ఇందుకోసం ఒక ప్రత్యేకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేయాలని సూచించింది. ఈ విధానం సరిగా అమలు అయితే సరైన ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలు నిలిచిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు మరికొన్ని సరికొత్త ప్రతిపాదనలను కూడా తెరపైకి తెచ్చింది. రహదారులపై ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను వాహన, ఇన్సూరెన్స్ డేటాబేస్‌లతో అనుసంధానించాలని ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల ఇన్సూరెన్స్ లేని వాహనాలను ఆటోమేటిక్‌గా గుర్తించి ఈ-చలాన్లు జారీ చేయవచ్చని పేర్కొంది.
అలాగే ట్రాఫిక్ పోలీసులకు మొబైల్ యాప్‌లు లేదా హ్యాండ్‌హెల్డ్ డివైజ్‌లను అందజేసి, తనిఖీల సమయంలో తక్షణమే బీమా వివరాలు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు కొత్త వాహనాల కొనుగోలుకు సంబంధించి కూడా కీలక ప్రతిపాదనలు చేసింది. కొత్త కార్లకు తప్పనిసరి చేసే మూడేళ్ల థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కాలాన్ని నాలుగేళ్లకు, ద్విచక్ర వాహనాలకైతే ఐదేళ్ల నుంచి ఆరేళ్లకు పొడిగించాలని సుప్రీంకోర్టు సూచించింది. తొలి ఇన్‌స్యూరెన్స్ గడువు ముగిసిన తర్వాత చాలామంది రెన్యూవల్ చేయించుకోకుండా తిరుగుతున్నారని, దీనిని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
బంకుల్లో ఇంధన నిరాకరణ అనేది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ దశలోనే ఉందని, దీని అమలుపై సంబంధిత అధికారులు త్వరలో కార్యాచరణ రూపొందించనున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇదే సమయంలో హెల్మెంట్ లేకుండా పెట్రోల్ బంక్ ల్లో పెట్రోల్ కోసం వస్తున్న ద్విచక్ర వాహనదారులకు కూడా పెట్రోల్ పోయకూడదని డిమాండ్ కూడా ఉంది. ఈ నిబంధన తీసుకొస్తే ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వాహనాల ఇన్సూరెన్స్ తో పాటు ఈ20 పెట్రోల్ పై కూడా చర్చ జరగాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల బండ్లు దెబ్బతింటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. 80 పెట్రోల్, 20 ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల వాహన ఇంజన్లు దెబ్బతింటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- ట్రంప్‌కు భారీ షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జన్మహక్కు పౌరసత్వాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం..
- Supreme Court: ఫ్లాట్ అప్పగించడంలో ఆలస్యమైతే పరిహారం చెల్లించాల్సిందేనా..!
- సుప్రీంకోర్టు AI నిబంధనలు: ఐటీ కంపెనీలకు ఇక కఠిన పరీక్షలు తప్పవా?
- పబ్లిక్ రవాణా వాహనాల్లో లొకేషన్ ట్రాకింగ్, పానిక్ బటన్లు తప్పనిసరి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవిగో..
- ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టిన భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్.. కేసు ఎలా వాదించాడు..
- నీ యవ్వ తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రెచ్చిపోతున్న ట్రంప్.. 10 శాతం సుంకాలతో మళ్లీ దాడి