టెలికాం కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నాయి. త్వరలోనే రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచే అవకాశం ఉంది. భారీగా ఖర్చు చేసి 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడం వల్ల కంపెనీలపై భారం పడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా 4జీ ధరలకు 5జీ అందించడం వల్ల లాభాలు తగ్గాయని కంపెనీలు చెబుతున్నాయి. అందుకే డైలీ 2 జీబీ అంత కంటే ఎక్కువ ప్లాన్లకే అన్ లిమిటెండ్ 5జీ సేవలు అందిస్తోన్నాయి. ప్రస్తుతం కంపెనీల ఆదాయాలు మందగించడం వల్ల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు మరో 15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది.
2016 సెప్టెంబర్ లో రిలయన్స్ జియో తొలిసారిగా వచ్చినప్పుడు కాల్స్, డేటా ఉచితంగా అందించింది. జియో రాక టెలికాం రంగంలో కీలక మార్పులు తెచ్చింది. అప్పుడు దేశం అంతటా ఫోన్ బిల్లులు చాలా తక్కువగా ఉండేవి. క్రమంగా జియో ఉచితాన్ని ఎత్తివేసింది. తర్వాత అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచుతూ వస్తున్నాయి. గడిచిన సంవత్సరాలలో టెలికామ్ కంపెనీలు తమ ధరలను చాలా సార్లు పెంచాయి. 2024 జూలైలో పెంచడం మొదలు పెట్టారు. ఖరీదైన కొత్త 5G నెట్‌వర్క్‌ల కోసం చెల్లించడానికి కంపెనీలు తమ ధరలను 10 శాతం నుంచి 25 శాతం వరకు పెంచాయి.
గతంలో రూ.200 లోపు ఉండే సాధారణ నెలవారీ ప్లాన్ ధర ఇప్పుడు దాదాపు రూ.250 నుంచి రూ.350 వరకు ఉంది. రిఛార్జ్ ధరలు మరోసారి పెంచితే.. ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. భారతదేశ టెలికాం రంగం బహుళ-సంవత్సరాల వృద్ధి, పునరుద్ధరణ దశలోకి ప్రవేశిస్తోందని ఎలారా క్యాపిటల్ పేర్కొంది. FY26-29 కాలంలో ARPU CAGR 7%కి పెరుగుతుందని అంచనా వేసింది. ఆర్ప్ పెరిగితేనే కంపెనీల ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో ప్రధానంగా జియో, ఎయిర్ టెల్ కస్టమర్లు ఎక్కువగా ఉన్నారు.
వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కూడా మంచి కస్టమర్ బేస్ ఉంది. ఇందులో ఎయిర్ టెల్, జియో మాత్రమే 5జీ సర్వీసులు అందిస్తున్నాయి. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. జియో, ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలు పెంచితే.. మిగతా కంపెనీలు కూడా ధరలు పెంచనున్నాయి. అయితే ప్రజలు ఇంటర్నెట్ కు అలవాటు పడ్డారు కాబట్టి.. ధరలు పెంచినా రీఛార్జ్ చేసుకుంటారని కంపెనీలు భావిస్తున్నాయి. 2016-24 క్యాలెండర్ సంవత్సరాల మధ్య భారతదేశంలో ప్రతి వినియోగదారుడి నెలవారీ డేటా వినియోగం 21GBకి పెరిగింది. రాబోయే దశాబ్దంలో ప్రతి చందాదారుడికి 65GBని మించిపోయేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
More Articles
- 100% సుంకాలతో మళ్లీ విరుచుకుపడిన ట్రంప్.. ఆ దేశాలకు తీవ్ర వార్నింగ్..లిస్టులో భారత్ ఉందా..
- మొబైల్ రీఛార్జ్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. 15 శాతం పెరగనున్న టారిఫ్ ప్లాన్స్..
- ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీతో గ్లోబల్ ట్రేడ్లో కలకలం.. ఉక్కు, రాగి, అల్యూమినియంపై దిగుమతి సుంకాల్లో మార్పులు..
- Trump: తీసుకున్న టారిఫ్లన్నీ తిరిగిచ్చేస్తున్న ట్రంప్.. అసలు ఏం జరిగిందంటే..
- మోదీ దూకుడు దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. భారత వస్తువులపై 50 నుండి 18 శాతానికి సుంకాలు తగ్గింపు..
- టారిఫ్ వార్లకు చెక్! ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ-ట్రేడ్ జోన్ సిద్ధం.. చైనాకు కోలుకోలేని దెబ్బ!