భారత్ లో యూపీఐ పేమెంట్స్ భారీగా పెరిగాయి. రూ.5 నుంచి రూ.లక్ష వరకు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. యూపీఐలో ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా మరో కీలక మార్పు తీసుకురానున్నారు. తాజా మార్పుతో ఫోన్ పే, గూగుల్ పేతో పాటు ఏ ఇతర యూపీఐ యాప్స్ లో ఇకపై మన ఫోన్ నంబర్ కనిపించదని చెబుతున్నారు. యూపీఐ ఐడీ, లేదా నంబర్ లోని చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. కస్టమర్ల ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకొని నేషల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే, క్రెడ్, భీమ్, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపులకు ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకురానున్నారు. డిజిటల్ పేమెంట్స్ సమయంలో కస్టమర్ల ఫోన్ నంబర్ పూర్తిగా కనిపించకుండా చేసే విధానంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి అనుగుణంగా పని చేయనుంది. ప్రస్తుతం యూపీఐ ట్రాన్సక్షన్స్ మొబైల్ నంబర్ ద్వారా కస్టమర్లను గుర్తిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

దీంతో ఫోన్ నంబర్లు ఇతరులకు కనిపించడం వల్ల ప్రైవసీ, భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్యాంకులు, యూపీఐ యాప్‌లకు కస్టమర్ల మొబైల్ నంబర్లు, యూపీఐ ఐడీ, బ్యాంక్ ఖాతా వివరాలను కనిపించకుండా ఉండాలని కోరింది. మొబైల్ నంబర్‌లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా మార్పులు చేయాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసినట్లయితే.. రిసివర్, సెండర్ నంబర్ కనిపించకుండా చేయనుంది.

Advertisement

మొబైల్ నంబర్‌కు బదులుగా ప్రత్యేక యూపీఐ ఐడీలను ఉపయోగించే అవకాశాన్ని కూడా కస్టమర్లకు కల్పించే అవకాశం ఉంది. ఈ మార్పులతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు. అనవసర కాల్స్, మోసాలు, ప్రైవసీ సమస్యలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.