గత ఏడాది, హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇతర ప్రయోజనాలను అందించే తన అత్యంత చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరను ఎయిర్‌టెల్ పెంచింది. ఆ ధర పెంపు జరిగిన ఏడాది తర్వాత, ఇప్పుడు ఆ టెలికాం సంస్థ తన రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. ఎయిర్ టెల్ వెబ్‌సైట్, 'ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుంచి ఈ ప్లానును తొలగించింది. దీని స్థానంలో రూ. 349 ప్లాన్ ఇప్పుడు కంపెనీ అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్‌గా వచ్చింది. ఇది పాత ప్లాన్ ప్రయోజనాలతో పాటు కొన్ని అదనపు ఆఫర్లను కూడా అందిస్తుంది. కంపెనీ తన రూ. 579, రూ. 619 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లను కూడా నిలిపివేసిందని ప్రచారం జరుగుతోంది.
ఈ రెండు ప్లాన్లు కూడా ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో కనిపించడం లేదని చెబుతున్నారు. రూ.579 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇదే డేటా ప్రయోజనాలతో 60 రోజుల వ్యాలిడిటీతో రూ.619 రీఛార్జి ప్లాన్ అందిస్తూ వచ్చింది. తొలుత ఎంపిక చేసిన సర్కిళ్లలో తొలగించిన ఎయిర్‌టెల్.. తర్వాత మిగిలిన సర్కిళ్లలోనూ ఈ ప్యాక్స్‌ను తొలగించినట్లు సమాచారం. రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో 28 రోజుల చెల్లుబాటు కాలంతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1GB (5G, 4G) డేటాను అందించేది. అంతేకాకుండా ఇది రోజుకు 100 SMSలు, ఉచిత కాలర్ ట్యూన్‌లు, 'Perplexity Pro AI' సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందించేది.
ఇప్పుడు దీన్ని తొలగించింది. దేశంలో ఎయిర్‌టెల్ అత్యంత చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ ఇప్పుడు రూ. 349 ప్లాన్ మాత్రమేనని చెబుతున్నారు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSల సదుపాయాన్ని అందిస్తుంది. దీని చెల్లుబాటు కాలం కూడా 28 రోజులే. చందాదారులు ఆరు నెలల పాటు ఉచిత 'Apple Music' సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, ఉచిత ఎయిర్‌టెల్ 'హలో ట్యూన్స్' 12 నెలల 'Adobe Express Premium' సేవలను కూడా పొందవచ్చు. ఇది కాకుండా వినియోగదారులు రూ. 399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది దాదాపు అదే ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఇందులో రోజువారీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా కోటా ఎక్కువగా 2.5జీబీ ఉంటుంది. అదనంగా ఇది 'Apple Music' సబ్‌స్క్రిప్షన్‌కు బదులుగా 28 రోజుల 'JioHotstar' మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
ఎయిర్ టెల్ రూ.579 రూ.619 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించిందని సంజు చౌదరి అనే వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎయిర్‌టెల్ యూపీ, ఉత్తరాఖండ్ సర్కిల్‌లలో ఈ ప్లాన్‌లను నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్ టెల్ వెబ్ సైట్లలో ఈ రెండు రీఛార్జ్ ప్యాక్‌లు కనిపిస్తున్నాయని కొంత మంది పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Jio, Airtel: వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న టెలికాం కంపెనీలు.. రీఛార్జ్ ధరలు భారీగా పెంపు..!
- ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్: ₹200కే 30GB డేటా, అన్‌లిమిటెడ్ 5G మరియు ఓటీటీ బెనిఫిట్స్!
- ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్: రూ. 200కే అన్‌లిమిటెడ్ 5G డేటా మరియు ప్రీమియం ఓటీటీ సబ్స్క్రిప్షన్!
- ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! వివాదాల నడుమ ఆ ప్లాన్స్ బంద్.. కొత్తగా తెచ్చిన 'ఫాస్ట్ లేన్' ఏంటి?
- రూ. 1.06 లక్షల కోట్ల నిధి.. టెలికాం కంపెనీలు, టెక్ దిగ్గజాల మధ్య మొదలైన అసలైన యుద్ధం!
- ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ+.. అన్‌లిమిటెడ్ ఫీచర్లతో ఎయిర్‌టెల్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఇవే!