భారత్ లో వందే భారత్ రైళ్లు రాకతో రైల్వే కీలక మార్పు జరిగింది. వేగంగా వెళ్లే ఈ రైలు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే వందే భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు హౌరా-గువహతి నడుస్తోంది. దేశంలో తొలి స్లీపర్ రైలును ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ప్రారంభించారు. ఇప్పుడు మరో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ముంబై-బెంగళూరు మార్గంలో ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రైలు ప్రయాణ సమయాన్ని దాదాపు 16 గంటలకు తగ్గించనుంది.

Advertisement

త్వరలోనే ఈ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న స్టేషన్ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ మధ్య నడుస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వందే భారత్ స్లీపర్ కు సంబంధించి ఎలాంటి రైళ్లు నడవడం లేదు. అయితే త్వరలో ఏపీ నుంచి వందే భారత్ స్లీపర్ రైలు నడిచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్ నడిపేందుకు రైల్వే కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి వరకు, కాచిగూడ నుంచి బెంగళూరు, నర్సాపురం నుంచి చెన్నైకు రైళ్లు నడుస్తున్నాయి. అయితే స్లీపర్ రైళ్లు లేకపోవడంతో ఇప్పుడు వాటిని కూడా తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
దసరా పండుగ వరకు విజయవాడ మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ భావిస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నం నుంచి బెంగళూరు, విజయవాడ నుంచి బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు నడపాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

కాగా వందే భారత్ స్లీపర్ రైళ్లలో అనేక సౌకర్యాలు ఉన్నాయి. మెరుగైన కుషనింగ్, లేటెస్ట్ ఇంటీరియల్స్, ఇంటర్నెట్, ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డోర్లు, ఎల్ఈడీ డోర్లు, ఎల్ఈడీ లైట్లు, సౌండ్ ప్రూఫ్, ప్రత్యేక సెన్సార్లు ఉన్నాయి. ఈ రైలుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 160 నుంచి 180 కిలోమీర్ల వేగంతో ప్రయాణిస్తాయని చెబుతున్నారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. ప్రస్తుతం హౌరా-గువహతి మధ్య నడిచే రైలులో 16 కోచ్‌లు ఉన్నాయి.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.