ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేవారు ఈ విధానంలో ట్యాక్స్ ఫైల్ చేయాలో అర్థం కాదు. పాత విధానమా లేక కొత్త విధానమా అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆదాయపు పన్ను ఫైల్ చేసేటప్పుడు మీరు ఏ విధానం సెలక్ట్ చేసుకోకపోతే.. డిఫాల్ట్ గా కొత్త విధానమే తీసుకుంటుంది. ఏ విధానంలో ట్యాక్స్ ఫైల్ చేస్తే బెటరూ చూద్దాం. పాత విధానంలో రూ. 4.25 లక్షల మినహాయింపులు ఉంటాయి. ఇందులో సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షలు, సెక్షన్ 80D కింద రూ. 25,000, హెచ్ఆర్ఏ కింద రూ. 2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. మీకు సంవత్సరానికి రూ. 25 లక్షల జీతం ఉన్నప్పుడు, పాత విధానంలో పన్ను భారం రూ. 4,52,400 కాగా, కొత్త విధానంలో రూ. 3,19,800గా ఉంటుంది.
అంటే రూ. 1,32,600 ఆదా అవుతుంది. మీకు వార్షిక ఆదాయం రూ. 50 లక్షల జీతం వద్ద కూడా రూ. 1,32,600 ఆదా అవుతుంది. అయితే ఇది అందరికీ వర్తించదని చెబుతున్నారు. సెక్షన్ 24(b) కింద గృహ రుణ వడ్డీ (రూ. 2 లక్షల వరకు), మెట్రో నగరాల్లో అధిక హెచ్ఆర్ఏ, 80CCD(1B) కింద NPS చందాలు, వృద్ధులైన తల్లిదండ్రుల కోసం అధిక 80D ప్రీమియం చెల్లిస్తే.. ఎక్కువ మినహాయింపులు పొందవచ్చు. కొత్త విధానం తక్కువ పన్ను రేట్లు, ఎక్కువ సరళతను అందిస్తుంది.
జీతం పొందే పన్ను చెల్లింపుదారులు ఒకే విధానానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఫైల్ చేసే ముందు మీ లెక్కలను మీరే సరిచూసుకోడం మంచిది. ఆదాయపు పన్ను పోర్టల్ కాలిక్యులేటర్‌కు పది నిమిషాలు పడుతుంది. తక్కువ మినహాయింపుల కోసం పెద్దగా ఆలోచించకుండా కొత్త విధానాన్ని తీసుకోవడం బెటరని చెబుతున్నారు. ఎక్కువ మినహాయింపుల కోసం రెండింటినీ లెక్కించండి. సమీప భవిష్యత్తులో ఈ విధానాలు రెండూ కలిసి కొనసాగుతాయి కాబట్టి, ఇది ఇకపై ఒక్కసారి తీసుకునే నిర్ణయం కాదని చెబుతున్నారు.
పాత పన్ను విధానంలో ముఖ్యంగా హెచ్ఆర్ఏ బెనిఫిట్ ఉంటుందని చాలా మంది ఈ విధానంలోనే ఫైల్ చేస్తారు. ఇంటి అద్దె భత్యం మినహాయింపు కొత్త పన్ను విధానంలో లేదు. దీంతో ఈ ప్రయోజనం కోల్పోతామని కొందరు కొత్త పన్ను విధానంలోకి మారేందుకు ఆలోచిస్తుంటారు. అయినప్పటికీ కొత్త పన్ను విధానమే లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు. 1-2 ఏళ్లలో పాత పన్ను విధానం రద్దయ్యే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలతో కలిపి రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ లేదు. రూ. 12.75 లక్షల పరిమితి దాటితే.. పన్ను శ్లాబుల్ని బట్టి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
More Articles
- Budget 2024: బడ్జెట్లో సెక్షన్ 80C, 80Dలో నిర్మలమ్మ బహుమతి ఇస్తారా..?
- సెక్షన్ 80C లిమిట్ పెంపుపై ఆర్థిక మంత్రి ఫుల్ క్లారిటీ.. పన్ను మినహాయింపులపై కేంద్రం పక్కా ప్లాన్
- Tax Save: సమయం లేదు మిత్రమా.. పన్ను ఆదాకు ఇదే చివరి అవకాశం..!
- Income Tax: బీ అలర్ట్ టాక్స్ పేయర్స్.. ITRలో ఈ పొరపాట్లు చేస్తే భారీ ఫైన్.. పన్ను ప్రయోజనాలు రద్దు..!
- Income tax calculator: కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ఇవే! మీ జీతంపై ఎంత పన్ను పడుతుందో తెలుసుకోండి!
- March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!