జొమాటో మాతృ సంస్థ అయిన ఎటర్నల్ 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికం ఫలితాలు ప్రకటించింది. ఏకీకృత లాభంలో ఏడాది ప్రాతిపదికన 268 శాతం పెరుగుదలను నమోదు చేసింది. రూ. 92 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఎటర్నల్ లాభం 47.1% తగ్గింది. అంతర్గత పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన క్యాతెరో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒక వ్యాపార బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Advertisement

నికర ఆర్డర్ విలువ YoY ప్రాతిపదికన 54.2 శాతం, త్రైమాసిక ప్రకారం 15.8 శాతం పెరిగి రూ.31,120 కోట్లకు చేరింది. సంవత్సరం ప్రాతిపదికన సర్దుబాటు చేసిన ఎబిట్డా 223 శాతం, త్రైమాసి ప్రాతిపదిక 29 శాతం పెరిగింది. నికర ఆర్డర్ విలువ 20 శాతం వృద్ధితో రూ.10,769 కోట్లకు పెరిగింది. ఫుడ్ డెలివరీ వ్యాపారంలో వినియోగదారులు చెల్లించిన వాస్తవ డెలివరీ ఛార్జీలు, అలాగే కార్యకలాపాల ఆదాయంలో చేర్చని ప్లాట్‌ఫారమ్ ఫీజులు, ఇతర ఛార్జీలు కూడా కలిసి ఉంటాయి. ఈ త్రైమాసికంలో ఆహార పంపిణీ విభాగం సర్దుబాటు చేసిన ఎబిట్డా రూ.155 కోట్లు పెరిగి రూ.606 కోట్లకు చేరింది.

Advertisement

క్విక్ కామర్స్ విభాగం సర్దుబాటు చేసిన ఎబిట్డా రూ.264 కోట్లు పెరిగి రూ.102 కోట్లకు చేరింది. క్విక్ కామర్స్ విభాగంలో కొత్త 200 స్టోర్లు యాడ్ చేశారు. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 2,443కి చేరింది. హైపర్‌ప్యూర్ విభాగం సర్దుబాటు చేసిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 55 శాతం తగ్గి రూ.1,034 కోట్లకు చేరింది. అదే సమయంలో ఎబిట్డా సానుకూలంగా ఉంది. ఏడాది ప్రాతిపదికన రూ.24 కోట్లు పెరిగింది. ఈ త్రైమాసికంలో రూ.6 కోట్లకు చేరింది. ఫలితాల తర్వాత ఎటర్నల్ షేర్లు అస్థిరంగా మారాయి.
చివరికి ఎటర్నల్ షేర్లు 1% పెరిగి ఒక్కో షేరు రూ. 289.5 వద్ద ముగిశాయి.

Advertisement

ఈ స్టాక్ లో ఇప్పుడు కొంత లాభాల స్వీకరణ జరగవచ్చని ఓ విశ్లేషకుడు అంచనా వేశారు. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ నౌ వంటి ప్రత్యర్థుల దూకుడుతో ఎటర్నల్ క్విక్-కామర్స్ పోటీ పడుతుందా లేదా చూడాలని అన్నారు. ఆరోగ్యకరమైన ఆర్డర్ డిమాండ్, అధిక అడ్వర్టైజింగ్, ప్లాట్‌ఫామ్-ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం, ఆపరేటింగ్ లెవరేజ్ కారణంగా ఎటర్నల్ ఫుడ్-డెలివరీ వ్యాపారం లాభపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం స్టాక్ అధిక వాల్యూవేషన్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.