స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం రిస్క్ తో కూడుకున్నది. అయితే మంచి స్టాక్స్ గుర్తించి పెట్టుబడి పెడితే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి స్టాక్ ల్లో సకార్ హెల్త్ కేర్ ఒకటి. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు బాగుండడంతో సోమవారం సకార్ హెల్త్ కేర్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. ఎన్ఎస్ఈలో 3.35 శాతం పెరిగింది. ఒక్కో షేరు రూ.829 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ గత ఐదు సంవత్సరాల్లో ఏకంగా 350 శాతానికి పైగా రాబడి ఇచ్చింది. ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి.
FY27 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ. 10.28 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 4.67 కోట్లకు చేరింది. దాదాపు 120 శాతం పెరిగింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 38 శాతం వృద్ధితో రూ. 52.73 కోట్ల నుంచి రూ. 72.97 కోట్లకు చేరింది. "ఈ త్రైమాసికంలో తాము వాణిజ్య ఒప్పందాలను విస్తరించాము. ఎగుమతుల వేగాన్ని బలోపేతం చేశాము. ప్రముఖ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ భాగస్వాములతో డాసియర్ సమర్పణలు, మార్కెటింగ్ అనుమతులు, సైట్ వేరియేషన్ ఆమోదాలు, టెక్నాలజీ బదిలీ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాము" అని మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ షా అన్నారు.
సకార్ హెల్త్‌కేర్ లిమిటెడ్ అనేది లిస్టెడ్ ఫార్మాస్యూటికల్ తయారీదారు, ఎగుమతిదారు. ఇది ఆంకాలజీ, యాంటీబయాటిక్స్, జనరల్ ఫార్ములేషన్స్‌లో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ 65కు పైగా ఆంకాలజీ ఉత్పత్తి ఒప్పందాలను కుదుర్చుకోగా, 50కి పైగా వాణిజ్య చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపింది. కంపెనీ సాధించిన ఈ అనూహ్య ప్రగతికి ప్రధానంగా ఆంకాలజీ (క్యాన్సర్ చికిత్స) విభాగానికి లభించిన అంతర్జాతీయ అనుమతులని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం లాభాలు మాత్రమే కాకుండా కంపెనీ నిర్వహణ సమర్థతను తెలిపే ఎబిట్డా 67 శాతం పెరిగి రూ. 21.25 కోట్లకు చేరింది.
ప్రత్యేకించి క్యాన్సర్ లాంటి సంక్లిష్టమైన వైద్య రంగానికి అవసరమైన మందుల తయారీలో సకార్ హెల్త్‌కేర్ నిలకడగా సాధిస్తున్న అభివృద్ధి చాలా కీలకమని చెబుతున్నారు. మేనేజ్‌మెంట్ ఆపరేటింగ్ లెవరేజ్‌ని సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల నెట్ ప్రాఫిట్ మార్జిన్ 9 శాతం నుంచి 14 శాతం వరకు పెరిగింది. సకార్ హెల్త్ కేర్ 2004లో అహ్మదాబాద్ కేంద్రంగా ప్రారంభమైంది. తక్కువ సమయంలోనే మల్టీబ్యాగర్‌గా అవతరించింది. గత వారంలో కాస్త లాభాల స్వీకరణ జరిగి 9 శాతం వరకు తగ్గినప్పటికీ, ఒక సంవత్సర కాలంలో ఈ స్టాక్ ఏకంగా 125% కి పైగా రాబడి ఇచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- ఐదు రోజుల నష్టాలకు బ్రేక్.. ముడి చమురు ధరల తగ్గుదలతో భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- IPO: ఆగస్ట్‌లో ఐపీఓల జాతర.. రూ.25 వేల కోట్లు సమీకరించనున్న కంపెనీలు..
- లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా జంప్.. ఈ మూడు కారణలతో షేర్ మార్కెట్లో ఊపు.
- Infosys: తమ సంస్థలో పని చేసిన డ్రైవర్లు, సహాయ సిబ్బందిని కోటీశ్వరులను చేసిన ఇన్ఫోసిస్..!
- Below Rs.100 Stocks: రూ.100 లోపు క్వాలిటీ స్టాక్స్ కోసం చూస్తున్నారా..!
- Multibagger Stock: ఆరు నెలల్లోనే 206 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్..