For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్ షాపింగ్: ఏసైట్లలో కొనుగోలు చేయాలి?

By Nageswara Rao
|

ఇంటర్నెట్‌లో ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడంతో దేశీయంగా ఆన్‌లైన్ షాపింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. వందల సంఖ్యలో ఉన్న ఈ కామర్స్ సంస్ధలు తక్కువ ధరలకే ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాయి.

పెద్ద మొత్తంలో ఆఫర్లు, డిస్కౌంట్ల హోరుతో జనాలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. పండుగలకు ఇచ్చే ఆఫర్లు ఇంకా ప్రత్యేకం. అయితే దేశీయంగా ఆన్‌లైన్ వ్యాపారం పుంజుకున్నప్పటికీ, సాంప్రదాయ మార్కెట్లకు అలవాటుపడిన కొంత మంది ఆన్‌లైన్ వ్యాపారాన్ని అనుమానంగానే చూస్తున్నారు.

ఏ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేస్తే మంచిది? వస్తువు బాగలేకపోతే ఎన్ని రోజుల్లో వెనక్కి ఇచ్చేయొచ్చు? డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయి? ఒకవేళ ఏదైనా మోసం జరిగితే ఎవరి ఫిర్యాదు చేయాలి, ఫిర్యాదుకు స్పందిస్తారా? వంటి అనేక సందేహాలు ఇంకా చాలా మందిని వేధిస్తున్నాయి.

 ఏ వెబ్‌సైట్‌లో కొనుగోలు సురక్షితం?

ఏ వెబ్‌సైట్‌లో కొనుగోలు సురక్షితం?

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి విషయమిది. ఉత్పత్తులు కొనుగోలు సందర్భంలో కస్టమర్‌కు సంబంధించిన చిరునామా (డెలివరీ కోసం), క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలు (చెల్లింపుల కోసం), మొబైల్‌ నంబర్‌ (సంప్రదించడానికి) వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సమాచారం భద్రంగా ఉంటుందా అన్న అనుమానం అందరి మదిలో ఉంటుంది. అందుకే ఏదైనా ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేసే ముందు ‘బై' బటన్‌ను క్లిక్‌ చేయగానే అడ్రస్‌ బార్‌లో ఉన్న హెచ్‌టిపిపి పక్కన ‘ఎస్‌' అనే అక్షరం వచ్చి చేరుతుంది. 'ఎస్' సెక్యూర్డ్ అని. ఇలాంటి వెబ్‌సైట్లలో మీ సమాచారం భద్రంగా ఉంటుంది.

 ఏసైట్లలో కొనుగోలు చేయాలి?

ఏసైట్లలో కొనుగోలు చేయాలి?

ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేయాలని ఆన్‌లైన్‌లో శోధించినప్పుడు ఆ ఉత్పత్తిని విక్రయించే అనేక రకాల వెబ్‌సైట్ల పేర్లు దర్శనమిస్తాయి. ఆఫర్లు కూడా కనిపిస్తాయి. వాటిలో సరైన దాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కొత్తగా కనిపిస్తున్న, అంతకు ముందు పేరు వినని ఈ కామర్స్ వెబ్ సైట్ల జోలికి వెళ్లొద్దు. బాగా పాపులరైన వెబ్‌సైట్లలో మాత్రమే షాపింగ్‌ చేయాలి.

కొనే ముందు వీటిని చూడండి

కొనే ముందు వీటిని చూడండి

ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన స్టార్‌ రేటింగ్స్‌ ఏవిధంగా ఉన్నాయో చూడాలి. చాలా ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు సంబంధిత సరుకుకు సంబంధించిన రేటింగ్స్‌ను ప్రదర్శిస్తాయి. డెలివరీ సమయం, డెలివరీ చార్జీలు, ఉత్పత్తి నాణ్యత, డబ్బుకు తగిన విలువ, డెలివరీ సంస్థకు సంబంధించి స్టార్‌ రేటింగ్స్‌ ఉంటాయి. వీటితో పాటు ఇంతకు ముందు సరుకును కొనుగోలు చేసిన వారు దానికి సంబంధించి కామెంట్లు చేస్తుంటారు. కొనే ముందు వీటిని పరిగణనలోకి తీసుకొండి.

నచ్చకపోతే వాపస్‌ ఇచ్చేయండి

నచ్చకపోతే వాపస్‌ ఇచ్చేయండి

కొన్ని ఈ కామర్స్‌ కంపెనీలు కొనుగోలుదారులకు నష్టం వాటిల్లకుండా ఉండే రిటర్న్ పాలసీ ఉంది. మీ వస్తువుని డెలివరీ తీసుకున్న వెంటనే చెక్‌ చేసుకోవడం మంచిది. అది పాడయినా, కొనుగోలు చేసే ముందు చూపిన ప్రొడక్ట్‌ కంటే భిన్నంగా ఉన్నా, కలర్‌, సైజు, ఆకృతిలో బేధం ఉన్నా, పరిమాణం సరిగా లేకపోయినా, వారంటీ కార్డు రాకున్నా దాన్ని రిటర్ను చేసే అవకాశం ఉంటుంది. రిటర్న్ చేసిన సందర్భంలో సంబంధిత వ్యక్తి చెల్లించిన సొమ్మును అతని ఖాతాలో డిపాజిట్ చేస్తారు.

క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఉత్తమం

క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఉత్తమం

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఈ గిఫ్ట్‌ వోచర్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అయితే చాలా మంది ఇలా ఇష్టం లేని వారు మీ ఉత్పత్తి డెలివరీ అయిన తర్వాతనే చెల్లింపు చేసే విధంగా క్యాష్ ఆన్ డెలివరీ (సిఒడి)ని ఎంచుకోవచ్చు. ఇదొక మంచి మార్గం.

English summary

ఆన్‌లైన్ షాపింగ్: ఏసైట్లలో కొనుగోలు చేయాలి? | Things to keep in mind when shopping online

Shopping online is better for many reasons. You don't have to go out to find what you want, you can avoid traffic, compare prices easily and get better discounts. However, all this comes with risks of Internet security.
Story first published: Monday, November 23, 2015, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X