For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ కార్డు: ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

By Nageswara Rao
|

Aadhaar
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా పౌరులందరికీ ఆధార్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆధార్ కార్డు ద్వారా లబ్దిదారులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం పథకాలకు అందజేయనుంది. నగదు బదిలీ, ఉపకారవేతనలు వంటి అనేక పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి. ఇందులో భాగంగా దేశ ప్రజలందరికీ ఆధార్ కార్డులను అందజేస్తుంది.

ఆధార్ కార్డు స్టేటస్‌ను ఆన్ లైన్‌లో చెక్ చేసుకోవడం ఎలానో వన్ఇండియా పాఠకులకు అందజేస్తున్నాం. మొదటగా మీరు ఆధార్ కార్డుని ఆన్ లైన్‌లో చెక్ చేసుకోవాలంటే మీ వద్ద ఆధార్ కార్డుకి సంబంధించిన నమోదు సంఖ్య, తేదీ, తారీఖు ఉండాలి. ఈ వివరాలు మీరు ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం రోజున అందజేసిన నివాసి ధృవపత్రంలో ఉంటాయి.

ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం రోజున మీకు ఇచ్చిన రసీదు స్లిప్‌ పైభాగాన 14 అంకెల డిజిటల్ నమోదు నెంబర్‌.. 14 అంకెల డిజిట్ తేదీ తో పాటు నమోదు సమయం ఉంటుంది. ఈ 28 అంకెల ఫామే మీ యొక్క తాత్కాలిక నమోదు ID (EID). ఈ క్రింద తెలిపినటువంటి లింక్‌లో మీ యొక్క నమోదు నెంబర్‌తో పాటు తేదీ, సమయాన్ని పొందుపరచండి.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు స్టేటస్ తెలుసుకునేందుకు ఫాలో కావాల్సిన స్టెప్స్:

UDAI status Enquiry వెబ్‌సైట్‌ను సందర్శించండి

మీ యొక్క నమోదు సంఖ్యను పొందుపరచండి

తేదీ మరియు సమయాన్ని పొందుపరచండి

క్రింద చూపిస్తున్న ఇమేజి టెక్ట్‌ను బాక్సులో నింపండి

సబ్మిట్ పై క్లిక్ చేయండి

ఆధార్ కార్డు స్టేటస్ ఎస్.ఎం.ఎస్. ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్నప్పుడు ఇచ్చే 14 అంకెలు గల ఈఐడీ నంబర్ ఆధారంగా ప్రస్తుతం ఆధార్ కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. UIDSTATUS అని టైప్ చేసి ఈఐడీ నంబర్‌ను టైప్ చేసి 51969కు ఎస్‌ఎంఎస్ చేస్తే ఆధార్ నెంబర్‌ను పంపిస్తారు. ఒకవేళ ఆధార్ నంబర్ ఇంకా జనరేట్ కాలేదంటే ప్రస్తుతం ఆధార్ స్టేటస్ ఏంటో తెలియపరుస్తారు. కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ అకౌంట్ నంబర్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు ఉండాలన్న నిబంధనలు కూడా ముందుకు తీసుకురానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధార్ కార్డులో ఉన్న చిరునామా, వివరాల ఆధారంగా పాన్ కార్డును జారీ చేయనున్నారు.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

ఆధార్ కార్డు: ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా? | Aadhaar Card: How to check status online? | ఆధార్ కార్డు: ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

To check your aadhaar card status online, you need to have your enrollment number date and time.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X