దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో 4 కోట్ల ఫోలియోల (పెట్టుబడి ఖాతాల) మైలురాయిని అధిగమించిన మొదటి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ నిలిచింది.అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi) డేటా ప్రకారం, జూన్ చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మొత్తం 27.86 కోట్ల ఫోలియోలు ఉన్నాయి. అందులో నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాటా 14.4 శాతం (4.02 కోట్ల ఫోలియోలు)గా ఉంది.

Advertisement

దాదాపు 14.4శాతం వాటాను నిప్పాన్ ఇండియాకు ఉంది. ఇండస్ట్రీలోని 6.19 కోట్ల మంది యూనిక్ ఇన్వెస్టర్లలో 39శాతం మంది ఈ ఫండ్ హౌస్‌‌‌‌‌‌‌‌తోనే ఉన్నారు. కుటుంబాల పొదుపులను భారత క్యాపిటల్ మార్కెట్లలోకి మళ్లించడంలో నిరంతరం కృషి చేస్తున్నామని ఈ బ్రాండ్ పేరెంట్ కంపెనీ నిప్పాన్‌‌‌‌ లైఫ్ ఇండియా ఏఎంసీ ఎండీ సందీప్ సిక్కా చెప్పారు. అలాగే, పరిశ్రమలోని మొత్తం 6.19 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారులలో 39 శాతం మంది (అంటే 2.41 కోట్లు) తమ వద్దే ఉన్నారని, తద్వారా పరిశ్రమలోనే అతిపెద్ద ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్యను కలిగి ఉన్నామని ఆ సంస్థ వివరించింది.

Advertisement

"4 కోట్ల మంది పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందడం, భారతదేశంలోని ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్యలో 39 శాతం వాటాను కలిగి ఉండటం మాకు ఎంతో గర్వకారణం. లక్షలాది మంది చిన్న పెట్టుబడిదారుల కోసం మేము సాధ్యం చేసిన సంపద సృష్టి ప్రయాణానికి ఈ మైలురాయి ఒక నిదర్శనం" అని నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ ఎండీ, సీఈఓ సందీప్ సిక్కా అన్నారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో జపనీస్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తూనే, గృహ పొదుపులను భారతీయ మూలధన మార్కెట్లలోకి మళ్లించే పనిని కంపెనీ కొనసాగిస్తోందని ఆయన తెలిపారు.

Advertisement

ఇతర ప్రధాన ఫండ్ సంస్థల విషయానికొస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ 3.18 కోట్ల ఫోలియోలతో రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ 3.11 కోట్ల పోలియోలతో మూడో స్థానంలో ఉంది. ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ 2.24 కోట్ల పోలియోలతో నాల్గొ స్థానంలో ఉండగా.. యుటిఐ మ్యూచువల్ ఫండ్ 1.42 కోట్ల పోలియోలతో ఐదో స్థానంలో నిలిచింది. ఫోలియోల సంఖ్య పరంగా మొదటి 10 స్థానాల్లో నిలిచిన మిగిలిన సంస్థలలో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ 1.35 కోట్లు, టాటా మ్యూచువల్ ఫండ్ 1.28 కోట్లు, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ 1.19 కోట్లు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ 1.11 కోట్లు, డిఎస్‌పి మ్యూచువల్ ఫండ్ 1.03 కోట్లు పోలియోలు కలిగి ఉంది.

Advertisement

మొత్తంగా చూస్తే అగ్రశ్రేణి 10 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల వద్ద 19.94 కోట్ల పోలియోలు ఉండగా.. మిగిలిన ఫండ్ సంస్థల వద్ద 7.92 కోట్ల ఫోలియోలు ఉన్నాయి. జూన్ చివరి నాటికి పరిశ్రమలో 6.19 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారులు ఉన్నారు. అంటే సగటు పెట్టుబడిదారుడు వివిధ పథకాలు, ఫండ్ సంస్థలలో ఒకటి కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ ఖాతాలను కలిగి ఉన్నారని ఇది సూచిస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.