ఉద్యోగం చేసేవారికి దాదాపు అందరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఇందులో ఉద్యోగి, యాజమాన్యం కొంత మొత్తం జమ చేస్తాయి. ఈ మొత్తానికి కేంద్ర వడ్డీ చెల్లిస్తోంది. ప్రస్తుతం 8.25 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. అయితే ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు, కంపెనీలు పీఎఫ్ ఖాతాలు వదిలేసినప్పుడు డబ్బంతా అలాగే ఉండిపోతుంది. ఆ డబ్బు తీసుకోవడానికి క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అయితే అప్పటికే మీరు కేవైసీ పూర్తి చేయకపోతే.. మీరు క్లయిమ్ చేయలేరు. కేవైసీ చేయాలంటే యజమాని అనుమతి పొందాలి. అయితే వారు అప్పటికే కంపెనీ మారడం లేదా పాత కంపెనీ పీఎఫ్ ఖాతాలు వదిలేయడంతో ఇబ్బంది ఉంటుంది.

Advertisement

ఇలాంటి వారికి కోసం ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఖాతాదారుడు క్లెయిమ్ చేయకున్నా రూ.1000 లోపు నిష్క్రియ ఉన్న పీఎఫ్ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. కేంద్ర కార్మిక శాఖ రూ.1000 లోపు డబ్బున్న 7.11 లక్షల నిష్క్రియ పీఎఫ్ ఖాతాల వివరాలు సేకరించింది. ఇందులో ఇప్పటి వరకు 1.18 లక్షల మంది ఖాతాదారుల ఆధార్ ఆధారిత బ్యాంకు ఖాతాల వివరాలను సక్సెస్ ఫుల్ గా ధృవీకరించింది. సీ-డాక్ సాంకేతిక సహకారంతో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ శరవేగంగా జరుగుతోందని అధికారులు తెలిపారు.

Advertisement

గతంలో యూజర్ క్లెయిమ్ చేస్తేనే డబ్బులు విడుదలయ్యే విధానం స్థానంలో, సిస్టమ్ ద్వారానే ఆటో క్లెయిమ్ జనరేట్ సాంకేతికతను తీసుకొచ్చారు. చందాదారుడు ఒక్క క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా, వడ్డీతో సహా వారి సొమ్ము నేరుగా వారి ఖాతాలో పడేలా సిస్టమ్-జనరేటెడ్ క్లెయిమ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు ఆధార్ లింక్ అయిన ప్రతీ ఖాతాకు పెన్నీ డ్రాప్ పద్ధతిలో బ్యాంక్ వివరాలను నిర్ధారించామని ఈపీఎఫ్ఓ అధికారులు చెప్పారు. ఆగస్టు నెలాఖరు నాటికి సాఫ్ట్‌వేర్ పనులను పూర్తవుతాయని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రూ. 1,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండి ఏళ్ల తరబడి నిష్క్రియంగా పడి ఉన్న మిగతా 24.76 లక్షల ఖాతాదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

Advertisement

దేశంలో దాదాపు 31.86 లక్షల నిష్క్రియ పిఎఫ్ ఖాతాల్లో రూ. 10,903 కోట్లకు పైగా డబ్బులు ఉన్నట్లు తెలిస్తోంది. చిన్న మొత్తాలకు ఆటో రీఫండ్ విధానం తేవడం ద్వారా ఇటు ఖాతాదారులకు నిధులు అందడమే కాకుండా, ఈపీఎఫ్ఓ పై ఉన్న అడ్మినిస్ట్రేటివ్ భారం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఈపీఎఫ్ఓ చేపడుతున్న ఈ డిజిటల్ సంస్కరణలు సబ్‌స్క్రైబర్లకు నిధుల లభ్యతను మరింత సులభతరం చేయనున్నాయని వివరిస్తున్నారు. అయితే తప్పనిసరిగా పీఎఫ్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.