ఫార్మా రంగ మ్యూచువల్ ఫండ్లు సాధారణంగా తమ ఆస్తులలో కనీసం 80 శాతాన్ని ఆరోగ్య సంరక్షణ సేవలు లేదా ఔషధాల తయారీలో నిమగ్నమైన కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండి, దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా ప్రయోజనాలను పొందాలనుకునే వారికి ఈ ఫండ్లు అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగం బాగా పనితీరు కనబరిచినప్పుడు ఫార్మా రంగ మ్యూచువల్ ఫండ్లు మంచి రాబడిని అందిస్తాయని పేర్కొంటున్నారు. అయితే ఇందులో రిస్క్ ఉంది. ఒకే రంగానికి పరిమితమై ఉండటం వల్ల వీటి రాబడిలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తోంది. ఈ కథనం గత ఐదేళ్లలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఐదు ఫార్మా రంగ మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి.

Advertisement

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫార్మా & హెల్త్‌కేర్ ఫండ్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫార్మా & హెల్త్‌కేర్ ఫండ్ గత ఐదేళ్లలో 18.67 శాతం వార్షిక రాబడిని అందించింది. ఇందులో నెలకు రూ.25000 పెడితే.. రూ.24,88,875 గా ఉంది. ఇందులో పెట్టుబడి రూ. 15,00,000 ఉండగా రూ. 988,875 రాబడి వచ్చింది.

Advertisement

మిరే అసెట్ హెల్త్‌కేర్ ఫండ్
మిరే అసెట్ హెల్త్‌కేర్ ఫండ్ గత ఐదేళ్లలో 19.32 శాతం వార్షిక రాబడిని అందించింది. ఇందులో సిప్ పెట్టుబడి రూ. 15,00,000 పెట్టుబడి పెట్టగా.. రూ. 25,35,953 వచ్చాయి. ఇందులో రూ.1,035,953 రాబడి ఉంది.

యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్
యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్ గత ఐదేళ్లలో 20.81 శాతం వార్షిక రాబడిని అందించింది. ఇందులో నెలకు రూ.25000 పెట్టుబడి పెడితే దాని వాల్యూ రూ.26,47,969 గా ఉంది. రూ.1,147,969 రాబడి వచ్చింది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫార్మా హెల్త్‌కేర్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఫండ్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫార్మా హెల్త్‌కేర్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఫండ్ ఐదేళ్లలో 20.93 శాతం రాబడిని అందించింది.

Advertisement

ఎస్బీఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్
ఎస్బీఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్. గత ఐదేళ్లలో 22.11 శాతం వార్షిక రాబడి అందించింది.