For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా క‌లిగి ఉండ‌టం వ‌ల్ల క‌లిగే లాభాలు

మెచ్యూరిటీ తేదీ నాటికి ఒక నిర్ణీత వ‌డ్డీని చెల్లించే పెట్టుబ‌డి సాధ‌నం ఫిక్స్‌డ్ డిపాజిట్. సులువైన, న‌ష్ట‌భ‌యం లేని పెట్టుబ‌డి మార్గం కోసం చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఆధార‌ప‌డ‌తారు. వ‌డ్డీ రేట్లు

|

మెచ్యూరిటీ తేదీ నాటికి ఒక నిర్ణీత వ‌డ్డీని చెల్లించే పెట్టుబ‌డి సాధ‌నం ఫిక్స్‌డ్ డిపాజిట్. సులువైన, న‌ష్ట‌భ‌యం లేని పెట్టుబ‌డి మార్గం కోసం చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఆధార‌ప‌డ‌తారు. వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్న ప్ర‌స్తుత క్ర‌మంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఎక్కువ రాబ‌డి సాధించేందుకు ప్ర‌య‌త్నించాలి. సాధార‌ణ పొదుపు ఖాతా కంటే రెండింత‌ల వ‌డ్డీ రేటును ఎఫ్‌డీల ద్వారా పొంద‌వ‌చ్చు. ఇంతే కాకుండా ఎప్‌డీల ద్వారా పొందే అద‌న‌పు లాభాల‌ను ఇక్క‌డ తెలుసుకోండి.

ఎఫ్‌డీ ఖాతా తెర‌వ‌డం చాలా సులువు

ఎఫ్‌డీ ఖాతా తెర‌వ‌డం చాలా సులువు

పెట్టుబ‌డులను కొత్త‌గా మొద‌లుపెట్టేవారు ఎఫ్‌డీల‌తో త‌మ ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌ను ప్రారంభించ‌వ‌చ్చు. సాంకేతిక‌త‌తో అంత సౌల‌భ్య‌త లేనివారు నేరుగా బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఎఫ్‌డీని తెర‌వొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ఉంటే నేరుగా ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. త‌ద్వారా మీరు నిర్ణ‌యించిన కాల‌ప‌రిమితికి వ‌డ్డీని నేరుగా ఖాతాలోకి పొంద‌వ‌చ్చు.

క‌చ్చిత‌మైన రాబ‌డులు

క‌చ్చిత‌మైన రాబ‌డులు

మార్కెట్ ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఎప్‌డీల ద్వారా క‌చ్చిత‌మైన రాబ‌డుల‌ను పొంద‌వ‌చ్చు. ఈ రిట‌ర్నులు మామూలుగా పొదుపు ఖాతాలో వ‌చ్చే కంటే బాగా ఎక్కువ‌గానే ఉంటాయి. బ్యాంకుల‌న్నీ ప్ర‌స్తుతం ఎఫ్‌డీల‌పై 7 నుంచి 8 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తున్నాయి. అయితే ఇక్క‌డ ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విష‌యం ఎఫ్‌డీల‌ను మ‌ధ్య‌లో వెన‌క్కి తీసుకోకూడ‌దు. కాల‌ప‌రిమితి ముగిసే వ‌ర‌కూ కొన‌సాగించాలి. లేక‌పోతే ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై పెనాల్టీల ద్వారా రాబ‌డుల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది.

ఫ్లెక్సిబిలిటీ

ఫ్లెక్సిబిలిటీ

మీకు వీలున్న కాల‌ప‌రిమితికి కొంత సొమ్మును బ్యాంకులో పెట్టి ఉంచ‌డానికి ఎఫ్‌డీలు అనుకూలంగా ఉంటాయి. 7 రోజులు మొద‌లుకొని 10 ఏళ్ల కాల‌ప‌రిమితి వ‌ర‌కూ వివిధ ట‌ర్మ్ డిపాజిట్ల‌ను బ్యాంకులు ప్ర‌వేశ‌పెడుతున్నాయి. మీకు బ్యాంకు ఖాతా ఉన్నా లేకపోయినా ఏ బ్యాంకులో అయినా నేరుగా ఎఫ్‌డీ చేయ‌వ‌చ్చు. మీకు స‌రిపడే కాల‌ప‌రిమితి ఎంచుకోవ‌డం ద్వారా భ‌విష్య‌త్తులో ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయ‌ల్స్ లేకుండా చూసుకోండి.

ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు

ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు

పోస్టాఫీసు ఎఫ్‌డీలు 1 నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 7.10%-7.90% వ‌డ్డీని ఇవ్వ‌జూపుతున్నాయి. బంధ‌న్ బ్యాంకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల లోపు ఎఫ్‌డీల‌కు 3.50 నుంచి 8 శాతం దాకా వ‌డ్డీ ఇస్తోంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్‌(హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌) గ‌రిష్టంగా 7.85% నుంచి 7.95శాతం దాకా వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తోంది. ఐడీఎఫ్‌సీ బ్యాంకు వ‌డ్డీ రేట్లు 4.00% - 8.25% మ‌ధ్య ఉన్నాయి. మంచి ఎఫ్‌డీని ఎంచుకుని ఉత్త‌మ వ‌డ్డీని పొందండి

రిస్క్‌ల‌ను త‌ప్పించి, అప్పుల్లో ఆస‌రాగా

రిస్క్‌ల‌ను త‌ప్పించి, అప్పుల్లో ఆస‌రాగా

కొన్ని ర‌కాల పెట్టుబ‌డి సాధ‌నాలు ఎక్కువ రాబ‌డుల‌ను ఇచ్చిన‌ప్ప‌టికీ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోస‌మే మార్కెట్ రిస్క్ త‌ప్పించుకునేందుకు చాలా మంది డెట్ సాధనాల‌ను ఎంచుకుంటూ ఉంటారు. ఆయా రిస్క్‌ల నుంచి ఇన్వెస్ట‌ర్ల‌ను కాపాడేందుకు ఎఫ్‌డీలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక్కోసారి అనుకోని అప్పులు మిమ్మ‌ల్ని ఇబ్బందిపెడ‌తాయి. అప్పుడు త‌క్ష‌ణ‌మే న‌గ‌దు అవ‌స‌రం రావ‌చ్చు. అలాంట‌ప్పుడు కొత్త‌గా అప్పు చేయ‌కుండా ఎఫ్‌డీపై రుణాన్ని తీసుకోవ‌చ్చు. బ్యాంకులు ఎఫ్‌డీల‌పై 60%-90% వ‌ర‌కూ అప్పును ఇస్తాయి.

Read more about: fd fixed deposit banking
English summary

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా క‌లిగి ఉండ‌టం వ‌ల్ల క‌లిగే లాభాలు | 5 Advantages of Having a fixed deposit account

Fixed deposit is a financial instrument that pays a fixed rate of interest until a given maturity date. FDs provide investors with a higher rate of interest than a regular savings account and also have many other advantages which make them a preferable option for investment. The fixed deposit schemes offered by most banks can be availed for tenures ranging from as short as seven days to as long as 10 years.you can have these 5 advantages by having fixed deposit account in a bank or any financial institution.
Story first published: Monday, January 2, 2017, 12:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X