For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం ఎలా?

By Nageswara Rao
|

బెంగుళూరు: ఇటీవల కాలంలో చాలా మంది నగదు పెద్ద మొత్తంలో జేబులో పెట్టుకోకుండా, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొంత మంది క్రెడిట్‌ కార్డు చేతికి రాగానే విచ్చలవిడిగా షాపింగ్‌ చేస్తుంటారు. తమకేదో ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందన్నట్టు ఫీలైపోయి అవసరంలేని వాటిని కూడా కొనుగోళ్లు చేస్తుంటారు.

అంతవరకు బాగానే ఉంది...ఆ తర్వాత చెల్లింపు మాటేమిటి...? క్రెడిట్ కార్డులపై చేసే కొనుగోళ్లకు బ్యాంకులు 45 రోజుల వడ్డీ విరామం ఇస్తాయి. అంటే 45 రోజుల వరకు జీరో వడ్డీ ఉంటుంది. ఆ తర్వాత క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసిన చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న చాలా మందికి క్రెడిట్ కార్డు బిల్లు ఎలా కట్టాలో తెలియదు. అలాంటి వారి కోసం క్రెడిట్ కార్డు బిల్లును ఎన్ని రకాలుగా చెల్లించవచ్చో పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందాం.

6 Ways to Pay Your HDFC Credit Card Bill

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నెట్ బ్యాంకింగ్:

తొలుత మీ క్రెడిట్ కార్డుని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నెట్ బ్యాంకింగ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ క్రెడిట్ కార్డు బిల్లును ఆన్ లైన్ ద్వారా సునాయాసంగా చెల్లించవచ్చు. వేరే ఇతర క్రెడిట్ కార్డు కలిగిన వారు కూడా ఆన్ లైన్‌లో రిజిస్టర్ చేసుకుని చెల్లింపులు జరపవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ యాప్స్:

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా మీ క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ స్మార్ట్ ఫోన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఇనిస్టాల్ చేసుకోవాలి. మొబైల్ యాప్‌ని ఇనిస్టాల్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ కస్టమర్ ఐడి, పాస్‌వర్డ్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి క్రెడిట్ కార్డు పేమెంట్ ఆప్షన్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్:

తొలుత బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ (www.m.hdfcbank.com)లోకి లాగిన్ అవ్వాలి. తదనంతరం క్రెడిట్ కార్డు ఆప్షన్‌లోకి వెళ్లి క్రెడిట్ కార్డు పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించవచ్చు.

ఏటీఎం ద్వారా ఫండ్స్ ట్రాన్ఫర్:

మీకు సమీపంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లండి. మీ సేవింగ్స్ అకౌంట్ నెంబర్‌ను ఉపయోగించి మీ క్రెడిట్ కార్డుకి ఫండ్స్‌ను బదిలీ చేయండి.

ఎన్ఈఎప్టీ/వీసా మనీ ట్రాన్ఫర్:

వేరే బ్యాంకు చెందిన వ్యక్తులు మీ క్రెడిట్ కార్డు పేమెంట్‌ను ఎన్ఈఎప్టీ/వీసా ద్వారా నగదు బదిలీ చేసి చెల్లింపులు జరపవచ్చు.

ఆటో పే:

మీరు గనుక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నట్లైతే ఆటో పే విధానం ద్వారా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా బ్యాంకు సిబ్బందికి ముందుగానే మినిమం బ్యాలెన్స్‌ను మీ క్రెడిట్ కార్డు బిల్లుకు ప్రతి నెల కట్టేలా చూడాలి. దీని కోసం మీ సంతకం తప్పనిసరి.

సమీపంలో ఉన్న బ్యాంకులో చెల్లించడం:

సమీపంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెళ్లి నగదు చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించవచ్చు. ఇందుకు గాను కొన్ని బ్యాంకులు రూ. 100లు ఛార్జీ చేస్తారు.

English summary

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం ఎలా? | 6 Ways to Pay Your HDFC Credit Card Bill

Credit cards comes with advantage that will allow you to purchase now and pay later option. the most important point to consider when using any credit card is its safety. Security of the credit card primarily lies on its number, if it is disclosed means security is compromised.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X