భారతదేశ రైల్వేలో వందే భారత్ రైళ్లు భారీ మార్పులు తీసుకొచ్చాయి. వందే భారత్ రైళ్ల రాకతో రైల్వే స్వరూపమే మారిపోయింది. చాలా మార్గాల్లో వందే భారత్ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అయితే మొదట్లో కూర్చుని వెళ్లడానికి మాత్రమే వందే భారత్ రైళ్లను తయారు చేశారు. కానీ.. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలో ఒక మార్గంలోనే వందే భారత్ స్లీపర్ రైలు రాకపోకలు సాగిస్తోంది. మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి అస్సాంలోని గువహతి మధ్య నడుస్తోంది. 2026 జనవరి 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించారు.

Advertisement

వందే భారత్ స్లీపర్ రైలు అధునాతన సౌకర్యాలు ఉంటాయి. చక్కనైనా సీట్లు, పడుకోవడానికి మంచి బెర్తులు కూడా ఉన్నాయి. రెండో వంద భారత్ ట్రయల్ రన్ కొనసాగుతోంది.
త్వరలో ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ ప్రారంభం కానుంది. వందే భారత్ స్లీపర్ లో ఫస్ట్ ఏసీతో పాటు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లు కూడా ఆధునిక సదుపాయాలతో అందుబాటులో ఉండనున్నాయి. ఆటోమేటిక్ డోర్లు, బయో-వాక్యూం టాయిలెట్లు, మెరుగైన లైటింగ్, ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్లు, సీసీటీవీ వంటి ఆధునిక సదుపాయాలు ఆకర్షణగా నిలిస్తున్నాయి.

Advertisement

తాజాగా మరో వందే భారత్ స్లీపర్ రైలు నడపాలని ప్రతిపాదనలు వచ్చాయి. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలు నడపడానికి రైల్వే ప్లాన్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఈ రెండు ప్రధాన నగరాల మధ్య అధునాతన వందేభారత్‌ స్లీపర్‌ను నడపాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ తాజాగా ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందుకు సాధ్యాసాధ్యాలు, మార్గమధ్యంలో ఇతర రైళ్ల క్రాసింగ్స్, ప్రతిపాదిత టైమింగ్స్, తలెత్తే ఇబ్బందులు తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని దక్షిణ పశ్చిమ రైల్వే జోన్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డీఆర్‌ఎంలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సీపీటీఎం షిఫాలీ కుమార్‌ ఆదేశించారు.

Advertisement

ఆయా డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ రిపోర్టు వచ్చిన అనంతరం రైల్వే బోర్డుకు తుది ప్రతిపాదనలు పంపుతారని తెలుస్తోంది. రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన వెంటనే దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ వందేభారత్‌ స్లీపర్‌ రైలు విశాఖ నుంచి పట్టాలెక్క అవకాశం ఉంది. ప్రతిపాదనల ప్రకారం వారంలో ఆరు రోజుల పాటు రాత్రిళ్లు ఈ సర్వీస్‌ నడుస్తుందని సమాచారం. రైలు విశాఖలో బయలుదేరిన తర్వాత దువ్వాడ, విజయవాడ, కృష్ణా కెనాల్‌ జంక్షన్, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం మీదుగా బెంగళూరు చేరుకునేలా ప్రతిపాదనలు చేశారు. అయితే వందే భారత్ స్లీపర్ రైలు ఈ మార్గంలో నడపడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.