రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయత, ప్రముఖ ఆర్థిక నిపుణుడు తరుచుగా తన అభిప్రాయాలు, ఆలోచనలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. గతంలో చాలాసార్లు ఆయన బంగారం గురించి మాట్లాడారు. ఆలాగే ఓ వ్యక్తి ధనవంతుడు ఎలా అవుతాడో కూడా ఆయన వివరించారు. అప్పుల గురించి కూడా ఆయన చాలాసార్లు వివరించారు. అలాగే రియల్ ఎస్టేట్ గురించి, లోహాల గురించి చాలాసార్లు ప్రస్తావించారు. తాజాగా ఆయన మరోసారి బంగారం, వెండిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచ చరిత్రలో ప్రతి సామ్రాజ్యం ఒకే చక్రాన్ని అనుసరిస్తుందని ఆయన గుర్తు చేశారు.
అధికంగా కరెన్సీ ముద్రించడం చివరికి ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన తన ఫేస్‌బుక్ పోస్టులో వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ కంటే బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే సంపదను కాపాడగలవని ఆయన పేర్కొన్నారు. రోమన్ సామ్రాజ్యం నుంచి స్పెయిన్, బ్రిటన్ వరకు చరిత్రను పరిశీలిస్తే, కరెన్సీ విలువ తగ్గిన ప్రతిసారి బంగారం తన విలువను నిలబెట్టుకుందని కియోసాకి గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఎంత డబ్బునైనా ముద్రించగలవని, కానీ బంగారం లేదా వెండిని తీసుకురాలేమని స్పష్టం చేశారు.
అందుకే ధనవంతులు తమ సంపదను బంగారం, వెండి వంటి పరిమిత లభ్యత కలిగిన ఆస్తుల్లో నిల్వ చేస్తారని రాబర్ట్ కియోసాకి తెలిపారు. ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని క్రమంగా తగ్గిస్తుందని తెలిపారు. అలాంటి సమయంలో బంగారం, వెండి కొనుగోలు శక్తిని రక్షించే సాధనాలుగా పనిచేస్తాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాలపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నట్లు కనిపించినా, వాస్తవానికి కరెన్సీ విలువే తగ్గుతోందని వివరించారు. తాను అమెరికా అంతమవుతుందని చెప్పడం లేదని, అయితే అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గే దిశగా సాగుతోందని కియోసాకి తెలిపారు.
చరిత్రలో కరెన్సీ విలువను అధికంగా తగ్గించిన ప్రతి సామ్రాజ్యం చివరకు తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. బంగారం, వెండి ఒక్క రాత్రిలో ధనవంతులను చేసే పెట్టుబడులు కాదని, ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షించే ఫైనాన్షియల్ లైఫ్‌బోట్లు అని తెలిపారు. పరిస్థితులు మరింత క్లిష్టం అయ్యే వరకు వేచి చూడకుండా, చిన్న మొత్తంతో అయినా వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలోని బంగారం కొనుగోలు చేసి నిజమైన సంపదను కూడబెట్టడం ప్రారంభించాలని సూచించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Multibagger Stock: ఐదేళ్లలో 1000 శాతానికి పైగా రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Indo-MIM: లిస్టింగ్ రోజే భారీ లాభాలను అందించిన స్టాక్.. 45 శాతం ప్రీమియంలో లిస్ట్ అయిన ఇండో ఎంఐఎం షేర్లు..
- Multibagger Stock: ఆరు నెలల్లోనే 206 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్..
- Multibagger stock: ఐదేళ్లలో 354 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Money Management: సంపాదిస్తే సరిపోదు గురూ.. పొదుపు కూడా చేయాలి..!
- Focused Mutual Funds: రిస్క్ తో రివార్డు కావాలనుకుంటున్నారా.. అయితే అందులో పెట్టుబడి పెట్టండి..!