స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలంటే మంచి అవగాహన ఉండాలి. లేకుంటే నష్టాలు వచ్చే అవకాశం. అయితే మార్కెట్ పై అవగాహన లేనప్పుడు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని పేర్కొంటున్నారు. సిప్ రూపంలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందని చెబుతున్నారు. కొన్ని మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో భారీ రాబడి ఇస్తున్నాయి. దీర్ఘకాలంలో అత్యధిక రాబడి అందిస్తున్న మ్యూచువల్ ఫండ్లు ఇక్కడ పరిశీలించవచ్చు.

Advertisement

గత 10 సంవత్సరాల డేటా ప్రకారం వార్షికంగా 20 శాతం నుంచి 25 శాతం వరకు చక్రవడ్డీ రాబడిని అందిస్తూ పెట్టుబడిదారులకు భారీ రాబడి అందించిన ఫండ్లలో క్వాంట్ స్మాల్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ ఉన్నాయి.

Advertisement

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గత 10 సంవత్సరాల కాలంలో ఏడాదికి 24.4 శాతం చొప్పున రాబడి అందించింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా నెల నెలా పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలను అందించింది.

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ భారీ రాబడిని అందించింది. గడిచిన 10 సంవత్సరాల్లో సిప్ రాబడి ఏడాదికి సగటున 21.2 శాతం చొప్పున వచ్చింది.

ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్
ఇన్వెస్కో ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి లాంచ్ అయిన ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 10 ఏళ్లలో 20.4 శాతం చొప్పున రాబడి అందించింది.

Advertisement

క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ గడచిన 10 సంవత్సరాల కాలంలో 20.1 శాతం రాబడి ఇచ్చింది.

నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్
నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ నుంచే వచ్చిన మరో స్కీమ్ నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ గత 10 సంవత్సరాల్లో సగటున 19.90 శాతం చొప్పున రాబడి ఇచ్చింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.