మెటా, గూగుల్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసుకోవచ్చని ముంబై హైకోర్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి అనుమతి ఇచ్చింది. దీంతో గడ్కరీ సోషల్ మీడియా సంస్థలపై దావా వేయనున్నారు. ఈ20 పెట్రోల్ తో తన కుటుంబం లాభపడుతుందని సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తనకు పరువు నష్టం కలిగించేలా ప్రచారం జరుగుతోందని గడ్కరీ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. మెటా, గూగుల్ తోపాటు పలు సోషల్ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన కోరారు. దీనికి ముంబై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరువు నష్టం కలిగించే కంటెంట్ ముంబైలో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుందని.. అందుకే ఈ కేసును ఇక్కడి హైకోర్టు కూ డా విచారించవచ్చని గడ్కరీ తరఫు న్యాయవాది వాదించారు.
దీనిని అంగీకరించిన కోర్టు దావా దాఖలు చేసేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ20 పెట్రోల్ కు తానే బాధ్యుడను అయినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. E20 పెట్రోల్ లో కలిపి ఇథనాల్ మిశ్రమం ద్వారా తన కుటుంబం లబ్ధి పొందుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గడ్కరీ పేరు, ఫొటో గొంతును ఏఐ సహాయంతో మార్చీ డీప్ ఫేక్ కంటెంట్ క్రియేయ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. నితిన్ గడ్కరీ పరువుకు భంగం కలిగేలా పోస్టులు చేస్తున్నారని అన్నారు.
చట్టబద్దమైన విమర్శలు, ఆరోపణలకు తాను వ్యతిరేకం కాదని గడ్కరీ స్పష్టం చేశారు. కానీ తప్పుడు ఆరోపణలు, డీప్‌ఫేక్ ప్రచారంపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఈ20 పెట్రోల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలుపుతారు. అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడానికి, ముడి చమురు దిగుమతి తగ్గించుకోవడానికి పెట్రోల్ లో ఇథనాల్ కలుపుతున్నారు. అయితే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
మైలేజ్ తగ్గుతుందని, ఇంజన్ చెడిపోతున్నాయని చాలా మంది చెబుతున్నారు. అయితే కొత్త వాహనాలు ఇథనాల్ పెట్రోల్ ను తట్టుకోగలవని చెబుతున్నారు. పాత వాహనాల్లో మైలేజ్ తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. వెంటనే పెట్రోల్ లో ఇథనాలు కలపడం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలంటూ కొత్త ఉద్యమం.. స్వచ్ఛమైన పెట్రోల్ మా హక్కు అంటూ పుట్టుకొచ్చిన E20 జనతా పార్టీ
- Hyderabad: హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే..!
- ఇక టోల్ గేట్ల దగ్గర వెయిటింగ్ లేదు! 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు.. కేంద్రం సంచలన నిర్ణయం!
- ఈ ఏడాది చివరి నుంచి టోల్ ప్లాజాలు రద్దు.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. కొత్తగా ఏం తెస్తున్నారంటే..
- Bengaluru: బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే! నితిన్ గడ్కరీ సూపర్ అప్డేట్! ఎప్పటినుంచంటే..
- టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు, ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన