రిటైర్మెంట్ తర్వాత చాలా మంది కొంత మొత్తం డబ్బు వస్తుంది. అయితే దాన్ని చాలా మంది సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తారు. ఎందుకంటే వారికి డబ్బు సురక్షితంగా ఉండాలి. కచ్చితమైన ఆదాయం రావాలి. అందుకే చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తారు. అయితే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు కాస్త వడ్డీ ఎక్కువగానే ఇస్తాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఇండియా ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను తగ్గించడంతో బ్యాంకులు కూడా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను చెల్లిస్తున్నాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు చెల్లించ బ్యాంకుల్లో డీసీబీ బ్యాంకు ఒకటి. 5 ఏళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు డీసీబీ బ్యాంకు 8 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లు ఈ బ్యాంకులో 5 సంవత్సరాల కాలపరిమితికి రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. 5 ఏళ్ల తర్వాత వడ్డీ 1,97,250, అసలు రూ.5 లక్షలు వస్తాయి. ఇక యెస్ బ్యాంకు, ఎస్బీఎం బ్యాంక 7.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. జమ్ము అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.35 శాతం వడ్డీ చెల్లిస్తుండగా.. యాక్సెస్ బ్యాంక్ 7.25 శాతం వడ్డీని ఇస్తోంది.
డీసీబీ బ్యాంకులో ప్రస్తుతం 5 సంవత్సరాల కాల పరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఏకంగా 8 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఆ తర్వాత ఎస్‌బీఎం బ్యాంక్, యెస్ బ్యాంకులు 7.50 శాతం వడ్డీ ఆఫర్ అందిస్తోంది. జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ 7.35 శాతం వడ్డీ ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్ 7.25 శాతం మేర వడ్డీ ఇస్తోంది. ఆర్‌బీఎల్ బ్యాంక్, తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ 7.20 శాతం మేర వడ్డీ ఇస్తోంస్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 శాతం వరకు, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నారు.
అయితే ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే వారు పెద్ద మొత్తం ఒకే బ్యాంకులో కాకుండా రెండు బ్యాంకుల్లో ఎఫ్డీ చేయడం బెటర్. బ్యాంకుల్లోనూ డిపాజిటర్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే బ్యాంక్ దివాలా తీసినా రూ.5 లక్షల వరకు చెల్లిస్తారు. అందుకే మీ వద్ద రూ.10 లక్షలు ఉంటే రూ.5 లక్షల చొప్పున రెండు బ్యాంకుల్లో ఎఫ్ఢీ చేసుకోవచ్చు. రూ.20 లక్షలు రెండు లేదా మూడు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Fixed Deposits: మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన బ్యాంకు దివాలా తీస్తే మీ సొమ్ము పోయినట్టేనా..!
- Highest FD Interest Rates Banks: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు ఇవే..!
- Fixed deposits: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు..!
- ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకుల ఆటలు సాగవు, కొత్త రూల్స్ ఇవే!
- బ్యాంకుల్లో భారీగా పెరిగిన వడ్డీలు.. నేరుగా 8.05% ఇంట్రెస్ట్ ఇస్తున్న టాప్ బ్యాంకుల లిస్ట్ ఇదే!
- SBI FD, RD ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తాజా వడ్డీ రేట్లు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలు ఇవిగో..