ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కొనసాగుతోంది. తాజాగా ప్రపంచ దిగ్గజ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ, టాటా గ్రూప్‌తో చేతులు కలపడం ద్వారా ఇదే ప్రాంతంలో మరో మెగా ఏఐ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా బయట ఓపెన్ ఏఐ చేపడుతున్న అతిపెద్ద ఏఐ విస్తరణ ప్రణాళికలో భాగంగా టీసీఎస్ తో కలిసి విశాఖపట్నం, పుణెల్లో డేటా సెంటర్ల ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఓపెన్ ఏఐ వ్యూహాత్మక భాగస్వామ్యంతో టీసీఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవ సంస్థగా మారాలని చూస్తోంది.
ఏఐ కంప్యూటింగ్, క్లౌడ్ సేవలు, డేటా స్టోరేజ్, ప్రభుత్వం, బ్యాంకింగ్, టెలికాం, హెల్త్ కేర్ రంగాలకు అవసరమైన ఏఐ మౌలిక సదుపాయాల్ని భారత్‌లోనే అభివృద్ధి చేయాలని టీసీఎస్ భావిస్తోంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ దీనికి కీలకం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విశాఖలో టీసీఎస్ 200 ఎకరాల భూమి కేటాయించింది. దీనికి సమీపంలోనే గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పుడు టీసీఎస్ కూడా డేటా సెంటర్ నిర్మాణం చేపడితే.. ఏపీ డేటా సెంటర్ హబ్ గా ఏదిగే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా అనకాపల్లి- విశాఖ కారిడార్ దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్‌లో ఒకటిగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీసీఎస్ డేటా సెంటర్ ఏర్పాటుకు రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని పుణెలోని బేప్ ఖేల్ లో ఆ కంపెనీకి 88 ఎకరాల భూమి ఉంది. విశాఖలో 200 ఎకరాలు ఉంది కాబట్టి ఇక్కడ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయవచ్చని చెబుతున్నారు. టీసీఎస్ కూడా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే గూగుల్ తన 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ నిర్మాణాన్ని చేపట్టింది.
టీసీఎస్ కూడా ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం దేశంలో ఏఐ డేటా సెంటర్ల పోటీ కనిపిస్తోంది. హెచ్ సీఎల్ టెక్నాలజీ ఏఐ డేటా సెంటర్ కోసం రూ.3500 కోట్లను కేటాయించింది. టీసీఎస్ హైపర్ వాల్ట్ డేటా సెంటర్ అనుబంధ సంస్థను టీపీజీ ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్‌తో కలిసి రూ. 18 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ కు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- ఐటీ షేర్లు: ఒక్కసారిగా లాభాల జోరు! అసలు రహస్యం ఇదేనా?
- TCS: టీసీఎస్ ఉద్యోగులకు షాక్.. వారికి ఈసారి ఆ ఛాన్స్ లేనట్లే..!
- TCS: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన టీసీఎస్ స్టాక్.. మిగతా ఐటీ స్టాక్స్ కూడా..!
- Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు..!
- టీసీఎస్ క్యూ1 ఫలితాలు.. రూ. 13,300 కోట్లు దాటిన లాభాలు.. ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ. 12 డివిడెండ్ ప్రకటన..
- పరాగ్ పారిఖ్: ఐటీ స్టాక్స్ కొనుగోలు వెనుక అసలు వ్యూహం ఏంటి?