అప్పట్లో సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నవారి పంట పండుతోంది. వారు భారీ లాభాల్లో కొనసాగుతున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ II ఇన్వెస్టర్లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ బాండ్లలో పైసా ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు ఏకంగా 318 శాతానికి పైగా లాభాలు వచ్చేలా ప్రిమెచ్యూర్ రిడెంప్షన్ ఆప్షన్ ఇచ్చింది. అంటే గడువుకు ముందు ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చింది. గ్రాము బంగారం ధరను రూ.14,199 గా నిర్ణయించింది. 2026 జులై 16న నాటికి ఐదేళ్ల లాగిన్ పీరియడ్ ముగిసిన వారు.. తమ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా సావరిన్ గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ పీరియడ్ 8 ఏళ్లు ఉండేది. ఆర్బీఐ ప్రిమెచ్యూర్ రిడెంప్షన్ ఆప్షన్ ఇస్తారు.

Advertisement

కాగా.. 2019లో ఈ సిరీస్ బాండ్లను కొనుగోలు చేశారు. బంగారం గ్రాముకు అప్పుడు రూ.3,393 డిజిటల్ పేమెంట్ ద్వారా పే చేసి కొనుగోలు చేశారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సిరీస్ బాండ్ కు గ్రాముకు రూ.14,199 గా ఖరారు చేసింది. అంటే ఐదేళ్లలో గ్రాముపై రూ.10,806 లాభం వచ్చింది. ఈ ఐదేళ్ల కాలంలో 318.5 శాతం రాబడి వచ్చింది. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం 2.5 శాతం వడ్డీ కూడా అదనంగా రానుంది. ఉదాహరణకు ఈ పథకంలో డిజిటల్ పేమెంట్ ద్వారా రూ.1 లక్ష విలువైన బాండ్లను కొనుగోలు చేస్తే.. ఇప్పుడు వీటి విలువ రూ.4.18 లక్షలకు చేరింది.

Advertisement

ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ ప్రాఫిట్ బుకింగ్ వెనుక ఒక పెద్ద టాక్సే ఉంది. గతంలో గోల్డ్ బాండ్లను ఐదేళ్ల తర్వాత ఎప్పుడు విత్‌డ్రా చేసుకున్నా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ నుంచి పూర్తి మినహాయింపు ఉండేదని నిపుణులు చెబుతున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్ను నిబంధనల ప్రకారం మొత్తం మారిపోయింది. సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన ఒరిజినల్ పర్సన్ మాత్రమే, పూర్తి 8 ఏళ్ల కాలపరిమితి ముగిసే వరకు బాండ్లను హోల్డ్ చేస్తేనే ఎలాంటి పన్ను లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు.

Advertisement

ప్రిమెచ్యూర్ రిడెంప్షన్ ఆప్షన్ ఇచ్చారు కదా అని మధ్యలోనే విత్‌డ్రా చేసుకుంటే మాత్రం ఆ లాభాలపై నిబంధనల ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే సెకండరీ మార్కెట్ ద్వారా ఎస్‌జీబీలను కొనుగోలు చేసిన వారు 8 ఏళ్లు దాటిన తర్వాత విత్‌డ్రా చేసినా సరే, వారికి ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదని చెబుతున్నారు. ట్యాక్స్ పే చేసినా పెట్టుబడిదారులకు భారీ లాభాలే వస్తాయి. పన్ను భారాన్ని తప్పించుకోవాలని భావించే వారు మాత్రం మరో మూడేళ్లు వేచి చూడాల్సిందే. పూర్తి 8 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ తర్వాతే విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.