For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ యాప్‌ల‌తో బ్యాంకింగ్ సుల‌భ‌త‌రం

మీ చేతిలోనే ఉన్న మొబైల్ సాయంతో యాప్‌లతోనే ఎన్నో పనులు చక్కబెట్టేయ‌వ‌చ్చు. బిల్లుల చెల్లింపులు, ఖాతాలో బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకోవటం, ఇటీవల నిర్వహించిన లావాదేవీల జాబితా (మినీ స్టేట్‌మెంట్‌), ఆన్‌లైన

|

మీ చేతిలోనే ఉన్న మొబైల్ సాయంతో యాప్‌లతోనే ఎన్నో పనులు చక్కబెట్టేయ‌వ‌చ్చు. బిల్లుల చెల్లింపులు, ఖాతాలో బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకోవటం, ఇటీవల నిర్వహించిన లావాదేవీల జాబితా (మినీ స్టేట్‌మెంట్‌), ఆన్‌లైన్‌ నిధుల బదిలీ... ఇలా ఎన్నో పనులను మొబైల్‌ యాప్‌ ద్వారా నిర్వహించే సదుపాయాన్ని బ్యాంకులు ఆవిష్కరిస్తున్నాయి. మొబైల్ ద్వారా సులభంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసేసినా.. గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సైబ‌ర్ భ‌ద్ర‌త‌, ఫోన్ పోయిన‌ప్పుడు డేటా చౌర్యానికి గుర‌వ‌డం వంటివి జ‌ర‌గొచ్చు. అందుకే ఫోన్ లాక్‌, ఫోన్ థెప్ట్ అల‌ర్ట్ వంటి వాటిని ప‌టిష్టంగా ఉంచుకొని ఈ యాప్‌ల‌ను వాడటం ద్వారా మీ బ్యాంకింగ్‌ను సుల‌భ‌త‌రం చేసుకోండి.

ఐసీఐసీఐ ఐమొబైల్‌

ఐసీఐసీఐ ఐమొబైల్‌

మొబైల్ బ్యాంకింగ్ విష‌యంలో ఐసీఐసీఐ ఎప్పుడూ ప్రైవేట్ బ్యాంకుల్లో ముందు వ‌రుస‌లో ఉంటుంది. పొదుపు ఖాతా, న‌గ‌దు లావాదేవీలు, క్రెడిట్ కార్డు, డీమ్యాట్‌, లోన్ అకౌంట్ సంబంధించిన లావాదేవీల‌న్నీ మొబైల్ ద్వారా జ‌రిగేందుకు ఐమొబైల్ యాప్ ఉప‌కరిస్తుంది. బీమా ప్రీమియంల‌ను చెల్లించ‌డంతో పాటు మొబైల్ బిల్లు, విద్యుత్ బిల్లు, డీటీహెచ్ రీచార్జీ వంటివ‌న్నీ యాప్ ద్వారా చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఖాతాలో న‌గదు నిల్వ తెలుసుకోవ‌డం, చెక్కు పుస్త‌కం కోసం అభ్య‌ర్థించ‌డం వంటి వాటి నుంచి షాపింగ్‌లో వ‌స్తు కొనుగోళ్ల‌కు సంబంధించిన చెల్లింపులు కూడా చేసే వెసులుబాటు దీని ద్వారా క‌లుగుతుంది. ప్ర‌స్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐఫోన్ వినియోగించే వారికి అందుబాటులో ఉంది.

ఎస్‌బీఐ ఫ్రీడ‌మ్‌

ఎస్‌బీఐ ఫ్రీడ‌మ్‌

ఎస్‌బీఐ ఎప్పుడూ త‌న వినియోగ‌దార్ల కోసం అన్ని రకాల ఆప్ష‌న్ల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటుంది. కాస్త ఆల‌స్యంగా యాప్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టినా సాధ్య‌మైన‌న్ని ఎక్కువ ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌చ్చింది ఎస్‌బీఐ ఫ్రీడ‌మ్‌. ఖాతాలో న‌గ‌దు నిల్వ తెలుసుకోవ‌డం, న‌గ‌దు బ‌దిలీ, మినీ స్టేట్‌మెంట్‌, మొబైల్/ డీటీహెచ్ రీచార్జీ, చెక్కు పుస్త‌కం కోసం రిక్వెస్ట్ చేసే వీలు, బిల్లు చెల్లింపులు వంటి సదుపాయాల‌న్నీ ఇక్క‌డ అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా బ‌స్సు, రైలు టిక్కెట్ల బుకింగ్‌, సినిమా టిక్కెట్ల కొనుగోలు వంటివి సైతం ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, జావా సాఫ్ట్‌వేర్ ఆధారిత మొబైల్ ఫోన్లు, బ్లాక్ బెర్రీ వినియోగ‌దారులు ఈ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవ‌చ్చు.

