వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వాడుతున్న వారికి కేంద్రం షాక్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వాడుతున్న వారిపై సెస్ విధించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సెస్ విధిస్తే ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే గృహ అవసర సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచారు. కొత్తగా సెస్ విధించండం వల్ల ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరాలో గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Advertisement

దీంతో దేశీయంగా సిలిండర్ల కొరత ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు భారీ భారీ వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తుందని వార్తలు వస్తున్నాయి. అందుకే గ్యాస్ వినియోగదారులపై సెస్ విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒక్కో గ్యాస్ కనెక్షన్ రూ.18 సెస్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్రం సమాలోచనలు చేస్తోందని సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలు చేస్తే ఎల్పిజీ సిలిండర్ పై అదనంగా దాదాపు రూ.18 భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

ఎల్పీజీపై కిలోకు రూ.1.29 చొప్పున సెస్ విధించవచ్చని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం తెలుస్తుందని వార్తలు వస్తున్నాయ. అంటే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై సుమారు రూ.18 అదనపు భారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక నేచురల్ గ్యాస్ పై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ కు రూ.1.43 సెస్ విధించే అవకాశం ఉంది. వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వాడుతున్న వారిపై సెస్ విధించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపుగా రూ.14వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisement

వచ్చే పదేళ్లలో రూ.4లక్షల 30వేల కోట్ల వ్యయంతో భారీ వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, క్రూడ్ ఆయిల్ నిల్వల కోసం ప్రత్యేక స్టోరేజీ కేంద్రాలు నిర్మించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఇంధన నిల్వలను సిద్ధం ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెస్ ద్వారా వచ్చే డబ్బును ఎల్పీజీ, సహజ వాయువు నిల్వల మౌలిక వసతుల కోసం వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సెస్ ప్రతిపాదనపై ఇంకా కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇంకా దీనికి ఆమోదం తెలపలేదని తెలుస్తోంది.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.