సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి కలగా ఉంటుంది. ఆ కలన సాకారం చేసుకునేందుకు చాలా కష్టపడతారు. రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కొంటారు. ఇలానే బెంగళూరులో కొంత మంది అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేశారు. ఇక్కడ ఒక్కో ఫ్లాట్‌ను రూ. 1 కోటి నుండి 5 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేశారు. తీరా గృహ ప్రవేశాలు చేద్దామని అనుకునేసరికి ఆ 18 అంతస్తుల టావర్ ను కూల్చేయాలని నిర్ణయించారు. దక్షిణ బెంగళూరులోని హర్లూర్‌లోని 18 అంతస్తుల అపార్ట్‌మెంట్ బ్లాక్ నిర్మాణం ఒక పక్కకు వంగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కూల్చడానికి గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) అనుమతి ఇచ్చింది.
నిర్మాణం వంగిపోవడం డెవలపర్లే దీన్ని కూల్చివేయనున్నారు. కూల్చివేత, రెండు వారాల్లో జరుగుతుందని భావిస్తున్నారు, నగరంలో విలాసవంతమైన నివాస అపార్ట్‌మెంట్‌తో కూడిన అతిపెద్ద టవర్లలో ఇది ఒకటిగా నిలిచేది. వంగడంతో దాన్ని కూల్చనున్నారు. SNN రాజ్ ఎటర్నియా దాదాపు 970 అపార్ట్‌మెంట్‌లతో మొత్తం 15 టవర్లు నిర్మించింది. 49 ఫ్లాట్‌లతో కూడిన ఇ-3 బ్లాక్ ఒక పక్కకు వంగింది. ఇందులో ఫ్లాట్‌లు అమ్ముడయ్యాయని, కొనుగోలుదారులు అక్కడికి వెళ్లే సిద్ధమైనట్లు సమచారం. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) జారీ చేసింది.
డెవలపర్ ద్వారా టవర్‌ను కూల్చివేయనున్నట్లు జీబీఏ చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు ధృవీకరించారు. అంతర్గత నాణ్యతా తనిఖీలలో నిర్మాణంలో లోపాలను గుర్తించిన తర్వాత నిర్మాణాన్ని ధ్వంసం చేయాలనే నిర్ణయం తీసున్నట్లు SNN రాజ్ గ్రూప్ సంస్థ తెలిపింది. బాహ్య జియోటెక్నికల్ ఏజెన్సీ నిర్వహించిన సైట్‌కు సంబంధించిన భూసార పరీక్ష నివేదిక కూడా తప్పుగా ఉందని అంతర్గత దర్యాప్తులో తేలినట్లు సమాచారం. టవర్ ఉన్న ప్లాట్‌లో గట్టి రాతి, వదులుగా ఉండే మట్టి రెండూ ఉన్నాయని తెలిసింది. అయినప్పటికీ టవర్ ఒక పక్క కు కాస్త వంగడానికి సరైన పునాది లేకపోవడమేనని పేర్కొంది.
బ్లాక్ పూర్తిగా పూర్తయి, దాదాపుగా హ్యాండ్‌ఓవర్‌కి సిద్ధంగా ఉన్నప్పటికీ, మేము 49 గృహాలను పునర్నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నాము. మా కస్టమర్‌లకు పరిపూర్ణమైన ఇల్లు అప్పగించడమే మా ప్రాధాన్యతని SNN రాజ్ కార్ప్ డైరెక్టర్, అనూజ్ సంజయ్ జైన్, కంపెనీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి (RERA) తెలియజేశారు. తాము ఒక నెల క్రితం సమస్యను గుర్తించామన్నారు. సమస్యను పరిష్కరించడానికి కొంతమంది కన్సల్టెంట్‌లు మరమ్మతులు, సరిదిద్దే పనులను చేపట్టాలని సూచించారని గుర్తు చేశారు. తమ కొనుగోలుదారుల ప్రయోజనాల కోసం మరమ్మత్తులు చేయాలని నిర్ణయించుకున్నామని జైన్ తెలిపారు. వచ్చే 18 నుంచి 20 నెలల్లో ప్రతి బాధిత గృహ కొనుగోలుదారుకు పరిహారం చెల్లించడమే కాకుండా, కూల్చివేత, పునర్నిర్మాణం మొత్తం ఖర్చును భరిస్తామని SNN రాజ్ కార్ప్ తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Bengaluru News: 45 నిమిషాల పాటు నిలిచిపోయిన మెట్రో సేవలు.. అవస్థలు పడ్డా ప్రయాణికులు..!
- బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్.. పోలీసులు సరికొత్త ప్లాన్.. రూల్స్ బ్రేక్ చేస్తే భారీ జరిమానాలు కట్టాల్సిందే..
- బెంగళూరులో యజమానుల వద్ద రూ. 31,628 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్లు.. అద్దె దారులకు షాకిస్తున్న సరికొత్త నివేదిక..
- రాయలసీమ మీదుగా బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌కు కొత్త రూట్ ప్రతిపాదించిన ఏపీ ప్రభుత్వం
- 30 ఏళ్లు దాటిన భవనాలకు స్ట్రక్చరల్ ఆడిట్ తప్పనిసరి.. కర్ణాటక కొత్త అపార్ట్‌మెంట్ బిల్లు పూర్తి వివరాలు ఇవిగో..
- బెంగళూరులో ఖాళీ స్థలాల యజమానులకు BBMP బిగ్ షాక్.. 30 రోజుల్లో ప్లాట్లు శుభ్రం చేయకపోతే భారీ జరిమానా..