ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన ఆదాయం రావాలనుకున్నవారు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకోవడం బెటర్. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్‌లో కూడా రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్, ఫిక్స్ డ్ డిపాజిట్ల గురించి తెలుసుకుందాం. అత్యంత సురక్షితమైన, కచ్చితమైన రాబడి గల పథకాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ ఒక్కటి. ఇందులో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ రేటు వస్తుంది. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడిదారుడు అసలు, వడ్డీ తీసుకోవచ్చు.
వివిధ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వేర్వేరు కాలపరిమితులు, వడ్డీ రేట్లతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఆఫర్ చేస్తున్నాయి. పెట్టుబడిదారులు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. అయితే మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఆ తర్వాత బ్యాంక్ డిఫాల్ట్ అయితే పెట్టుబడిదారుడికి కేవలం రూ.5 లక్షలు మాత్రమే వస్తాయి. అంటే మీరు ఒక బ్యాంకులో రూ.20 ఎఫ్డీ చేస్తే.. అప్పుడు ఆ బ్యాంక్ డిఫాల్ట్ చేస్తే మీకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే వస్తాయి. పాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ భీమా ద్వారా ఈ సొమ్ము వస్తుంది
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు అందించే వడ్డీ రేటు, సెక్యూరిటీ మెచ్యూరిటీ కాలంలో వడ్డీ రేటులో మార్పులు వచ్చినా మారదు. మీరు మీ డబ్బును 6 శాతం వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో ఉంచినట్లయితే, మొత్తం మార్కెట్‌లోని వడ్డీ రేట్లలో మార్పులు వచ్చినా, మెచ్యూరిటీ కాలం మొత్తం మీరు అదే వడ్డీ రేటును పొందుతారు. ఇందులో వడ్డీపై పన్ను ఉంటుంది. వారి పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు
ఇక డెట్ ఫండ్స్ అంటే.. ప్రధానంగా స్థిర-ఆదాయ రుణ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలను డెట్ ఫండ్స్ గా పరిగణిస్తారు. ఈ ఫండ్స్ ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు, డిబెంచర్లు, కార్పొరేట్ బాండ్లు, వివిధ ఇతర మనీ-మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. పెట్టుబడిపై గరిష్ట రాబడిని పొందాలనుకునే పెట్టుబడిదారులకు డెట్ ఫండ్లు ఒక ఎంపికగా ఉన్నాయి. డెట్ ఫండ్లలో పెట్టుబడికి ఏ ప్రభుత్వ సంస్థ నుంచి హామీ ఉండదు. అయితే పెట్టుబడి పెట్టిన నగదు భద్రతను, ఆయా సాధనాల క్రెడిట్ రేటింగ్ ద్వారా అంచనా వేయవచ్చు.
డెట్ ఫండ్ల నుంచి కచ్చితమైన హామీతో కూడిన రాబడి ఉండదు. ఇందులో రాబడి వడ్డీ రేటు, వడ్డీ రేటు హెచ్చుతగ్గులు, ద్రవ్య విధాన మార్పులు, ఫండ్ మేనేజర్ పెట్టుబడి నిర్ణయం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉండవచ్చు. డెట్ ఫండ్లలో కూడా పన్ను ఉంటుంది. డెట్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వచ్చే రాబడి రేటు ఒకేలా ఉన్నప్పటికీ.. డెట్ ఫండ్‌ల నుంచే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
More Articles
- FD Vs Mutual Fund: ఫిక్స్‌డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్..!
- బ్యాంకుల్లో కొత్త లెక్కలు..ఎఫ్డీలపై భారీ వడ్డీ రేట్లు..డిపాజిటర్లకు బంపర్ లాభం..!
- రిటైర్మెంట్ తర్వాత డబ్బు రెట్టింపు కావాలా? సీనియర్ సిటిజన్లకు 9.50% వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే!
- నామినీ లేకపోతే ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు మునిగిపోతాయా? RBI రూల్స్ ఇవే!
- FD వడ్డీ రేట్ల పెంపు: మీ డబ్బుకు 9% లాభం పొందే సులభమైన మార్గం ఇదే!
- 2026 జూన్ నెలలో మీ డబ్బుకు భారీ లాభం! అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఇవే, మిస్ అవ్వకండి