టుబడికి రక్షణ, స్ధిరమైన రాబడి వస్తుందనే నమ్మకంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎంత మొత్తం వస్తే ట్యాక్స్ కట్టాలి? మినహాయింపు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా బ్యాంకులు రకరకాలైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల పథకాలను అందిస్తుంటాయి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్ధిరంగా వడ్డీ రేటుని బ్యాంకులు చెల్లిస్తుంటాయి. అయితే వినియోగదారుడికి వడ్డీ చెల్లించడానికి ముందే టీడీస్ రూపంలో బ్యాంకులు ట్యాక్స్ రూపంలో కోత విధిస్తాయి. ఈ టీడీఎస్ నుంచి తప్పించుకోవడం ఎలాగో చూద్దాం.

 సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్:

సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్:

మనలో చాలా మంది ఈ పథకాన్నే ఎంచుకొని పొదుపు చేస్తుంటారు. ఈ పథకం కింద ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. డిపాజిట్ చేసేటప్పుడే కాల వ్వవధిని ఎంచుకుంటే ఎంత వడ్డీ వస్తుందో ముందే తెలుస్తుంది.

ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్:

ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్:

బ్యాంకులు కల్పించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేసి కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీ ప్రకారం ఐదేళ్ల వ్వవధిలో ట్యాక్స్ ఆదా డిపాజిట్ చేసినప్పుడు పరిమితికి లోబడి ఈ మినహాయింపు వర్తిస్తుంది. కాకపోతే ఇందులో పెట్టుబడిని ఐదేళ్లపాటు కొనసాగించాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్ధితుల్లో ముందుగానే తీసుకుంటే ఆ ఆర్ధిక సంవత్సరంలో ఆదాయంలో భాగంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

రికరింగ్ డిపాజిట్లు:

రికరింగ్ డిపాజిట్లు:

చాలా మంది క్రమం తప్పకుండా పొదుపు చేయడానికి అనుకూలమైన పథకం. నెలవారీ నిర్ణీత మొత్తాన్ని, నిర్ణయించున్న తర్వాత పెట్టుబడి పెట్టడమే ఈ పథకం ప్రధానుద్దేశం. ఇందులో పెట్టుబడి ప్రారంభినప్పుడే ఎంత వడ్డీ చెల్లిస్తారన్నది ముందే తెలుస్తుంది. మనకి అందుబాటులో ఉన్న పొదుపు పథకాల్లో అత్యంత అనుకూలమైనవి ఇవే.

ఫామ్ 15జీ/15హెచ్:

ఫామ్ 15జీ/15హెచ్:

ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ నుంచి అసలు వద్ద ట్యాక్స్ మినహాయించకుండా ముందుగానే బ్యాంకుకు 15జీ సమర్పించాలి. సీనియర్ సిటిజన్లయితే ఫామ్ 15హెచ్ ఇస్తే సరిపోతుంది. ఈ ఫామ్స్ ఇవ్వడం వల్ల మీకు ఇచ్చే వడ్డీపై బ్యాంకు పన్ను కోత విధించదు.

 ఎక్కువ డిపాజిట్లు ఓపెన్ చెయ్యడం:

ఎక్కువ డిపాజిట్లు ఓపెన్ చెయ్యడం:

వేరు వేరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను చేయడం వల్ల కూడా అసలు వద్ద ట్యాక్స్ కోత పడకుండా చూసుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంకు వడ్డీ రూ. 10 వేలకు మించకుండా ఉండేలా చూసుకోవాలి.

Read more about: banks fd fixed deposit money
English summary

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో టీడీఎస్ మిన‌హాయింపుల‌ను పొంద‌డం ఎలా? | how to avoid tds in fixed deposits

If an investor submits Form 15G stating that he has no taxable income, the bank would not deduct any TDS on the interest earned. For senior citizens, the requisite form to avoid TDS is 15H. You can also save TDS by timing your FD in such a way that interest for any of the financial years does not exceed Rs 10,000.
Story first published: Friday, March 3, 2017, 10:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X