గత ఏడాది కాలంలో ఆర్బీఐ రెపో రేటును 1 శాతం తగ్గించడం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు తగ్గాయి. దీని ఫలితంగా అనేక బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాయి. అయినప్పటికీ సురక్షితమైన, స్థిరమైన రాబడిని కోరుకునే సీనియర్ సిటిజన్లకు అత్యధి వడ్డీ రేట్లు అందిస్తున్న అనేక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల కాలపరిమితితో 7 శాతం కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 7.75 శాతం వరకు వడ్డీని చెల్లిస్తున్నాయి.
పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ప్రస్తుతం అధిక FD వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో సహా అన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల్లోని డిపాజిట్లు DICGC పథకం కింద డిపాజిటర్ కు రూ. 5 లక్షల వరకు బీమా రక్షణను కలిగి ఉంటాయి. రిస్క్‌ను తగ్గించుకోవడానికి సీనియర్ సిటిజన్లు తమ FD పెట్టుబడులను వివిధ బ్యాంకుల్లో విభజించి ఎఫ్డీ చేయడం మంచిది. 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 'సూపర్ సీనియర్ సిటిజన్లు' అదనంగా 0.25 శాతం - 0.50 శఆతం వడ్డీని పొందవచ్చు.
సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతంవరకు రేట్లను అందిస్తున్నాయి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. దీనిలో గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 3 కోట్ల వరకు ఉంది. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల కాలపరిమితిపై 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తోంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 7.5% వడ్డీని అందిస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్ డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Fixed Deposits: 501 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీ వడ్డీని అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..!
- Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకు ఇదే..!
- Fixed Deposits: మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన బ్యాంకు దివాలా తీస్తే మీ సొమ్ము పోయినట్టేనా..!
- Highest FD Interest Rates Banks: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు ఇవే..!
- Fixed deposits: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు..!
- ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకుల ఆటలు సాగవు, కొత్త రూల్స్ ఇవే!