సురక్షితమైన, కచ్చితమైన రాబడి రావాలనుకునే వారు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడి పెట్టే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేటు ఎక్కువ ఉందో చెక్ చేసుకుని అందులో పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు చూస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.5 శాతం వరకు వడ్డీని చెల్లిస్తున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక వడ్డీని అందిస్తున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా 1 నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు చెల్లిస్తున్నాయి. అయితే పెద్ద మొత్తంలో ఎఫ్డీ చేయాలనుకునే వారు రెండు బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఒక్కో బ్యాంకులో గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చని చెబుతున్నారు. ఒక వేళ బ్యాంక్ డిఫాల్ట్ అయితే రూ.5 లక్షల బీమా సొమ్ము పొందవచ్చు. ఉదాహరణకు మీరు ఒక బ్యాంకులో రూ.20 ఎఫ్డీ చేసి.. ఆ బ్యాంక్ డిఫాల్ట్ అయితే రూ.5 లక్షలు మాత్రమే వస్తాయి. అందుకే ఈ రూ.20 లక్షలను నాలుగు బ్యాంకుల్లో ఎఫ్డీ చేయడం సురక్షితమని చెబుతున్నారు. కాగా సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్న బ్యాంకులు పరిశీలిస్తే..

Advertisement

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 శాతం వరకు, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో చూస్తే డీసీపీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.00 శాతం, బంధన్ బ్యాంక్ 7.95 శాతం,. జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ 7.80 శాతం, ఎస్ఎంబీ బ్యాంక్ ఇండియా 7.80 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75 శాతం, యెస్ బ్యాంక్ 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.

Advertisement

ప్రభుత్వ బ్యాంకుల్లో చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.45 శాతం, పంజాబ్ & సింద్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.35 శాతం, ఇండియన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.30 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.20 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.1 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తున్నాయి.

Advertisement

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 7.10 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. డాయిష్ బ్యాంక్ 7.00 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది.
హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ 6.00 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. రూ. 5 లక్షల బీమా పరిధిలో ఉండటానికి డిపాజిట్లను పలు బ్యాంకులలో విస్తరించాలని, అధిక రాబడి కోసం చిన్న ఫైనాన్స్ బ్యాంకులను ఎంపికగా ఉపయోగించాలని, డబ్బు అవసరాలకు అనుగుణంగా డిపాజిట్ కాలపరిమితులను సర్దుబాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.