చాలా మంది ఉద్యోగం కోసం, ఊరు వదిలి వెళ్లిపోతారు. కానీ ఓ మహిళ మాత్రం తన ప్రొఫెషన్ ను వదిలి రైతుగా మారి సక్సెస్ అయ్యారు. చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి రైతుగా మారారు. విశాలాక్షి పద్మనాభన్ అనే మహిళ బెంగళూరులో చార్టర్డ్ అకౌంటెంట్ గా చేసేవారు. ఆమె 2012లో బెంగళూరు వదలి రాగిహలీ అనే గ్రామానికి షిఫ్ట్ అయ్యారు. ఊరు వెళ్లిన ఆమె వ్యవసాయం మొదలు పెట్టారు. అయితే ఆమె నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఆయనా ఆమె ముందుకు వెళ్లారు. తన కుటుంబం కోసం స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారాన్ని పండించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో సేంద్రియ పంటలు పండించడం ప్రారంభించారు.
ఆ టైమ్ లో దేశంలో సేంద్రియ వ్యవసాయం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీంతో సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలకు డిమాండ్ ఉండేది కాదు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ మార్కెట్ కూడా పెరిగింది. అదే సమయంలో చాలా మంది రైతులకు సేంద్రియ పంటలు పండించడం తెలియకపోవడంతో వారికి విశాలక్షి సేంద్రియ వ్యవసాయం చేయడం నేర్పించారు. చిన్న, సన్నకారు సేంద్రియ రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే వేదికగా 2012లో బఫెలో బ్యాక్ కలెక్టివ్‌ను స్థాపించారు. కాలక్రమేణా ఇది బెంగళూరులో రిటైల్ అవుట్‌లెట్‌లతో పాపటు దేశవ్యాప్తంగా సేంద్రీయ పంటలు సేకరించే నెట్‌వర్క్‌గా విస్తరించింది.
బఫెలో బ్యాక్‌లో మధ్యప్రదేశ్ నుంచి గోధుమలు, కాశ్మీర్ నుంచి బాదం, వాల్‌నట్‌లు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆపిల్ పండ్లు సేకరించి నగరాల్లో ఔట్ లేట్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నారు. ఈ నమూనా విజయవంతమైంది. అయితే మహిళలు కూడా ఇందులో భాగం కావాలని విశాలాక్షి పద్మనాభన్ భావించారు. మహిళలకు సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు ఎలా పండించాలో ట్రైనింగ్ ఇచ్చారు. మహిళలు సుమారు ఏడు నుంచి ఎనిమిది రకాల ఆకుకూరలు, సొరకాయలు, గుమ్మడికాయ, కాకరకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిలగడదుంపలు పండిస్తున్నారు. వారు క్యారెట్లు, బీట్‌రూట్ పండించడం కూడా నేర్చుకుంటున్నారు. మహిళ కోసం కై తోట అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఆడవాళ్లు మాత్రమే పని చేస్తారు. వీరంతా వారానికి రూ.50 వరకు అమ్మకాలు జరుపుతారు.
ప్రతి ఎకరం ప్రతి నెలా 600 నుంచి 650 కిలోల కూరగాయలను ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయంతో పాటు, మహిళలు అనుబంధ వ్యాపారాలను కూడా నిర్మిస్తున్నారు. 150 మహిళలతో కలిసి సమాఖ్య ఏర్పాటు చేశారు. వీరు వారాంతాల్లో బేకరీ, కెఫేలనూ నిర్వహిస్తారు.. సాగు పనులు లేని రోజుల్లోనూ ఉపాధి పొందేలా చూస్తున్నారు. రాగితో మాల్ట్, చిరుతిళ్లు వంటివి తయారుచేయించి అమ్ముతున్నారు. టూరిజం ఈవెంట్లనీ నిర్వహిస్తున్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని విశాలాక్షి పద్మనాభన్ చెబుతున్నారు. ఆమె వ్యవసాయం, రైతుల వరకే పరిమితం కాకుండా పాలసీ మేకింగ్ లో భాగమవుతున్నారు.
More Articles
- పీఎం కిసాన్ 23వ విడత: జూన్ 20న రైతుల ఖాతాల్లోకి నగదు.. డబ్బులు రావాలంటే ఈ చిన్న పని చేయండి!
- దూసుకొస్తున్న ఎల్‌నినో ముప్పు.. పెను సంక్షోభంలో వ్యవసాయ రంగం.. రైతులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
- ఎల్ నినో ముప్పు.. అగ్రి స్టాక్స్ వదిలేసి వీటిని కొంటే లాభాలు.. మోతీలాల్ ఓస్వాల్ కీలక సూచన..
- తెలంగాణ బడ్జెట్..ఈ రంగాలకే అధిక కేటాయింపులు.. రైతుల కోసం ఎంతంటే..
- ఇరాన్ యుద్ధం.. ఎరువుల కొరతతో సంక్షోభంలోకి వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ మార్గాలు వైపు కేంద్రం అడుగులు..
- ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి నాగలి పట్టారు.. సేంద్రీయ విప్లవంతో వ్యవసాయాన్ని పరుగులు పెట్టిస్తున్నారు..