అన్నదాతలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయియి. అంటే సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 విడతలుగా పీఎం కిసాన్ నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.46 వేలు జమ అయ్యాయి. తాజాగా ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం నాడు పీఎం కిసాన్ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడగించడానికి ఆమోదం తెలిపింది.
రాబోయే ఐదేళ్లపాటు ఈ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మొత్తం రూ.3,15,614 కోట్ల వ్యయం కేటాయించారు. ఫిబ్రవరి 24, 2019న ప్రారంభమైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాలకు 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' (DBT) విధానం ద్వారా రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో చెల్లిస్తారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా డబ్బులు ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఇకేవైసీ చేసుకోవాలి. ఇకేవైసీ చేస్తేనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెప్పారు.
ఇప్పటికీ కూడా ఇకేవైసీ చేసుకోని వారికి డబ్బులు జమ కాలేదు. రైతులు చాలా సులభంగా ఇకేవైసీ చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాలు, సీఎస్సీలు, పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో ఇకేవైసీ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ద్వారా ఇకేవైసీ చేసుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ పథకం తీసుకొచ్చి 7 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలను పెంచడం లేదు. గత బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ పథకం కింద అందించే రూ.6 వేలను రూ.9 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. కాని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే బడ్జెట్ లో అయిన పీఎం కిసాన్ నిధులను రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచాలని రైతులు కోరుతున్నారు.
కాగా.. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినవారు, ఆదాయపు పన్ను కట్టేవారు పీఎం కిసాన్ పథకానికి అనర్హులు. ఒక వేళ వారు పీఎం కిసాన్ తీసుకుంటే స్వచ్ఛందంగా వెనక్కు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఇక రాష్ట్రం కూడా రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.12 వేలు అందిస్తోంది. సీజన్ కు రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈసారి వర్షాకాల సీజన్ కు సంబంధించి రైతు ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- పిఎం కిసాన్ యోజన: రైతుల అకౌంట్లోకి 2వేలు.. 19వ విడతను విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లో రూ.2000.. మీరు అర్హులా.. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి?
- Budget 2024: శుభవార్త.. బడ్జెట్లో 10 కోట్ల రైతులకు మేలుచేసే కీలక నిర్ణయం..!
- PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ యాప్ ఆవిష్కరించిన కేంద్రమంత్రి
- ఆదాయపు పన్ను కడుతున్న రైతు కుటుంభాలకు పిఎమ్ కిసాన్ పథకం వర్తించదు
- PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు రావడం లేదా.. అయితే ఈ పని చేయండి..!