యాపిల్ ఐఫోన్ క‌స్ట‌మ‌ర్లు యాప్‌స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. మై మెను ఫీచర్‌ను ప్రవేశపెట్టిన మొట్ట మొదటి బ్యాంకు ఇదే కావడం విశేషం. ఈ ఫీచర్ సాయంతో 10 లావాదేవీలను వినియోగించుకోవచ్చు. మీరు ఐపిన్‌తో కేవ‌లం 4 అంకెల‌తో స‌త్వ‌ర‌మే లాగిన్ అవ్వొచ్చు. బిల్‌పే, రీచార్జీ,ట్రేడింగ్ ఆప్ష‌న్‌, బ్యాంకు శాఖ‌లు, ఏటీఎమ్ కేంద్రాల వివ‌రాల‌ను ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

యాక్సిస్ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌

యాక్సిస్ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌

ఒకే యాప్‌ ద్వారా వాలెట్‌, షాపింగ్‌, పేమెంట్‌, బ్యాంకింగ్‌ సేవలు అందించడం యాక్సిస్ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ ప్రత్యేకత. ఈ సింగిల్‌ యాప్‌ ద్వారా ఖాతాదారులు ఎవరైనా బిల్లు చెల్లింపులు, మొబైల్‌,డీటీహెచ్ రీచార్జీ, చెక్కు పుస్త‌కం కోసం అభ్య‌ర్థించ‌డం, ఎఫ్‌డీ తెర‌వ‌డం వంటివి చేయవచ్చు. నిరంతరం ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ మర్చంట్‌ చెల్లింపులు సైతం ఈ యాప్‌ ద్వారా సాధ్యమవుతాయని బ్యాంక్‌ తెలిపింది.

స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్‌:

స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్‌:

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే ఈ యాప్ ప‌నిచేస్తుంది. బిల్లు చెల్లింపులు, ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్‌(న‌గ‌దు బ‌దిలీ), రీఛార్జీ వంటివి ఇందులో చేయ‌వ‌చ్చు. ఎంపాస్‌బుక్‌ను ఆన్‌లైన్లో పొంద‌వ‌చ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కాకుండా మ‌రే చోట నుంచి కూడా ఈ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోకూడ‌ద‌ని ఎస్‌బీఐ సూచించింది.

భ‌ద్ర‌తా సూచ‌న‌లు

భ‌ద్ర‌తా సూచ‌న‌లు

1.వివిధ థర్డ్ పార్టీలు కూడా బ్యాంకుల పేరిట యాప్స్‌ని రూపొందిస్తుంటాయి. ఇలాంటివి కాకుండా మీ బ్యాంకు స్వయంగా రూపొందించిన యాప్‌ని మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. ఒకవేళ మీ బ్యాంకుకి సంబంధించిన యాప్ గానీ లేకపోతే.. మొబైల్ యాంటీవైరస్ లేకుండా స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంకు వెబ్‌సైటును ఉపయోగించకుండా ఉండటం మంచిది.

3. బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకుండా జాగ్రత్తపడాలి.

4.ఎప్పటికప్పుడు యాప్స్‌ని, ఆపరేటింగ్ సిస్టం మొదలైన వాటిని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి.

5. మెరుగైన మొబైల్ యాంటీవైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

ముగింపు

ముగింపు

సాంకేతిక పరిజ్ఞానం సృష్టించిన ఈ విప్లవం ఏటీఎం, నెట్ బ్యాంకింగ్‌ల‌తో ఆగలేదు. అక్కడి నుంచి డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌... వరకూ శరవేగంగా సాంకేతిక సేవలు విస్తరించాయి. ఇక ఇప్పుడు మొబైల్‌ బ్యాంకింగ్‌ శకం మొదలైంది. ఏవో కొన్ని తప్పించి..., ఇతర పనులకు బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అరచేతిలోనే లావాదేవీలు పూర్తిచేసే విధంగా మొబైల్‌ బ్యాంకింగ్‌ విస్తరిస్తోంది. 'మొబైల్‌ యాప్‌' ఆవిష్కరణ, దానికి దన్నుగా బలమైన సాంకేతిక సామర్థ్యం ఈ సదుపాయాన్ని సుసాధ్యం చేస్తున్నాయి.

English summary

ఈ యాప్‌ల‌తో బ్యాంకింగ్ సుల‌భ‌త‌రం | Best mobile banking apps in India useful for customers

Apps of most Indian banks are still in an evolving stage. While some are compatible on Android, many are not yet geared for the iPhone platform and many major nationalized Indian banks still haven’t come out with mobile banking applications at all. Most features offered on apps of Indian banks remain fairly standard. Here’s a quick look at the some of the more popularly used Indian bank apps.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X