దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది తమ వాహనాలు పాడవుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ20 పెట్రోల్ పై పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ20 పెట్రోల్ కు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో 2016 ముందు తయారైన బీఎస్-3 వాహనాల్లో ఈ-20 పెట్రోల్ వాడినప్పుడు వాటిలోని కొన్ని రబ్బరు భాగాలు, గాస్కెట్లు దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ-20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజీ తగ్గుతుందన్న ఆందోళనలపై రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ20 పెట్రోల్ వల్లే మైలేజీ తగ్గడం లేదని.. ఇతర కారణాలు కూడా ఉన్నాయని వాహన తయారీ సంస్థలు, వాహన/ ఇంజిన్ పరీక్షా సంస్థలు తెలిపినట్లు ఆయన వివరించారు.
బైక్స్, స్కూటీలు, కార్లకు సంబంధించి ఈ20 పెట్రోల్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) డెహ్రాడూన్, సియామ్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ అధ్యయనం చేశాయని తెలిపారు. ఈ20 పెట్రోల్ వాడేందుకు ఈ వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఆధ్యయనం పేర్కొందని ప్రకటించారు.
అయితే బీఎస్-3 వాహనాలపై జరిపిన పరీక్షల్లో కొన్ని లోపాలు బయటపడినట్లు తెలిపారు. ఈ వాహనాల్లో గాస్కెట్లు, రబ్బరు భాగాలు మార్చాల్సిన అవసరం ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. వీటిని రిపేర్ లేదా సర్వీసింగ్ సమయంలో మార్చుకోవచ్చని చెప్పారు. గడ్కరీ ప్రకటనపై సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లు వస్తున్నాయి. రబ్బర్ భాగాలు, గాస్కెట్లకు డబ్బులు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. కాగా మనం దేశంలో కొద్ది రోజులుగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడుతున్నారు. పెట్రోల్ లో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది.
ఇథనాల్ పెట్రోల్ అవసరం లేదని వారు ప్రీమియం పెట్రోల్ కొట్టించుకోవచ్చు. ప్రీమియం పెట్రోల్ పేరు కంపెనీని బట్టి మారుతుంది. ఇండియన్ బంక్ ల్లో ప్రీమియం పెట్రోల్ ను 100-ఆక్టేన్ (XP100) పేరుతో పిలుస్తారు. సాధారణ పెట్రోల్ లీటరుకు ధర రూ. 116 ఉండగా.. 100-ఆక్టేన్ (XP100) పెట్రోల్ ధర రూ.167 గా ఉంది. అయితే ప్రీమియం పెట్రోల్ లో ఇథనాలు కలపరు. అందుకే నటుడు నరేష్ తన కారులో ప్రీమియం పెట్రోల్ వాడుతున్నట్లు కొద్ది రోజుల క్రితం వీడియో విడుదల చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- E20 Petrol: ఇథనాల్ పెట్రోల్ పై అసత్య ప్రచారం.. కోర్టుకెక్కిన నితిన్ గడ్కరీ..!
- నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలంటూ కొత్త ఉద్యమం.. స్వచ్ఛమైన పెట్రోల్ మా హక్కు అంటూ పుట్టుకొచ్చిన E20 జనతా పార్టీ
- Hyderabad: హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే..!
- ఇక టోల్ గేట్ల దగ్గర వెయిటింగ్ లేదు! 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు.. కేంద్రం సంచలన నిర్ణయం!
- ఈ ఏడాది చివరి నుంచి టోల్ ప్లాజాలు రద్దు.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. కొత్తగా ఏం తెస్తున్నారంటే..
- Bengaluru: బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే! నితిన్ గడ్కరీ సూపర్ అప్డేట్! ఎప్పటినుంచంటే..