For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్ట్ ఆఫీస్ వద్ద ఖాతా తెరవడం ఎలా?

By Nageswara Rao
|

How to open an account at a post office?
సాధారణంగా మనం పోస్ట్ ఆఫీసుకి స్టాంపులు మరియు ఉత్తరాలు కొనుక్కోవడానికి వెళుతుంటాం. దీనితో పాటు పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులు దాచుకునే అవకాశం ఉంది. డబ్బులు దాచుకునేది బ్యాంకుల్లో అనే అనుమానం మీరు రావొచ్చు. ఐతే భారత తపాలా శాఖ కూడా ప్రజలకు డబ్బుని దాచుకునే అవకాశం కల్సిస్తుంది. ఇందు కోసం మనం చేయాల్సిందల్లా పోస్ట్ ఆఫీస్‌లో ఎకౌంట్ ఓపెన్ చెయ్యాలి. పోస్ట్ ఆఫీస్‌లో ఎకౌంట్ ఏంటీ అని అనుకుంటున్నారా..

పోస్ట్ ఆఫీస్‌లో ఒక ఖాతాను తెరవడానికి ఒక సేవింగ్స్ బ్యాంక్, రికరింగ్ డిపాజిట్, టైమింగ్ డిపాజిట్, నెలవారీ ఆదాయ పధకాల వేతన స్లిప్ మరియు సేవింగ్స్ బ్యాంకు, టైమింగ్ డిపాజిట్లకు సంబంధించిన నమూనా సంతకం అవసరం. సీనియర్ సిటిజన్స్ ఖాతాల కోసం ప్రత్యేకమైన పత్రాలను ఉపయోగిస్తారు. పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ బ్యాంకు ఖాతా తెరవడం కోసం ఒక పరిచయం తప్పనిసరి. కొంత మంది పోస్ట్ ఆఫీస్‌లో ఎకౌంట్ తెరచి కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించరు. అటువంటి ఖాతాలను నిశ్శబ్ద ఖాతా అని అంటారు.

నిశ్శబ్ద ఖాతాను పునరుద్ధరించాలంటే ఎలా?

ఒక సేవింగ్స్ ఖాతలో 3 సంవత్సరాల పాటు ఎటువంటి ఆర్దిక లావాదేవీలు జరగకుండా ఉంటే అటువంటి ఖాతాను నిశ్శబ్ద ఖాతాగా పరిగణిస్తారు. దీనిని తిరిగి పునరుద్దరించడానికి కస్టమర్ నుంచి ఒక అప్లికేషన్ అవసరం. కస్టమర్ అప్లికేషన్ ఇచ్చిన తక్షణం ఎల్ఎస్జీ/హెచ్ఎస్జీ ఆఫీసుకు సంబంధించిన అధికారులు ఈ ఖాతాలను తిరిగి పునరుద్దరిస్తారు. సాధారణ సేవింగ్స్ ఖాతాలను హెడ్ ఆఫీసు అధికారులు పునరుద్దరిస్తారు. నిశ్శబ్ద ఖాతాలో ఉండాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ కంటే బ్యాలెన్స్ తక్కువగా ఉంటే రూ. 20 సేవా ఛార్జీని వసూలు చేస్తారు.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

పోస్ట్ ఆఫీస్ వద్ద ఖాతా తెరవడం ఎలా? | How to open an account at a post office? | పోస్ట్ ఆఫీస్ వద్ద ఖాతా తెరవడం ఎలా?

To open an account a Savings Bank (SB), Recurring Deposit (RD) Time Deposit(TD), Monthly Income Scheme(MIS) a pay in slip and specimen signature slip for Savings Bank and Time Deposits are required.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X