చాలా ప్రభుత్వ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హులను ఏరియాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలు సంస్కరణాలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఈ కేవైసీ తీసుకొచ్చింది. ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది. అర్హులైన గ్యాస్ వినియోగదారులను గుర్తించడంతో పాటు అర్హత లేని వారిని తొలగించేందుకు ఈ కేవైసీ ప్రక్రియ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి చాలా మంది కస్టమర్లు ఈకేవైసీ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వినియోగదారుల నుంచి సరైనా స్పందన రాలేదు. దీంతో కంపెనీలు త్వరలోనే నిలిపివేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఈ కేవైసీ చేసుకోని వారికి గ్యాస్​ సరఫరా ఆగిపోయే అవకాశం ఉంటుందని డీలర్స్ హెచ్చరిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 లక్షల కనెక్షన్లుండగా 70 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఈ కేవైసీ చేసుకున్నట్లు డీలర్లు చెబుతున్నారు. మరోపక్క డిమాండ్ ​కు సరిపడా గ్యాస్ సరఫరా కాకపోవడంతో కొన్ని కంపెనీలు ఈ కేవైసీ సాకుతో సిలిండర్ల డెలివరీ నిలిపివేసే చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2024 జూన్​ లో వినియోగదారులు ఈ కేవైసీ చేసుకోవాలని ఆయిల్​ కంపెనీలు తెలిపాయి. ఇందుకు సంవత్సర కాలం పాటు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నిరంతర ప్రక్రియ పేరుతో దీన్నీ కొనసాగిస్తున్నారు. అయినా వినియోగదారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని డీలర్లు చెబుతున్నారు.

Advertisement

2014లోనూ ఈకేవైసీ మొదలుపెట్టి ఐదు సంవత్సరాల పాటు కొనసాగించారు. ఈసారి మాత్రం సంవత్సరాల ముగించేలా ఉన్నారని డీలర్లు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ ​పరిధిలో టిఫిన్​ సెంటర్లు, చిన్న చిన్నహోటళ్లు, స్ట్రీట్ ​వెండర్లు ఇలా చాలామంది కమర్షియల్ ​గ్యాస్​ వినియోగించకుండా డొమెస్టిక్​ సిలిండర్లను వాడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ఇప్పటికీ గ్యాస్ ఈకేవైసీ చేసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కేవైసీ చాలా సులభంగా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆయా కంపెనీల యాప్ ల ద్వారా కానీ, డీలర్స్ వద్దకు వెళ్లి కానీ, డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు వారి ఫోన్లలో ఉండే యాప్​ ద్వారా చేసుకోవచ్చని వివరిస్తున్నారు.

Advertisement

మరో పక్క రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. రేషన్ కార్డులో పేరు ఉన్న తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. ఈకేవైసీ చేసుకునేందుకు జూలై 31 చివరి తేదీగా ఉంది. ఆ లోపు రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోకుండా రేషన్ కార్డు కట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డు ఈకేవైసీ కోసం దగ్గరలో రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.