హైదరాబాద్ కు చెందిన 60 ఏళ్ల రామయ్యకు పొలం అమ్మగా రూ.50 లక్షలు వచ్చాయి. ఇందులో కొంత మొత్తాన్ని తన కూతుళ్లకు ఇచ్చాడు. మిగతా రూ.20 లక్షలు ఏం చేయాలని తెలిసినవారిని అడిగాడు. ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకోండని చెప్పాడు. అయితే ఏ బ్యాంకులో ఎఫ్డీ చేస్తే మంచిదని అడిగాడు. ప్రభుత్వ బ్యాంకులో చేయండి.. వడ్డీ రేటు ఎందులో ఎక్కువుంటే.. అందులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయండని చెప్పాడు. మరి ఇందులో మన డబ్బు సురక్షితమేనా అని అడిగాడు. అవును ఫిక్స్ డ్ డిపాజిట్ చాలా సురక్షితం, కచ్చితమైన వడ్డీ వస్తుందని చెప్పాడు. అయితే రామయ్యకు మరో డౌట్ వచ్చింది. ఒక వేళ తాను ఎఫ్డీ చేసిన తర్వాత బ్యాంకు దివాలా తీస్తే సంగతేంటని అడిగాడు. అయితే ఇదే సందేహం చాలా మందికి వస్తుంది.

Advertisement

బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ సురక్షితమే కానీ.. ఒక వేళ బ్యాంకు దివాలా తీస్తే డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. బ్యాంకుల్లో మీ డబ్బుకు రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. మీరు కోటి రూపాయలు ఎఫ్డీ చేసినా.. బ్యాంకు దివాలా తీస్తే మీకు కేవలం రూ.5 లక్షలే చెల్లిస్తారు. మీరు రూ.5 డిపాజిట్ చేసినా బీమా సొమ్ము అవే రూ.5 లక్షలు చెల్లిస్తారు. మరి రూ.5 లక్షల కంటే తక్కువ ఎఫ్డీ చేస్తే.. రూ.5 లక్షల కంటే తక్కువ మీరు ఎంత డిపాజిట్ చేస్తే అంతే చెల్లిస్తారు. బ్యాంకుల్లో మీరు ఎఫ్డీ చేసే సోమ్ముకు ఆర్‌బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా ప్రతి డిపాజిటర్‌కు ఒక్కో బ్యాంకులో రూ. 5 లక్షల వరకు అసలు, వడ్డీకి పూర్తి బీమా భద్రత లభిస్తుంది.

Advertisement

మరి పెద్ద మొత్తంలో ఎఫ్డీ చేయడం నష్టమా అంటే.. కాదు.. మీరు పెద్ద మొత్తంలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకుంటే రెండు, మూడు బ్యాంకులను ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రామయ్య కేసులో చూస్తే ఆయన వద్ద రూ.20 లక్షలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎఫ్డీ చేయవచ్చు. అయితే ఆయన రెండు లేదా మూడు బ్యాంకులను ఎంచుకోవడం బెటర్. ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న రెండు లేదా మూడు బ్యాంకుల్లో ఎఫ్డీ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లో చెల్లిస్తున్న ఎఫ్డీ రేట్లు మీ కోసం.

Advertisement

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 శాతం వరకు, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో చూస్తే డీసీపీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.00 శాతం, బంధన్ బ్యాంక్ 7.95 శాతం,. జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ 7.80 శాతం, ఎస్ఎంబీ బ్యాంక్ ఇండియా 7.80 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75 శాతం, యెస్ బ్యాంక్ 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.

Advertisement

ప్రభుత్వ బ్యాంకుల్లో చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.45 శాతం, పంజాబ్ & సింద్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.35 శాతం, ఇండియన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.30 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.20 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.1 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తున్నాయి.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.