ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ముగించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. అయితే ఈ సారి మారుతున్న ప్రపంచ దేశాల సెంటిమెంట్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేట్లను పెంచవచ్చనే బలమైన అంచనాల కారణంగా బులియన్ మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
గత రెండు రోజులుగా నిరంతరం పడిపోతున్న పసిడి, వెండి ధరలు బుధవారం (జూలై 8) నాటి ట్రేడింగ్‌లోనూ భారీగా పతనమయ్యాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఈ లోహాల ధరలు ఒక్కరోజే 3 శాతం మేర క్షీణించగా.. గత మూడు రోజుల్లో మొత్తంగా 5.5 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి.
బుధవారం సాయంత్రం జరిగిన ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన MCXలో బంగారం ధరలు రూ. 1.43 లక్షలకు, వెండి రూ. 2.23 లక్షలకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తే కామెక్స్ (Comex)లో బంగారం ఔన్స్‌కు 4,050 డాలర్లకు క్షీణించగా.. వెండి ధర 59 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది.
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం..ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయడానికే పట్టుబడితే.. రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో Gold ధర రూ. 1.35 లక్షల నుండి రూ. 1.40 లక్షల శ్రేణికి దిగి వచ్చే అవకాశం ఉంది.అలాగే అంతర్జాతీయంగా 3,800 డాలర్లకు పడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా వెండి ధరలు దేశీయంగా కిలో రూ. 2 లక్షల మార్కుకు చేరే అవకాశం ఉంది. ఇక ప్రపంచ మార్కెట్లో 55 డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఈ భారీ పతనాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒక అద్భుతమైన అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల అనిశ్చితి, బలపడుతున్న డాలర్ ఇండెక్స్ కారణంగా రాబోయే రోజుల్లో Gold ధరల్లో మరింత అస్థిరత కొనసాగే అవకాశం ఉన్నందున, ఇన్వెస్టర్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొద్దిరోజులు వేచి చూడాలని సూచిస్తున్నారు.
టాటా మ్యూచువల్ ఫండ్, కేడియా అడ్వైజరీ వంటి ప్రముఖ సంస్థల విశ్లేషణల ప్రకారం, బంగారం ధర రూ. 1.40 లక్షల వద్దకు.. అలాగే Silver ధర రూ. 2.15 లక్షల నుండి రూ. 2.20 లక్షల మధ్యకు వచ్చినప్పుడు దశలవారీగా (SIP పద్ధతిలో) పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తుందని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Gold Price: బంగారం తొందరపడి కొనుగోలు చేస్తున్నారా.. అయితే నష్టపోతారు..!
- బంగారం ధరలు భారీగా తగ్గాయి.. పసిడి రేటు ఈ రోజు తగ్గుదలతో ఎంతకు దిగివచ్చిందంటే.. జూలై 28, మంగళవారం ధరలు ఇవే..
- బంగారం ధరలు ఈ రేటును దాటి పెరిగే అవకాశం లేదు..సామాన్యులకు పండగే అంటున్న ఆర్థిక నిపుణులు
- దుబాయ్ బంగారంపై దిమ్మదిరిగే న్యూస్.. ప్రమాదంలో భారత పసిడి సరఫరా.. స్తంభించిపోయిన యూఏఈ గోల్డ్ కోట్..
- పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. జూలై 27, సోమవారం ధరలు ఇవే..
- Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో స్వల్ప మార్పులు..