ఒకప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే.. ఏజెంట్ల వద్ద తీసుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా చాలా మంది పాలసీలు తీసుకుంటున్నారు. ఆన్ లైన్ పాలసీలు అమ్మె వెబ్ సైట్లు వచ్చాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వెబ్ సైట్ ద్వారా కూడా పాలసీ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏజెంట్ చెప్పింది గుడ్డిగా నమ్మి పాలసీ తీసుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అంత చెక్ చేసుకోని.. ఏ పాలసీ తీసుకుంటే మంచిదని తెలుసుకుని పాలసీ తీసుకుంటున్నారు.

Advertisement

అని కంపెనీల పాలసీలు పరిశీలిస్తున్నారు. ఎందులో ప్రీమియం తక్కువ ఉందో చెక్ చేస్తున్నారు. క్లయిమ్ రేషియో ఎంత ఉందో కూడా చెక్ చేసుకుని పాలసీ కొనుగోలు చేస్తున్నారు. అన్నీ పాలసీలను పోల్చి చూసి.. ప్రీమియం తక్కువ ఉండి, ఎక్కవ కవరేజీ ఉన్న పాలసీలను తీసుకుంటున్నారు. వాటిని ఎంచుకుంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంల మధ్య 50 శాతం నుంచి 70 శాతం వరకు తేడాలు ఉన్నాయని పాలసీ బజార్ డేటా ప్రకారం తెలుస్తోంది. పాలసీ కొనుగోలుదారులు అన్ని చెక్ చేసుకుని పాలసీ కొనుగోలు చేయడం వల్ల సగటున 70 శాతం ప్రీమియం భారం తగ్గుతున్నట్లు నివేదిక పేర్కొంది.

Advertisement

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు.. రెండు కంపెనీల పాలసీలను చెక్ చేసుకుంటున్నారు. ఎందులో ప్రీమియం తక్కువ ఉంది. క్లయిమ్ రేషియో ఏ విధంగా ఉందని పొల్చి చూసి హెల్త్ పాలసీ కొనుగోలు చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారిలో సుమారు 75 శాతం కస్టమర్లు కనీసం 2 నుంచి 3 కంపెనీల ప్లాన్లను పోల్చి చూస్తున్నారని నివేదిక వివరించింది. 14-15 శాతం మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ను తట్టుకోవడానికి కస్టమర్లు ప్రిఫర్డ్ నెట్‌వర్క్, రూమ్ రెంట్ లిమిట్స్ వంటి ఫీచర్లను అడ్జస్ట్ చేసుకుంటూ బడ్జెట్‌కు తగిన ప్లాన్ ఎంచుకుంటున్నారని పాలసీ బజార్ నివేదిక పేర్కొంది.

Advertisement

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేవారు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 40 శాతం మంది 3 నుంచి 4 కంపెనీల పాలసీలు చెక్ చేసుకుని కొనుగోలు చేస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్‌లో ధరతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది కస్టమర్ల నిర్ణయాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తోందని నివేదిక పేర్కొంది. గతంలో లాగా ట్రెడిషన్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య తగ్గింది. ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి సలహాలు, సూచనలు చేయడానికి కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి. పాలసీ తీసుకునే వారు ఆ సంస్థలను సంప్రదిస్తే.. మీకు ప్లాన్ సూటు అవుతోందో చెబుతారు.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.