చాలా మంది భవిష్యత్ కోసం పొదుపు చేస్తుంటారు. ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా పిల్లల చదువుకు లేదా రిటైర్మెంట్ కోసం డబ్బులు పొదుపు చేస్తారు. పొదుపు చేస్తున్న డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టామని ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ లక్ష్యాన్ని బట్టి పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలు అయితే మీరు మీ పొదుపులో కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం బెటరని సూచిస్తున్నారు. పలు రకాల మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చాయి.
అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నదని గుర్తుంచుకోవాలి. అయితే గత 20 ఏళ్లలో దాదాపు ఏడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు మంచి రాబడులను ఇచ్చాయి. 20 ఏళ్లలో పెట్టుబడిని 22 రెట్లు చేశాయి. ఇందులో లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్,ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో 16.8 శాతం రాబడి ఇచ్చింది. ఇది పెట్టుబడిదారుల డబ్బును 22.4 రెట్లకు పెంచింది. హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో 15.4 శాతం రాబడి ఇచ్చింది. పెట్టుబడిదారుల డబ్బును 17.6 రెట్లు పెంచింది.
అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 20 సంవత్సరాల్లో పెట్టుబడిదారుల డబ్బును 16.9 రెట్లు కు పెంచింది. ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో పెట్టుబడిదారుల డబ్బును 15.8 రెట్లకు పెంచింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 20 సంవత్సరాల్లో 14.43 రాబడి ఇచ్చింది. పెట్టుబడిదారుల డబ్బును 14.4 రెట్లకు పెంచింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో పెట్టుబడిదారుల డబ్బును 13.5 రెట్లకు పెంచింది. ఈ ఫండ్ 13.9 శాతం రాబడిని అందించింది.
హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో 13.7 శాతం రాబడి ఇచ్చింది. పెట్టుబడిదారుల డబ్బును 13 రెట్లు చేసింది. ఈ ఏడు ఫండ్లు గత 15 ఏళ్లలో పెట్టుబడిదారుల సంపదను 10 రెట్ల వరకు పెంచాయి. మ్యూచువల్ ఫండ్లలో స్మాల్ క్యాప్ ఫండ్ లో రిస్క్ ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలని చెబుతున్నారు. మీ సొమ్ము మొత్తాన్ని ఒకే ఫండ్ లో కాకుండా డైవర్సిఫై చేయాలని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Mutual Funds: మిడ్, ప్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి పెరిగిన పెట్టుబడులు..
- Mutual Fund: రూ.లక్షను రూ.2.8 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్ ఇదే..!
- Mutual Funds: రూ. లక్షను ఐదేళ్లలో రూ.2.50 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
- బిగ్ ఫండ్స్ సీక్రెట్ లీక్: దేశంలోని 3 అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ నమ్ముకున్న ఆ 5 షేర్లు ఇవే!
- 3 ఏళ్లలో 37% CAGR రిటర్న్స్ ఇచ్చిన టాప్ SIP ఫండ్స్ ఇవే!
- Small Cap Mutual Funds: టాప్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..!